చంద్రహారం
వికీపీడియా నుండి
చంద్రహారం (1954) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీరంజని, సావిత్రి |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | విజయా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
[మార్చు] సంక్షిప్త చిత్రకథ
చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో వున్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.