ఊపిరితిత్తులు
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఊపిరితిత్తులు (Lungs) శ్వాసవ్యవస్థకు మూలాధారాలు. ప్రాణవాయువు (Oxygen) ను బయటి వాతావరణంనుండి గ్రహించి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను మనశరీరంనుండి బయటకు పంపించడం వీని ముఖ్యమైన పని. ఛాతీలో ఇవి గుండెకు ఇరువైపులా ప్రక్కటెముకలతో రక్షించబడి ఉంటాయి.
ఊపిరి తిత్తులు గాలిని-శ్వాసించు వెన్నెముక గల జీవులలో శ్వాసక్రియ కొరకు ప్రధాన అంగములు (భూ మరియు వాయు చరాలలో ఇవి ప్రధానం. జలచరాలలో మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను గ్రహింపబడుతుంది). ఈ ఊపిరి తిత్తులు శరీరంలోని రొమ్ముభాగంలో గుండె కు ఇరువైపులా అమర్చబడివుంటాయి. వీటి ప్రధాన కార్యక్రమం భూవాతావతరణములోగల ఆక్సిజన్ ను గ్రహించి రక్తము లో చేరవేస్తాయి, మరియు రక్తమునందలి కార్బన్ డై ఆక్సైడు ను వాతావరణములోకి చేరవేస్తాయి.