ఛాతీ
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఛాతీ (Chest) మానవుని శరీరంలో మొండెం పైభాగంలో మెడకి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన గుండె మరియు ఊపిరితిత్తులు ఒక ఎముకలగూటిలో భద్రపరచబడ్డాయి. అన్నవాహిక వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు ప్రక్కటెముకలు, వెన్నెముకలు మరియు భుజములతో తయారుచేయబడింది. డయాఫ్రమ్ అను కండరంద్వారా ఇది ఉదరమునుండి వేరుచేయబడింది.