మదనపల్లె
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
?మదనపల్లె మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | మదనపల్లె |
జిల్లా(లు) | చిత్తూరు |
గ్రామాలు | 19 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
190,512 (2001) • 96968 • 93544 • 69.11 • 78.97 • 58.95 |
అక్షాంశరేఖాంశాలు:
మదనపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] చరిత్ర
[మార్చు] మదనపల్లె గురించి
ఇవన్నీ మదనపల్లె :
- మదనపల్లె రెవెన్యూ డివిజన్
- మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం
- మదనపల్లె తాలూకా (పాత)
- మదనపల్లె రెవెన్యూ మండలం
- మదనపల్లె పురపాలక సంఘం
- మదనపల్లె (గ్రామీణ)
[మార్చు] మదనపల్లె ప్రాముఖ్యం
- ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్. చిత్తూరు జిల్లాలో గల మూడు రెవెన్యూ డివిజన్లు చిత్తూరు, తిరుపతి (చంద్రగిరి) మరియు మదనపల్లె. ఇందులో మదనపల్లె అతి పెద్ద డివిజన్. చిత్తూరు జిల్లాలో మొత్తం 65 మండలాలుంటే అందులో 31 మండలాలు మదనపల్లె డివిజన్ లోనేవున్నాయి.
- చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద విద్యారంగ డివిజన్.
- మదనపల్లె మునిసిపాలిటి ఆంధ్రప్రదేశ్ లోనే ఉత్తమమైనదిగా గుర్తింపబడినది.
- మదనపల్లె మునిసిపాలిటి చిత్తూరు జిల్లాలో అత్యంత ఆదాయమూ, వనరులూ గల మునిసిపాలిటీగా గుర్తింపు పొందింది.
[మార్చు] వాతావరణం
మదనపల్లె వాతావరణము వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ఆంధ్ర ఊటీ అనే పేరు కలదు. ప్రతి ఉద్యోగి పదవీవిరమణ తరువాత ఇక్కడ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. పెన్షనర్ల స్వర్గం గా కూడా ప్రసిధ్ధి.
[మార్చు] ముఖ్యమైన ప్రదేశాలు
- హార్స్లీ హిల్స్- ఆంధ్రరాష్ట్రంలో ప్రసిధ్ధి చెందిన(ఆంధ్రా ఊటీ అని పిలువబడే) వేసవి విడిది ప్రాంతము.
- బోయ కొండ- ప్రసిధ్ధి చెందిన గంగమ్మ క్షేత్రము.
- బసిని కొండ- వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి)ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది.
- సోంపాళెం
- రిషి వ్యాలీ - జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విధ్యార్థులకు విడిది మరియు భోజన సదుపాయాలు కలవు. ఇక్కడ విధ్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విధ్యాభోధన జరుగుతుంది.
- ఆరోగ్యవరం(శానిటోరియం)-దేశప్రసిధ్ధి చెందిన క్షయవ్యాధిగ్రస్థుల ఆరోగ్యకేంద్రము. పూర్వము అన్ని ప్రదేశాలలో క్షయవ్యాధికి వైద్యసదుపాయాలు లేనప్పుడు, దేశం నలుమూలలనుండి సామాన్యులూ, ప్రముఖులెందరో ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకున్నారు.
- బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)- దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.అనీ బెసెంట్ పేరున స్థాపించబడింది.
- ఠాగూర్ కాటేజీ
- నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.
[మార్చు] ప్రముఖ వ్యక్తులు
- జిడ్డు కృష్ణమూర్తి - అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ తత్వవేత్త
- అబ్దుల్ అజీమ్ - ఉర్దూ కవి
- ఎగ్గోని శ్యాంసుందర్ - రచయిత
- ఎద్దుల శంకరనారాయణ - కవి
- ఖమర్ అమీని - ఉర్దూ కవి
- కలువకుంట్ల గురునాథ పిళ్ళై - రచయిత
- కవిమలం నారాయణ మూర్తి - రచయిత
- టీ. యెస్. ఏ. కృష్ణమూర్తి - రచయిత
- కీ.శే.డా.కె.కృష్ణమూర్తి- వైద్యులు.ఏభై సంవత్సరాలకు పైగా లాభాపేక్ష లేకుండా వైద్యసేవలను అందించి, "భిషగ్వరరత్న" అనే బిరుదును కైవసం చేసుకున్నారు.
