వికీపీడియా:మీకు తెలుసా? భండారము
వికీపీడియా నుండి
|
ఈ జాబితా మొదటి పేజిలోని మీకు తెలుసా? విభాగములో ఇప్పటిదాకా ప్రదర్శించిన వాక్యాల భాండాగారము.
- మీరు ఏదైనా వికిపీడియా వ్యాసము చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయము ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
- ఈ భాండాగారములోనుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలుగింటిని మాత్రమే ఈ మూసలో చేర్చండి.
- వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చేర్చేయండి. అలాగే ఇక్కడా చేర్చిన విషయాలను దాయనవసరం లేదు.
[మార్చు] మీకు తెలుసా?
- ... మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన జవానుల స్మృత్యర్థం ఢిల్లీలో నిర్మించిన ఇండియా గేట్‌కు రూపకల్పన చేసినది ఎడ్విన్ ల్యుటెన్స్ అనీ! (ఇండియా గేట్ వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
- ... యజ్ఞసేనుడు అనే పేరు కలిగిన దృపదుడు పాంచాల దేశానికి రాజుగా పాలించాడనీ ! (దృపదుడు వ్యాసం)
- ... మెట్రిక్ పద్దతిలో ద్రవ పదార్థాల ఘనపరిమాణం కొలవడానికి అంతర్జాతీయంగా స్థిరీకరించబడిన కొలమానం లీటరు అనీ! (లీటరు వ్యాసం)
- ... దక్షిణ భారతదేశములో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి భారతీయ జనతా పార్టీ నేత బి.ఎస్.యడ్యూరప్ప అనీ! (బి.ఎస్.యడ్యూరప్ప వ్యాసం)
- ... ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరం మాస్కో అనీ (వర్తమాన ఘటనలు-మే 2008)
- ... కొలెస్టరాల్ అనగా శరీరంలో సహజ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక రకపు కొవ్వు అనీ! (కొలెస్టరాల్ వ్యాసం)
- ... తొలి ఆధునిక ఒలింపిక్ క్రీడలు నిర్వహించబడిన నగరం ఎథెన్స్ అనీ! (1896 ఒలింపిక్ క్రీడలు వాసం)
- ... పార్థియన్లు పూజించే గ్రీకుల నాగరికత యుద్ధదేవత అయిన 'అథేనా'ను రూపొందించినది ఫిడియాస్ అనీ! (విగ్రహారాధన వ్యాసం)
- ...బౌద్ధ స్తూపాలు అనగా గౌతమబుద్ధుని అవశేషాలపై నిర్మించిన పూజానిమిత్తమైన కట్టడాలు అనీ! (అమరావతి స్తూపం వ్యాసం) (బొమ్మ ఉన్నది)
- ...ఒలింపిక్ క్రీడలలో భారతదేశం తరఫున పాల్గొన్న మరియు పతకం సాధించిన తొలి క్రీడాకారుడు నార్మన్ ప్రిచర్డ్ అనీ! (1900 ఒలింపిక్ క్రీడలు వ్యాసం)
- ...ఆధునిక తెలుగు పద్యకవులలో అగ్రగణ్యుడిగా పేరుగాంచి తెనుగులెంకగా ప్రసిద్ధిచెందిన కవి అసలుపేరు తుమ్మల సీతారామమూర్తి అనీ! (తుమ్మల సీతారామమూర్తి వ్యాసం)
- ...యమునా నది జన్మస్థలమైన యమునోత్రిలో ఉన్న ప్రముఖ దేవాలయం గర్భగుడిలో గంగా, యమునా, సరస్వతి మూర్తులు ఉంటాయి అనీ! (యమునోత్రి వ్యాసం)
- ...కర్ణాటకలోని చారిత్రక నగరమైన శ్రీరంగపట్టణానికి ఆపేరు శ్రీరంగనాథస్వామి ఆలయంలో వెలసిన రంగనాథస్వామి వల్ల వచ్చినదీ అనీ! (శ్రీరంగపట్టణం వ్యాసం)
- ...బిర్లామందిరములు సంపన్నమైన బిర్లాకుటుంబం వారి ఆర్థిక సహాయంతో నిర్వహించబడుతున్నాయి అనీ! (బిర్లా మందిరం (ఢిల్లీ) వ్యాసం)
- ...ఇంగ్లాండు టెస్ట్ క్రికెట్ జట్టుకు అత్యధిక పర్యాయాలు నాయకత్వం వహించిన కెప్టెన్ మైక్ ఆథర్టన్ అనీ! (మైక్ ఆథర్టన్ వ్యాసం)
- ... కర్ణాటక సంగీత పితామహుడిగా పేరుగాంచిన పురందర దాసు తన కీర్తనలన్నీ విష్ణుమూర్తికి అంకితమిస్తూ రచించాడు అనీ! (పురందర దాసు వ్యాసం) (బొమ్మ ఉన్నది)
- ... ప్రాచీన ఒలింపిక్ క్రీడలలో విజేతలకు బహుమతిగా ఆలివ్ కొమ్మలను ప్రధానం చేసేవారు అనీ! (ఒలింపిక్ క్రీడలు వ్యాసం)
- ... ఆధునిక ద్వినామీకరణానికి నాంది పలికి ఆధునిక వర్గీకరణశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన జీవశాస్త్రవేత్త స్వీడన్ కు చెందిన కరోలస్ లిన్నేయస్ అనీ! (కరోలస్ లిన్నేయస్ వ్యాసం)
- ... మాద్రి నకులుడు మరియు సహదేవుడు కవలలను పొందుటకు దూర్వాసుని వరమును ఉపయోగించినది అనీ! (పాండురాజు వ్యాసం)
- ... ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపుపోటు కొలతలు 120/80 ఉంటాయి అనీ! (రక్తపు పోటు వ్యాసం)
- ... సెల్సియస్ కొలమానంలో నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత 0°C అనీ! (ఉష్ణోగ్రత వ్యాసం)
- ... భారతదేశంలో స్థాపించబడిన తొలి జాతీయవనం 1935లో ఏర్పాటుచేసిన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనీ! (భారతదేశంలో జాతీయ వనాలు వ్యాసం)