Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
నెల్లూరు - వికీపీడియా

నెల్లూరు

వికీపీడియా నుండి

  ?నెల్లూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 14°26′N 79°58′E / 14.435345, 79.969826
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 13,076 కి.మీ² (5,049 చ.మై)
దూరాలు
చెన్నై నుండి
ఒంగోలు నుండి
తిరుపతి నుండి

• 165 కి.మీలు ఉ (భూమార్గం)
• 125 కి.మీలు ద (భూమార్గం)
• 135 కి.మీలు ఈ (భూమార్గం)
ముఖ్య పట్టణము నెల్లూరు
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
• పట్టణ
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
2,660,000 (2001)
• 203/కి.మీ² (526/చ.మై)
• 604000
• 1341000
• 1319000
• 65.9
• 74.45
• 57.24

అక్షాంశరేఖాంశాలు: 14°26′N 79°58′E / 14.435345, 79.969826 నెల్లూరు, భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా, నెల్లూరు జిల్లాలో ఒక ముఖ్య పట్టణం. నెల్లూరు వరి సాగుకు, ఆక్వా కల్చర్‌ కు ప్రసిద్ధి. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం కలదు. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి(మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం). అంతేకాక ప్రాచీనమైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవాలయం కూడా కలదు.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

నెల్లూరుకు విక్రమసింహపురి అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మహాభారతాన్ని తెనిగించిన కవిత్రయంలో ఒకడైన,కవి బ్రహ్మ,ఉభయ కవిమిత్రుడు కవి తిక్కన, ఇతని వద్దే ప్రధాన మంత్రిగా పనిచేశాడు. ఖడ్గ తిక్కన ఇతని రక్షణామాత్యుడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి నెల్లి ( తమిళ భాషలో వరి అని అర్ధం) పేరుమీదుగా నెల్లివూరు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌ లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.


ఈ ప్రాంతంలో క్వార్త్జైట్‌ అనే ఒక ప్రత్యేక తరహా ఫ్లింటు రాళ్లు విరివిగా లభిస్తాయి. వీటితో ఆదిమానవులు తమ ఆయుధాలు, పనిముట్లు తయారు చేసే వారు. మగధ సామ్రాజ్య స్థాపన తరువాత ఈ ప్రాంతం మీద కూడా మగధ ప్రభావం ఉండినట్లు తెలుస్తున్నది. క్రీ.శ.3వ శతాబ్దములో నెల్లూరు అశోకుని సామ్రాజ్యంలో భాగమైంది. ఆ తరువాత 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు జిల్లా పల్లవుల పాలనలో ఉన్నది. 7వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తరాన పల్లవుల ప్రాభవం తగ్గి, అధికారం క్షీణించి, దక్షిణానికి పరిమితమైపోయారు. ఆంగ్లేయుల పరిపాలనలో జిల్లా శాంతియుతంగా ఉన్నది. ఈ కాలంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగిన ఒకే ఒక సంఘటన 1838 లో బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా కర్నూలు నవాబు పన్నిన తిరుగుబాటు కుట్రలో పాలుపంచుకొన్నందుకు ఉదయగిరి జాగిర్దారు నుండి ఉదయగిరి జాగీరును లాగివేసుకోవటం. జిల్లా నేరుగా బ్రిటిషువారి పాలనలో వచ్చిన తర్వాత, 1904 లో ఒంగోలు తాలుకాను అప్పుడే కొత్తగా ఏర్పడిన గుంటూరు జిల్లాకు బదిలీ చేయటం తప్ప జిల్లాలో పెద్ద మార్పులేమీ జరగలేదు.


నెల్లూరు జిల్లా, 1953 అక్టోబర్ 1 దాకా సంయుక్త మద్రాసు రాష్ట్రం లో భాగంగా ఉన్నది. 1956 నవంబర్‌ 1 న భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు జిల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కిందికి వచ్చింది.

నెల్లూరు జిల్లా చరిత్ర

[మార్చు] అవీ-ఇవీ

విజయవాడ, చెన్నై నగరాల మధ్యన నెల్లూరు ఉండటం వల్ల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉన్న రంగనాధ స్వామివారి ఆలయం, దగ్గరలోనే గొలగమూడిలో ఉన్న వెంకయ్యస్వామి మందిరం,ఉదయగిరి కోట, నరసింహ కొండ, పెంచల కోన, వెంకటగిరి రాజుల కోట , మైపాడు బీచ్‌, శ్రీహరికోట వద్ద ఉన్న విఖ్యాతిగాంచిన రాకెట్‌ ప్రయోగ కేంద్రం,శ్రీ కామాక్షితాయి ఆలయం జొన్నవాడ, కృష్ణపట్నం రేవు, నేలపట్టు మొదలైన అనేక చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి.


