షావుకారు
వికీపీడియా నుండి
షావుకారు (1950) | |
అప్పటి సినిమా పోస్టరు [1] |
|
---|---|
దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్ |
నిర్మాణం | నాగిరెడ్డి, చక్రపాణి |
రచన | చక్రపాణి |
కథ | చక్రపాణి |
తారాగణం | షావుకారు జానకి, నందమూరి తారక రామారావు, గోవిందరాజులు సుబ్బారావు, ఎస్.వి.రంగారావు, శాంతకుమారి, పద్మనాభం, వల్లభజోస్యుల శివరాం, వంగర, కనకం, శ్రీవాత్సవ, మాధవపెద్ది సత్యం, మోపర్రు దాసు |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, కృష్ణవేణి జిక్కి, ఎమ్.ఎస్.రామారావు, పిఠాపురం నాగేశ్వరరావు, బాలసరస్వతీరావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | మార్కస్ బార్ట్‌లే |
కళ | మాధవపెద్ది గోఖలే |
కూర్పు | నాగిరెడ్డి |
నిర్మాణ సంస్థ | విజయా వారి చిత్రం |
విడుదల తేదీ | 7 ఏప్రిల్ 1950 |
నిడివి | 177 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
- సహాయ దర్శకుడు - తాతినేని ప్రకాశరావు
- రికార్డింగ్ - ఎ.కృష్ణన్
- కోరియోగ్రఫీ - పసుమర్తి కృష్ణమూర్తి
[మార్చు] సంక్షిప్త చిత్రకథ
వడ్డీ వ్యాపారం చేసుకునే చెంగయ్య (గోవిందరాజుల సుబ్బారావు), రామయ్య (శ్రీవాత్సవ) ఇరుగుపొరుగు కుటుంబాలవారు. చెంగయ్య కొడుకు సత్యం (యన్.టి.రామారావు). చెంగయ్య దగ్గర పనిచేసే రౌడీ సున్నం రంగడు (యస్.వి.రంగారావు) బాకీలు వసూలుచేసి పెడుతుంటాడు. రామయ్య కొడుకు నారాయణ. కూతురు సుబ్బులు (జానకి). కోడలు శాంతమ్మ. ఈ రెండు కుటుంబాల మధ్యా ఆప్యాయతలు వెల్లివిరిసేవి. సుబ్బుల్ని తన కోడలుగా చేసుకోవాలని చెంగయ్య కోరిక. నారాయణ కొంచెం దుడుకు మనిషి. ఎప్పుడో చెంగయ్య దగ్గర నారాయణ తీసుకున్న అప్పు తీర్చాల్సి వస్తుంది. ఈలోగా సత్రం విషయంలో చెంగయ్యకూ, రామయ్యకూ మధ్య అభిప్రాయ భేదాలొస్తాయి. దాంతో చెంగయ్య బాకీకోసం వత్తిడి చేస్తాడు. నారాయణ భార్య నగలు అమ్మి తీర్చబోతే అంతకు ముందు రామయ్య కొంత బాకీ తీర్చగా దానికి నోటుమీద చెల్లువేయలేదు. ఆ విషయాన్ని దాచిపెట్టి పూర్తిగా చెల్లించమంటాడు చెంగయ్య. రాత్రివేళ రంగడు నారాయణ పంటను తగులబెట్టబోతే నారాయణ కొడతాడు. చెంగయ్య తప్పుడు కేసు పెట్టి నారాయణను జైలుకు పంపిస్తాడు. పట్నంలో కొడుకును చూడడానికి వెళ్ళిన చెంగయ్య, తన కొడుకు సత్యం జైల్లో వుండడాన్ని తెలుసుకుంటాడు. నిజానికి సత్యంకూడా చేయని నేరానికి స్నేహితుని కుట్రవల్ల జైలు పాలవుతాడు.
'చెరపకురా చెడేవు' అన్న నిజాన్ని చెంగయ్య తెలుసుకుంటాడు. ఈలోగా చెంగయ్యకు ఎదురు తిరిగిన రంగడు చెంగయ్య ఇంటిని దోచుకోవాలని పథకం వేస్తాడు. ఆ సంగతి తెలుసుకున్న సుబ్బులు, రామి (కనకం) సహాయంతో రంగడి అట కట్టిస్తుంది. ఈ ప్రయత్నంలో దెబ్బలు తగులుతాయి. రామయ్య కుటుంబానికి ఎంతో అన్యాయం చేసినా వారు తనను రక్షించినందుకు చెంగయ్య పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. సత్యం, నారాయణ జైలునుంచి తిరిగివాస్తారు. సత్యంతో సుబ్బులుకు పెళ్ళి జరుగుతుంది.
[మార్చు] పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
పలుకరాదటే చిలుకా పలుకరాదటే సముఖములో రాయబారమెందులకే | సముద్రాల | ఘంటసాల | ఘంటసాల |
[మార్చు] మూలాలు
- ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.