- కీ.శే. ఈర్.యెస్.సుదర్శనం - సాహితీ బ్రహ్మర్షి బిరుదాంకితులు రచయిత, అనువాదకులు, కవి, పండితులు, విమర్శకులు
- కీ.శే. గాండీవి కృష్ణమూర్తి - రచయిత
- గాడేపల్లి శివరామయ్య - కవి
- కీ. శే. చౌడప్ప - రచయిత
- డా. కె.ఎం.డీ.హెన్రీ - రసవిహారి బిరుదాంకితులు, రచయిత
- డా. జూళిపాళెం మంగమ్మ - రచయిత్రి
- డా. మల్లెల గురవయ్య - కవి
- పురాణం త్యాగమూర్తి శర్మ - రచయిత
- పుష్పాంజలి - రచయిత్రి
- కీ. శే. మేడవరం వెంకటనారాయణ శర్మ - రచయిత
- రాజారావు - రచయిత
- వల్లంపాటి వెంకటసుబ్బయ్య - విమర్శకులు
- వాసా కృష్ణమూర్తి - కవి
- శ్రీమతి ఆర్. వసుందరాదేవి - రచయిత్రి
- పన్నూరు శ్రీపతి - ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పని చేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత.
- రమప్రభ - ప్రముఖ నటి. మదనపల్లెలో జన్మించారు.[1]
[మార్చు] రాజకీయాలు
- పార్లమెంటు నియోజక వర్గం : రాజంపేట, ప్రస్తుత ఎమ్.పీ. : ఎ.సాయిప్రతాప్ (కాంగ్రెస్ పార్టీ)
- అసెంబ్లీ నియోజక వర్గం : (144) 'మదనపల్లె', ప్రస్తుత ఎమ్.ఎల్.ఎ. : దొమ్మలపాటి రమేష్ (తెలుగు దేశం పార్టీ)
- మునిసిపాలిటి : మదనపల్లె. ప్రస్తుత ఛైర్ పర్సన్: ఎన్. రవికుమార్ (కాంగ్రెస్ పార్టీ)
[మార్చు] మదనపల్లె నాటక కళాపరిషత్
35 ఏళ్ళ కిందట మదనపల్లె నాటక కళాపరిషత్ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి జయరామిరెడ్డి న్యాయవాదులు బోయపాటి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీకాంతం, బి.నర్సింహులు, పార్థసారధి, కాంట్రాక్టర్లు రామన్న, కిట్టన్న, పెరవళి కృష్ణమూర్తి, అశ్వర్థనారాయణ, జర్నలిస్టు పురాణం త్యాగమూర్తి శర్మ, గాయకుడు పత్తి రెడ్డన్న, ఫోటోగ్రాఫర్ బి.నారాయణశర్మ, ఉపాధ్యాయులు ఎ.సుబ్రమణ్యం, ఉద్యోగి జివి రమణలు కీలకపాత్ర పోషించారు. వీరు సభ్యులుగా, నటులుగా ఎన్నో నాటకాలు వేశారు. నెల్లూరు కు చెందిన నెప్జా నాటక కళాపరిషత్, ప్రొద్దుటూరు కు చెందిన రాయల నాటక కళాపరిషత్ అనంతపురము కు చెందిన పరిత కళాపరిషత్, చిత్తూరు కు చెందిన ఆర్ట్స్ లవర్ అసోసియేషన్ నిర్వహించే నాటక పోటీల్లో మదనపల్లె నాటక కళా పరిషత్ పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మదనపల్లె నాటక రంగంలో ప్రధానంగా పల్లెపడుచు, భక్త రామదాసు, వెంకన్న కాపురం, ఎవరు దొంగ, కప్పలు తదితర సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను వేశారు. మదనపల్లె జిఆర్‌టి హై స్కూల్‌లో రోజుకు నాలుగు దాకా నాటకాలు వేశేవారు. పోటీలు నిర్వహించి వారం రోజుల పాటు నిరవధికంగా నాటకాలు వేసేవారు. నాటకాల్లో మహిళా పాత్రదారులు గూడూరు సావిత్రి, సీతారామమ్మ, రాజేశ్వరీ తదితరులు వచ్చేవారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించేది.
[మార్చు] అంజుమన్ తరఖి ఉర్దూ (మదనపల్లె శాఖ)
22 సంవత్సరాల క్రిందట అంజుమన్ తరఖి ఉర్దూ శాఖ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గులాందస్తగీర్, సయ్యద్ అబ్దుల్ అజీం, నిసార్ అహ్మద్ సయ్యద్, ఖాదర్ హుసేన్ లు కీలక పాత్ర పోషించారు. ఖమర్ అమీనీ, జవాహర్ హుసేన్, అడ్వకేట్ నజీర్ అహ్మద్, షరాఫత్ అలీ ఖాన్, సికందర్ అలీ ఖాన్, మహమ్మద్ ఖాన్ మరియు మహమ్మద్ అక్రం లు తమవంతూ కృషి చేశారు. ఉర్దూ భాషాభి వృధ్ధికి, సాహిత్యపోషణకు ఎన్నో పోటీలను వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ముషాయిరా లు (కవిసమ్మేళనాలు), సెమినార్లు నిర్వహించారు. మదనపల్లెలో ముషాయిరాల సాంప్రదాయం సయ్యద్ అబ్దుల్ అజీం మరియు గులాం దస్తగీర్ ఆధ్వర్యంలో ప్రారంభమయినాయి. నిసార్ అహ్మద్ సయ్యద్ మరియు ఖమీర్ అమీనీ ల ఆధ్వర్యంలో జీవంపోసుకున్నాయి.
