కోట శ్రీనివాసరావు
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.[1]
[మార్చు] సినీరంగ ప్రవేశం
బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20యేళ్ళ అనుభవం గడించాడు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాదపూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కోట శ్రీనివాసరావు పేజీ