ఆ నలుగురు
వికీపీడియా నుండి
ఆ నలుగురు (2004) | |
దర్శకత్వం | చంద్ర సిద్ధార్థ |
---|---|
నిర్మాణం | సరిత పట్రా |
కథ | మదన్ |
చిత్రానువాదం | మదన్, చంద్ర సిద్ధార్థ |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, సుత్తివేలు, ఆమని, కోట శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, రాజా |
సంగీతం | ఆర్ పి పట్నాయక్ |
సంభాషణలు | మదన్ |
ఛాయాగ్రహణం | సురేంద్ర రెడ్డి |
కూర్పు | గిరీష్ లోకేశ్ |
నిర్మాణ సంస్థ | ప్రేమ్ మూవీస్ |
విడుదల తేదీ | డిసెంబర్ 9,2004 |
భాష | తెలుగు |
ఆ నలుగురు అనేది 2004లో వచ్చిన ఓ తెలుగు సినిమా.
[మార్చు] కథ
పరుల సేవయే పరమార్థంగా భావించే రఘురాం (రాజేంద్ర ప్రసాద్), అనే పత్రికా సంపాదకుడి కథ ఇది. రఘురాం చనిపోయిన తరువాత అతని ప్రాణాలు తీసుకొని పోవడానికి యమ కింకరులు (చలపతి రావు, రఘు బాబు) రావడంతో కథ ప్రారంభమవుతుంది. తను చనిపోయిన తరువాత తన కోసం కుటుంబ సభ్యులు ఎలా బాధ పడతారో చూడాలని ఆ యమ కింకరులను వేడుకుంటాడు. తన శవం పట్ల అతని కన్న బిడ్డలే చూపిన నిర్లక్ష్యం పట్ల యమకింకరులు అతన్ని హేళన చేస్తారు. కానీ బతికి ఉన్నపుడు ఎంతో మందికి సహాయం చేసిన రఘురాంకు నివాళులు అర్పించేందుకు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారు. అతని దగ్గర సహాయం పొందిన వారు అతని కొడుకులకు కూడా బుద్ది చెపుతారు. అప్పుడు రఘురాంకు తనతో పాటు ఉన్న వారు యమ కింకరులు కారనీ, ప్రశాంతత చెందిన మనస్సుతో చూస్తే వారు దేవదూతలౌతారని తెలుసుకుంటాడు. ఆ దేవ దూతలు రఘురాంను స్వర్గానికి కొనిపోవడంతో కథ ముగుస్తుంది.