మూస:మీకు తెలుసా?1
వికీపీడియా నుండి
వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి
- ... బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు డైలాగులు రచించినది నాగభైరవ కోటేశ్వరరావు అనీ! (నాగభైరవ కోటేశ్వరరావు వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
- ... మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళాశాలను ప్రారంభించినది కోపల్లె హనుమంతరావు అనీ! (కోపల్లె హనుమంతరావు వ్యాసం)
- ... వ్యంగ చిత్రాల సంపుటి అయిన డెనిస్ ది మెనేస్(Dennis the Menace) సృష్టికర్త అమెరికాకు చెందిన హాంక్ కెచ్చమ్ అనీ! (డెనిస్-ఓ బెడద వ్యాసం)
- ... ఆంధ్రదేశంలో కుబీరక రాజు ప్రశక్తి ఉన్న శాసనం లభించిన ప్రదేశం భట్టిప్రోలు అనీ! (భట్టిప్రోలు స్తూపం వ్యాసం)
- ... శ్రీహరి హిరణ్యకశ్యపుడిని సంహరించుటకు నరసింహ అవతారము దాల్చాడు అనీ! (నరనారాయణులు వ్యాసం)
- ... తూర్పు గోదావరి జిల్లా చోడవరం గ్రామానికి ఆ పేరు రావడానికి కారకుడు చోడరాజు రాజేంద్ర చోడుడు అనీ! (చోడవరం వ్యాసం)
- ... సాహిత్య, భాషా, పరిశోధనా పత్రాలకు, కవిత్వానికి పెద్ద పీటవేసిన "భారతి" మాసపత్రికను స్థాపించినది కాశీనాథుని నాగేశ్వరరావు అనీ! (భారతి (మాస పత్రిక) వాసం)
- ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదుకు తొలి మహిళా మేనేజింగ్ డైరెక్టర్ రేణు చల్లు అనీ! (వర్తమాన ఘటనలు - జూన్ 2008)