గద్వాల
వికీపీడియా నుండి
?గద్వాల మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | గద్వాల |
జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
గ్రామాలు | 19 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
96,370 (2001) • 49180 • 47180 • 49.70 • 60.55 • 38.34 |
గద్వాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. గద్వాల చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం కూడా. గద్వాల సమీపంలో "ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు" ఉంది.
విషయ సూచిక |
[మార్చు] పట్టణ స్వరూపం, జనాభా
గద్వాల పట్టణ జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారము 53,601. ఇందులో మగవారు 51%, ఆడువారు 49%. సగటు అక్షరాస్యత 57% (మగవారిలో 67%, ఆడువారిలో 48%). జనాభాలో 13% వయస్సు 6 సంవత్సరాలలోపు ఉంటుంది.
[మార్చు] రవాణా
ఇది మహబూబ్ నగర్, కర్నూలు మద్య మహబూబ్ నగర్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు ద్వారా ప్రయాణం అతి సాధారణం. ఈ పట్టణమునకు రైలు సదుపాయము కూడా ఉంది.
[మార్చు] విద్య
- మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాల
- నిషిత డిగ్రీ కళాశాల
- ప్రభుత్వ జూనియర్ కళాశాల
- జ్ఞానప్రభ జూనియర్ కళాశాల
- ఎస్.వి.యం.జూనియర్ కళాశాల
- సోమనాద్రి జూనియర్ కళాశాల
- కృష్ణవేణి జూనియర్ కళాశాల
- సెయింట్ థామస్ బి.ఇ.డి.కళాశాల
[మార్చు] చేనేత పరిశ్రమ
[మార్చు] పరిపాలన
- ప్రధాన వ్యాసం: పురపాలక సంఘము, గద్వాల
గద్వాల పట్టణం పరిపాలన పురపాలక సంఘము ద్వారా నిర్వహింపబడుతుంది.
[మార్చు] చరిత్ర
1663 వ సం. నుండి 1712వ సం. మధ్యకాలంలో పెదసోమభూపాలుడు (ఇతనినే నలసోమనాద్రి అనెడివారు) పూడూరు రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు ధుర్భేధ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ మట్టి కోటను కట్టించారు. కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు రావడముతో కేశవాచారి అనే బ్రాహ్మణుడిని బలి ఇచ్చారని, ఆ పాప పరిహారానికి గాను గద్వాల కోటలో చెన్నకేశవ దేవాలయాన్ని నిర్మించారని ప్రచారంలో ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన తరువాత రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చారు.
1709 నుండి 1712 వరకు కర్నూలు దుర్గం రాజా పెదభూపాలుని ఆధీనంలో ఉండెది. బహద్దూర్ షా అనుయాయులు గద్వాల రాజు ఆధీనంలో ఉన్న కర్నూలు దుర్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి నిజాం తన సేనాని దిలీప్ ఖాన్ ను పంపించారు. దిలీప్ ఖాన్ కు,పెద సోమభూపాలునికి మధ్య కర్నూలు సమీపంలోని నిడ్జూరు గ్రామం దగ్గర జరిగిన యుద్దంలో రాజా పెదసోమభూపాలుడు జ్యేష్ట శుక్ల అష్టమి రోజు మరణించాడు. గద్వాల సంస్థానాధీశులకు చెన్నకేశవ స్వామి కులదైవం.
పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్దంలో పెదసోమభూపాలుడు గదను, వాలమును ప్రయోగించడము వలన ఈ కోటకు "గదవాల(గద్వాల)" అన ేపేరు వచ్చినదని చెబుతారు. ఈ విధంగా 1663 నుండి1950 వరకు గద్వాల సంస్థానాధీశులచే పరిపాలింప బడింది. రాజాభరణాల రద్దు తరువాత ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తరువాత 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసారు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
[మార్చు] ఇవి కూడా చూడండి
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్
|
|
---|---|
రేకులపల్లి · కొత్తపల్లి · ఎంకంపేట · ముల్కలపల్లి · గద్వాల (గ్రామీణ) · ఆత్మకూరు · గోన్పాడ్ · సంగాల · జిల్లాడబండ · కాకులవరం · పరమాల · మేళ్ళచెరువు · జమ్మిచేడ్ · పూదూరు · అనంతపూర్ · బీరోలు · బసాపూర్ · గుర్రంగడ్డ · గద్వాల · కొండపల్లి · చెనుగోనిపల్లి · శెట్టిఆగ్రహాం |
|
---|
గద్వాల · · · గద్వాల సంస్థానము · · · పురపాలక సంఘము, గద్వాల · · · గద్వాల కోట · · · గద్వాల అసెంబ్లీ నియోజక వర్గం |
|
|
---|---|
తిమ్మాపూర్ · కొత్తూర్ · షాద్నగర్ · బాలానగర్ · రంగారెడ్డిగూడ · రాజాపూర్ · గొల్లపల్లి · జడ్చర్ల · మహబూబ్ నగర్ · మన్యంకొండ · కోటకద్ర · దేవరకద్ర · కౌకుంట్ల · కురుమూర్తి · కొన్నూర్ · వనపర్తిరోడ్ · అజ్జకోల్ · శ్రీరాంనగర్ · ఆరేపల్లి · గద్వాల · పూడూర్ · పెద్దదిన్నె · ఇటిక్యాల్ · మనోపాడ్ · ఆలంపూర్ రోడ్ |