నెల్లూరు జిల్లా వరి సాగుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని భారతదేశ ధాన్యాగారం అని అంటారు. బంగాళా ఖాతపు తీరం వెంట చేపల, రొయ్యల పెంపకానికి (ఆక్వా కల్చర్‌) నెల్లూరు చాలా ప్రసిద్ధి.


జిల్లాకు చెందిన బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గాను, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర గవర్నరు గాను పని చేశాడు. గుంటూరు శేషేంద్ర శర్మ - ప్రముఖ సుప్రసిద్ధ కవి ఈ జిల్లాకు ఛెన్దిన వాఢె. భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు,ఆంధ్ర ప్రదేశ్ పూర్వపు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవాడే. నెల్లూరులో తెలుగు సినిమాలకు విపరీతమైన అభిమాన వర్గం ఉంది. పట్టణంలో చాలా సినిమా థియేటర్లు ఉన్నాయి. ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి ఇక్కడే చదివాడు. ప్రముఖ తెలుగు సినిమా కవి ఆచార్య ఆత్రేయ ఈ జిల్లాకు చెందినవాడే. విఖ్యాతిగాంచిన రాకెట్‌ ప్రయోగ కేంద్రం "సతీష్‌ ధావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రము" (షార్‌) నెల్లూరు జిల్లా లోని శ్రీహరికోట లో ఉంది.

[మార్చు] పేరు పుట్టుక

ఈ ప్రాంతానికి నెల్లి ( తమిళ భాషలో వరి అని అర్ధం) పేరుమీదుగా నెల్లివూరు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు నెల్లూరుగా రూపాంతరం చెందింది.

నెల్లూరు సింహపురమని, విక్రమసింహపురమని కూడా వ్యవహరింపమడేది. ఈ పట్టణ సమీపంలోని అడవులలో సింహలపరిమితంగా ఉన్నందువలననే యీ పేరు వచ్చిన్దని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. విక్రమసింహుడనే వాని ఆధీనంలో యీ ప్రాంతం వున్నదని, అందువలననే అతని పేరు తోనే ఈ ప్రాంతం అలా పిలువమదివుందవచ్చునని యింకొందరు భావిస్తున్నారు.
పూర్వం త్రినేత్రుడు లేక ముక్కంటిరెడ్డి అనే వ్యక్తికి నెల్లిచెట్టు అనగా ఉసిరిచెట్టు క్రింద వున్న శివలింగం వున్నచోట దేవాలయాన్ని నిర్మించమని కలలో వాణి తెలియచేసిందని, ఆ మేరకు ఆలయన్ని ఆయన నిర్మించాడని చెబుతారు. కాల క్రమేణా నెల్లి నామం నెల్లూరుగా రూపాంతరం చెందిందంటారు.

[మార్చు] నెల్లూరు లో కవులు

[మార్చు] నెల్లూరులో సాంస్కృతిక సేవా రంగాలు

[మార్చు] పరిశ్రమలు

అభ్రకం ఉత్పత్తి లో అగ్రగామి. పింగాణి, ముడి ఇనుము, జిప్సం, సున్నాపురాయి నిధులున్నాయి. జిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు, ఉన్నాయి.

[మార్చు] విద్యాలయాలు

వెంకటగిరి రాజా కళాశాల

[మార్చు] బ్యాంకులు

  • ఆంధ్రాబ్యాంక్
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


[మార్చు] సంస్కృతి

[మార్చు] సినిమాథియేటర్లు

  • అర్చన 70ఎమ్.ఎమ్. ఏ/సి,
  • గోపిక ఏ/సి,
  • ఇందిరా ఏ/సి,
  • కళ్యాణి ఏ/సి,
  • కనక మహల్,
  • కావేరి 70ఎమ్.ఎమ్. A/C
  • కృష్ణా ఏ/సి,
  • లీలా మహల్ ఏ/సి,
  • మాధవ్ ఏ/సి,
  • నర్తకి 70ఎమ్.ఎమ్. ఏ/సి,


క్రొత్తవి:

  • పద్మావతి ఏ/సి,
  • రాధ ఏ/సి,
  • సుందర్ డీలక్స్ ,
  • వెంకట రమణ 70ఎమ్.ఎమ్. ఏ/సి,
  • సెవెన్ హిల్స్ ఏ/సి,

