ఆదిలాబాదు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
?ఆదిలాబాదు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 16,128 కి.మీ² (6,227 చ.మై) |
ముఖ్య పట్టణము | ఆదిలాబాదు |
ప్రాంతం | తెలంగాణా |
జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
2,479,000 (2001) • 154/కి.మీ² (399/చ.మై) • 656000 • 1246000 • 1233000 • 53.51 • 65.56 • 41.38 |
అక్షాంశరేఖాంశాలు: ఆదిలాబాదు భారత దేశమునందలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. దీని రాజధాని ఆదిలాబాదు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును ఎడ్లవాడ అని పిల్చేవారు.
విషయ సూచిక |
[మార్చు] కొన్ని వాస్తవాలు
జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 70 కి.మీ దూరంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక సరస్వతీ ఆలయం ఇక్కడే ఉంది. భారత దేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరు లో ఉండగా, రెండవది ఇదే. ఇక, నిర్మల్ పట్టణం చిత్రకళకు ప్రసిద్ధి గాంచింది. కుంతల జలపాతం చాలా ఆకర్షణీయమైంది. పులి, మొసళ్ళు, దుప్పి వంటి అడవి జంతువుల సంరక్షణకోసం "ప్రాణహిత సంరక్షణ కేంద్రం" ఏర్పాటు చేయడం జరిగింది. 600 మిలియన్ టన్నుల మేలిరకం సున్నపురాయి నిల్వలు జిల్లాలో ఉన్నాయి. పింగాణి పాత్రలు, సానిటరీ పైపులు, ఇటుకలు, బెంగుళూరు పెంకుల తయారీకి పనికి వచ్చే బంకమన్ను విస్తారంగా లభిస్తుంది.
- ముఖ్య పంటలు: వరి, జొన్న, పత్తి
- లోక్‌సభ స్థానం (2): ఆదిలాబాదు
- శాసనసభ స్థానాలు (8): ముధోల్, నిర్మల్, బోద్, ఆదిలాబాద్, ఖానాపూర్, లక్సెట్టిపేట, అసిఫాబాద్,చెన్నూరు, సిర్పూర్
- నదులు: ప్రాణహిత, పెన్‌గంగ, వార్థా
- దర్శనీయ ప్రదేశాలు: బాసర, పోచంపాడు, నిర్మల్, కుంతల జలపాతం, కడెం ప్రాజెక్టు, బెల్లంపల్లి, మందమర్రి, సిరిపూర్
[మార్చు] ఆదిలాబాదు మండలాలు
భౌగోళికంగా ఆదిలాబాదు జిల్లాను 52 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[1].
1.తలమడుగు 2.తాంసీ 4.జైనథ్ 5.బేల 9.ఇచ్చోడ 11.బోథ్ 12.నేరెడిగొండ 13.సారంగాపూర్ |
14.కుంటాల 15.కుభీర్ 16.భైంసా 17.తానూర్ 18.ముధోల్ 19.లోకేశ్వరం 20.దిలావర్ పూర్ 21.నిర్మల్ 23.మండా 24.ఖానాపూర్ 25.కడ్యం 26.ఉట్నూరు |
27.జైనూర్ 28.కెరమెరి 30.జన్నారం 31.దండేపల్లి 32.లక్సెట్టిపేట 33.మంచిర్యాల 34.మందమర్రి 35.కాశీపేట్ 36.తిర్యాని 37.ఆసిఫాబాద్ 38.వాంకిడి 39.కాగజ్‌నగర్ |
40.రెబ్బెన 41.తాండూరు 42.బెల్లంపల్లి 43.నెన్నెల్ 44.భీమిని 46.కౌతల 47.బెజ్జూర్ 48.దహేగావ్ 49.వేమన్‌పల్లి 50.కోటపల్లి 51.చెన్నూర్ 52.జైపూర్ |
[మార్చు] బయటి లింకులు
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో ఆదిలాబాదు జిల్లా తాలూకాల వివరాలు. జూన్ 30, 2007న సేకరించారు.
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | |
---|---|
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు |