చక్రపాణి
వికీపీడియా నుండి
ఇదే పేరుగల సినిమా కోసం చక్రపాణి (1954) చూడండి.
ఆలూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి) ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు. చక్రపాణి గుంటూరు జిల్లా తెనాలిలో 1908, ఆగష్టు 5న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించారు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై హైస్కూలు విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించారు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న వ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించారు. 'చక్రపాణి' అనే కలం పేరును వీరికి అతనే ప్రసాదించారు. తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందారు. క్షయ వ్యాధిగ్రస్తుడై 1932లో మదనపల్లి లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళారు. అక్కడే కొన్ని నెలలు ఉండి, ఒక సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో బెంగాలీ భాష కూడా నేర్చుకొన్నారు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను తెలుగులోకి అనువదించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా శరత్‌బాబు నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే - శరత్‌బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టారు.
1940లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ధర్మపత్ని కోసం వీరు మాటలు రాసారు. బి.ఎన్.రెడ్డి గారు రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు రాయడానికి చెన్నై వెళ్ళారు.
1949-1950లో నాగిరెడ్డి, చక్రపాణి కలవడం, కలసి విజయా ప్రొడక్షన్స్ ను స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డిగారితో కలసి పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు.
1934-1935లో కొడవటిగంటి కుటుంబరావుతో కలసి తెనాలిలో యువ మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించారు. 1960లో దీనిని హైదరాబాదుకు తరలించారు.
వీరు సెప్టెంబరు 24, 1975 సంవత్సరంలో పరమపదించారు.
విషయ సూచిక |
[మార్చు] చిత్ర సమాహారం
[మార్చు] రచయితగా
- స్వయంవర్ (1980) (story)
- శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976) (writer)
- జూలీ (1975) (screen adaptation)
- Gundamma Katha (1962) (story)
- Manithan Maravillai (1962) (screen adaptation)
- Rechukka Pragatichukka (1959) (screen adaptation)
- Appu Chesi Pappu Koodu (1958) (adaptation)
- Maya Bazaar (1957/II) (screen adaptation)
- Missamma (1955) (writer)
- Missiamma (1955) (writer)
- Chandraharam (1954) (writer)
- Pelli Chesi Choodu (1952) (writer)
- Shavukaru (1950) (writer)
- Swargaseema (1945) (dialogue) (story)
- Dharmapatni (1941/I) (dialogue)
- Dharmapatni (1941/II) (dialogue)
[మార్చు] నిర్మాతగా
- శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976) (producer)
- జూలీ (1975) (producer) (as B. Nagi Reddi-Chakrapani)
- గంగ మంగ (1973) (producer)
- రామ్ ఔర్ ష్యామ్ (1967) (producer)
- గుండమ్మ కథ (1962) (producer)
- మనిదన్ మారవిల్లై (1962) (producer)
- రేచుక్క పగటిచుక్క (1959) (producer)
- అప్పుచేసి పప్పుకూడు (1958) (producer)
- మాయా బజార్ (1957/I) (producer)
- మిస్సమ్మ (1955) (producer)
- చంద్రహారం (1954) (producer)
- పెళ్ళి చేసి చూడు (1952) (producer)
- పాతాళ భైరవి (1951) (producer)
- షావుకారు (1950) (producer)
[మార్చు] దర్శకుడిగా
- శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976)
- అరస కత్తలి (1967)
- మనిదన్ మారవిల్లై (1962)