[మార్చు] మతపరమైన విషయాలు
మదనపల్లె పట్టణం సార్వజనీయ పట్టణం. విద్యాధికులు గల పట్టణం. హిందువులూ, ముస్లింలూ మరియు క్రైస్తవులు కలసి సుఖశాంతులతో జీవించే పట్టణం. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ కే ఆదర్శం. ఇచట శ్రీ వేంకటేశ్వర దేవాలయం, జామా మస్జిద్ మరియు ఛాంబర్లియన్ చర్చి ప్రసిద్ధమైనవి.
[మార్చు] పట్టణంలో విద్యాలయాలు
మదనపల్లె లో విద్య రాను రాను వికసిస్తోంది, చదువరులు విద్యార్థులు పెరుగుతున్నారు.
- 1936వ సంవత్సరంలో స్థాపింపబడిన బోర్డు హైస్కూల్, ప్రస్తుతం జిల్లా పరిషత్ హైస్కూల్, జిల్లాలోనే అతి పెద్ద ఉన్నత పాఠశాల. గిరిరావు థియోసాఫికల్ హైస్కూల్, హోప్ హైస్కూల్, హోప్ మునిసిపల్ హైస్కూల్, మునిసిపల్ ఉర్దూ హైస్కూల్, సి.ఎస్.ఐ.బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, రామారావు పాఠశాల ముఖ్యమైనవి. ఇవియేగాక ఓ పాతిక ప్రైవేటు హైస్కూల్స్ గలవు.
- బి.టి.కాలేజ్, ప్రభుత్వ బాలికల కాలేజ్ లు ముఖ్యమైనవి. ఇవి గాక నాలుగు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మరియు పది జూనియర్ కాలేజీలు గలవు.
- సాంకేతిక విద్యా సంస్థలూ, బి.ఎడ్., ఇంజనీరింగ్, నర్శింగ్, పాలిటెక్నిక్ సంస్థలూ గలవు.
- నవోదయ పాఠశాల గలదు.
[మార్చు] ఆరోగ్య సదుపాయాలు
మదనపల్లెలో హాస్పిటల్స్ ఎక్కువ. ఆరోగ్యవరం, ఎమ్.ఎల్.ఎల్.హాస్పిటల్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి పేరు గలవి. గడచిన కాలంలో వైద్య సేవలకు ఘనమైన పేరుగల మదనపల్లె, నేడు అడుగడుగునా నర్సింగ్ హోంలు వెలసిననూ, ఆ పేరును కాలక్రమేణా కోల్పోతున్నది. వ్యాపారరంగంగా మారుతున్న వైద్యరంగాన్ని, సేవారంగంగా తిరిగీ తన స్థానాన్ని కలుగ జేయవలెను. అనేక విభాగాలలో స్పెషలిస్టులు లేని కారణంగా రోగులను తిరుపతి గాని బెంగళూరు గాని వైద్యసేవలకొరకు తరలడం సాధారణంగా కానవస్తుంది.
[మార్చు] పరిశ్రమలు
- మదనపల్లి స్పిన్నింగ్ మిల్ (సి.టి.యం.)
- పట్టు పరిశ్రమలు (నీరుగట్టువారిపల్లి)
- కోమల్ బిస్కట్ ఫ్యాక్టరీ
- గార్మెంట్ పరిశ్రమ
- ఫుడ్ ఇండస్ట్రీస్
[మార్చు] పంటలు
ముఖ్యంగా, టమోటా, వేరుశెనగ, వరి మరియు కూరగాయలు పండిస్తారు.
[మార్చు] రవాణా సౌకర్యాలు
- మదనపల్లెలో ఆం.ప్ర.రో.ర.సం. వారి రెండు బస్ డిపోలు గలవు.
- రైల్వే స్టేషన్, 10 కి.మీ. దూరంలో సి.టి.యం.రోడ్డులో 'మదనపల్లె రైల్వే స్టేషన్' పేరుతో గలదు.
- ట్రాన్స్ పోర్టు కొరకు లారీలెక్కువ. ఈ లారీలు ప్రధానంగా టమోటా, వరి, బియ్యం మరియు వేరుశెనగ రవాణా కొరకు వుపయోగకరంగా వున్నవి.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- మదనపల్లె (మునిసిపాలిటి)
- మదనపల్లె (గ్రామీణ) (మండలము)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- కోళ్లబైలు (గ్రామీణ)
- పొన్నేటిపాలెం (గ్రామీణ)
- వేంపల్లె
- మాలెపాడు
- తేనీగలవారిపల్లె
- పెంచుపాడు
- మదనపల్లె (గ్రామీణ)
- అంకిసెట్టిపల్లె
- చిప్పిలి
- పప్పిరెడ్డిపల్లె
- కొత్తవారిపల్లె
- చిన్నతిప్పసముద్రం
- కాశిరావుపేట
- పోతపాలు
- వెంకప్పకోట
- బసినికొండ (గ్రామీణ)
- పామయ్యగారిపల్లె
- మొలకలదిన్నె
- వలసపల్లె
- సందిరెడ్దిపల్లె
[మార్చు] కొన్ని విశేషాలు
- మదనపల్లెలోని టీబీ ఆసుపత్రిలో 'చందమామ' రూపకర్తలలో ఒకరైన చక్రపాణి కొంతకాలం చికిత్స చేయించుకున్నారు.
- "ఆ నలుగురు" సినిమా రచయిత "పెళ్ళైన కొత్తలో" సినిమా దర్శక నిర్మాత అయిన మదన్ మదనపల్లెలో బిసెంట్ థియోసాఫికల్ కాలేజీలో చదువుకున్నారు.
- ఎన్నికల ప్రచారం కోసం ఇందిరా గాంధీ మదనపల్లె వచ్చిప్పుడే కాంగ్రెస్(ఐ) కు ఎన్నికల కమీషన్ హస్తం గుర్తు కేటాయించింది.
- 1919వ సంవత్సరంలో రవీంద్రనాథ్ టాగోర్ మదనపల్లెకు వచ్చారు.
- విశ్వకవి రవీంద్రుడు మన జాతీయగీతాన్ని ఆంగ్లంలోనికి మదనపల్లెలోనే అనువదించినాడని ప్రతీతి.
- ఆంధ్రరాష్ట్ర మాజీముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మదనపల్లెలోని బి.టి. కశాశాలలో విధ్యాభ్యాసం చేశారు.
- మదనపల్లె మరియు ఆ పరిసర ప్రాంతాలు టమోటా పంటలకు ప్రసిధ్ధి.
- బాహుదా నది పట్టణము మధ్యలో ప్రవహించును. సాధారణంగా మామూలు కాలువలా ఉండే బాహుదా 1996 సంలో వరదల కారణంగా ప్రవాహము హెచ్చి ప్రాణ నష్టం జరిగింది.
[మార్చు] మూలాలు
- ↑ తెలుగుసినిమా.కాం వెబ్‌సైటులో శ్రీ అట్లూరి ఇంటర్వ్యూ, సేకరించిన తేదీ: జులై 20, 2007
[మార్చు] బయటి లింకులు
- టైంస్ ఆఫ్ ఇండియా లో మదనపల్లె గురించి సంపాదకీయం
- ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారి లింకు
- బీ.టీ కాలేజీ అధికారిక సైటు
- రిషి వ్యాలీ బడి అధికారిక సైటు
- బీ.టీ కాలేజీ గురించి హిందూ దినపత్రికలో వ్యాసం
|
|
---|---|
పెద్దమండ్యం • తంబళ్లపల్లె • ములకలచెరువు • పెద్దతిప్ప సముద్రం • బీ.కొత్తకోట • కురబలకోట • గుర్రంకొండ • కలకడ • కంభంవారిపల్లె • యెర్రావారిపాలెం • తిరుపతి పట్టణం • రేణిగుంట • యేర్పేడు • శ్రీకాళహస్తి • తొట్టంబేడు • బుచ్చినాయుడు ఖండ్రిగ • వరదయ్యపాలెం • సత్యవీడు • నాగలాపురం • పిచ్చాటూరు • విజయపురం • నింద్ర • కె.వీ.పీ.పురం • నారాయణవనం • వడమలపేట • తిరుపతి గ్రామీణ • రామచంద్రాపురం • చంద్రగిరి • చిన్నగొట్టిగల్లు • రొంపిచెర్ల • పీలేరు • కలికిరి • వాయల్పాడు • నిమ్మన్నపల్లె • మదనపల్లె • రామసముద్రం • పుంగనూరు • చౌడేపల్లె • సోమల • సదుం • పులిచెర్ల • పాకాల • వెదురుకుప్పం • పుత్తూరు • నగరి • కార్వేటినగరం • శ్రీరంగరాజపురం • పాలసముద్రం • గంగాధర నెల్లూరు • పెనుమూరు • పూతలపట్టు • ఐరాల • తవనంపల్లె • చిత్తూరు • గుడిపాల • యడమరి • బంగారుపాలెం • పలమనేరు • గంగవరం • పెద్దపంజని • బైరెడ్డిపల్లె • వెంకటగిరి కోట • రామకుప్పం • శాంతిపురం • గుడిపల్లె • కుప్పం |