క్షయ
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
Chest X-ray of a patient suffering from tuberculosis | ||
ICD-10 | A15.-A19. | |
ICD-9 | 010-018 | |
OMIM | 607948 | |
DiseasesDB | 8515 | |
MedlinePlus | 000077 మూస:MedlinePlus2 | |
eMedicine | med/2324 emerg/618 radio/411 | |
MeSH | C01.252.410.040.552.846 |
క్షయవ్యాధి (Tuberculosis) ఒక ముఖ్యమైన అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినదని మనకు తెలిసినా, చర్మము నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగనికైనా ఈవ్యాధి సోకవచ్చును. మనదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ముఖ్యమైనది క్షయవ్యాధి. మైకోబాక్టీరియా అను సూక్ష్మక్రిమివలన ఈ వ్యాధి వస్తుంది.క్షయ వ్యాధి సోకని శరీరావయవాలు క్లోమము,థైరాయిడ్ గ్రంధి, జుట్టు, మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలుగుతుంది.
డా. రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882 న గుర్తించారు. ఇందుకుగాను 1905 లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది.
[మార్చు] రోగ నిర్ధారణ
ఈ రోగాన్ని పూర్తిస్థాయిలో గుర్తించడం కష్టం. రక్త పరీక్షలు, మాంటూ చర్మపరీక్ష, కళ్లెలో మైకోబాక్టీరియా సూక్ష్మక్రిముల్ని గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు. కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.