వికీపీడియా నుండి
అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న. శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
[మార్చు] పోషక పదార్థాలు
[మార్చు] జొన్న ఆహారం
- ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి
- జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
- అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి.
- తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.
- విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.
[మార్చు] ఇతర ఉపయోగాలు
- జొన్న విత్తనాలు: వాణిజ్యపరమైన ఆల్కహాల్ సంబంధ పానీయాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. కోళ్ళకు దాణాగా వాడతారు.
- జొన్న ఆకులు, కాండాలు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. కాగితం తయారీలో వాడతారు.