[మార్చు] నెల్లూరు చిత్రపటం

[మార్చు] ఇతర సమాచారం

  • నెల్లూరు గ్రామ దేవత : ఇరుకళల పరమేశ్వరి
  • నెల్లూరు పిన్ కోడ్ : 524001
  • నెల్లూరు టెలిపోన్ యస్.టి.డి కోడ్ : 0861
  • నెల్లూరు ఆర్టీసీ మరియు షాట్ కట్ కోడ్: ఎన్ ఎల్ ఆర్

[మార్చు] శీర్షిక పాఠ్యం

[మార్చు] వికిమాపియా లో నెల్లూరు

[ వికిమాపియా లో నెల్లూరు]

[మార్చు] రెవెన్యూ విభాగాలు (3)

[మార్చు] లోక్‌సభ స్థానం (1)

  • నెల్లూరు

[మార్చు] శాసనసభా నియోజక వర్గాలు (11)

[మార్చు] నదులు

  • పాలేరు
  • మున్నేరు
  • పిల్లవాగు
  • పైడేరు
  • పెన్న
  • ఉప్పుటేరు
  • స్వర్ణముఖి
  • కాళంగి.

[మార్చు] దర్శనీయ ప్రదేశాలు

    • పులికాట్ సరస్సు: 500 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఉప్పునీటి సరస్సు.
    • నెల్లూరు
    • శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగకేంద్రం
    • మైపాడు బీచ్
    • నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం: సూళ్ళూరుపేట దగ్గర బూడిదరంగు పెలికన్స్ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
    • రంగనాధ స్వామివారి ఆలయం
    • గొలగమూడిలో వెంకయ్యస్వామి మందిరం
    • ఉదయగిరి కోట
    • నరసింహ కొండ
    • పెంచల కోన
    • వెంకటగిరి రాజుల కోట
    • శ్రీ కామాక్షితాయి ఆలయం జొన్నవాడ
    • కృష్ణపట్నం రేవు.
    • సంగం ఆనకట్ట

[మార్చు] ప్రముఖ వ్యక్తులు

[మార్చు] సినీరంగ ప్రముఖులు

  • సి.పుల్లయ్య - మూగ సినిమాలలో నటుడు
  • ఘంటసాల రాధాకృష్ణమూర్తి - టాకీ సినిమాలలో నటుడు
  • ఏ.ఎం.రత్నం - సినిమా నిర్మాత, దర్శకుడు
  • ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం- నేపధ్యగాయకుడు , నటుడు
  • మనసుకవి ఆత్రేయ - తెలుగు సినీ కవి

[మార్చు] రవాణా సౌకర్యాలు

[మార్చు] రహదారి మార్గము

నెల్లూరు నగరం చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-ఒంగోలు ల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విశాఖపట్టణం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.

[మార్చు] రైలు మార్గము

నెల్లూరు నగరం గూడూరు-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం, కన్యాకుమారి .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు.

[మార్చు] దేవాలయాలు

  • నెల్లూరు జిల్లా అనేక ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. వాటిలో కొన్ని అద్భుతమైనవి.
    • శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం - పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం).
    • శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు
    • భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి గొలగమూడి
    • శ్రీ కామాక్షితాయి ఆలయం, జొన్నవాడ
    • శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం, నరసింహ కొండ
    • చంగాళ్లమ్మ గుడి, సూళ్లూరుపేట
    • పెనుశిల నరసింహస్వామి ఆలయం, పెంచలకోన
    • సోమేశ్వర స్వామి ఆలయం, సోమశిల
    • జ్వాలాముఖి అమ్మవారు, నెల్లూరు జిల్లా.
  • సాయిబాబా గుడి
  • వినాయకుని గుడి
  • కన్యకాపరమేశ్వరి ఆలయం

[మార్చు] పండుగలు /తిరునాళ్ళు

నెల్లూరులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:

  • సంక్రాంతి: సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు సంక్రాంతి పండుగ ను జరుపుకుంటారు. సాధారణంగా ఇది జనవరి 14 న వస్తుంది.

[మార్చు] నెల్లూరు మండలాలు

భౌగోళికంగా నెల్లూరు జిల్లాను 46 రెవిన్యూ మండలములుగా విభజించారు.[1]

నెల్లూరు జిల్లా మండలాలు

[మార్చు] మూలాలు

  1. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో నెల్లూరు జిల్లా తాలూకాల వివరాలు. జూలై 28, 2007న సేకరించారు.

[మార్చు] బయటి లింకులు



ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు పూర్ణ కుంభం
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com