గౌతమ బుద్ధుడు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
సిద్ధార్థ గౌతముడు (సంస్కృతం; పాళి: సిద్దాత్త గోతమ) నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు మరియు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు: 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. మిగతా లెఖ్ఖలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు.
గౌతముడిని శాక్య ముని అని కూడా పిలుస్తారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు మరియు భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట, నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు.
విషయ సూచిక |
[మార్చు] బుద్ధుని జీవితము
బుద్ధుని జీవితములో, కేవలం కొన్ని వివరములు మాత్రమే నిర్ధారించగలము, మిగతా వాటి చారిత్రకతకు ఆధారాలు కష్టమే. బౌద్ధ సాహిత్యం నుండి మనకు లభించు వివరములే ఎక్కువ. క్లుప్తంగా క్రింద వివరించబడినవి.
[మార్చు] పుట్టుక
సంప్రదాయము ప్రకారం సిద్ధార్థుని జననం మౌర్య సమ్రాట్టు అశోక చక్రవర్తి కన్నా 200 సంవత్సరాలకు పూర్వం జరిగింది (273–232 క్రీ.పూ).
సిద్ధార్థుడు నేటి నేపాల్ దేశానికి చెందిన లుంబిని అనే ప్రాంతంలో పుట్టాడు. ఆయన తండ్రి శుద్దోధనుడు, శాక్య వంశపు మహారాజు, కోసల రాజ్యానికి చెందిన ఒక పురాతన వంశం; గౌతమ అన్నది ఇంటి పేరు. తల్లి మహామాయ (మాయాదేవి) శుద్దోధనుని పట్టపురాణి, కొలియ రాజ్యం నుండి వచ్చినది. సిద్ధార్థుడు గర్భమునందున్నప్పుడు ఆమె ఆరు దంతములు గల తెల్ల ఏనుగొకటి కుడివైపు నుండి కడుపులోనికి నడిచి వచ్చినట్టు కలగన్నది, పది నెలల తరువాత, కుడివైపు నుండి సిద్ధార్థుని కన్నది (పటాన్ని చూడండి). శాక్య వంశ సంప్రదాయాన్ని అనుసరించి, ప్రసవానికి తన తండ్రి గారింటికి బయలుదేరి కపిలవస్తు పట్టణాన్ని దాటి, మార్గమధ్యంలోనే లుంబినిలోని ఒక వనంలో సాల వృక్షం క్రింద ప్రసవించింది.
[మార్చు] బోధనలు
ఆయన యధాతథంగా బోధించినవి దొరుకుట కొంత కష్టమే అయినా, వాటి మూలాలను తెలుసుకోవడం అసంభవమైన పని కాదు. వివిధ బౌద్ధ భిక్షువులు, శాఖల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా, మూల సిద్ధాంతాలు, భిక్షువుల నియమావళి పట్ల అంగీకారం ఉన్నది. మచ్చుకు కొన్ని బోధనలు:
- నాలుగు ఆర్య సూత్రాలు.
- అష్టాంగ మార్గం.
- అనిచ్చ (సంస్కృతం: అనిత్య): అన్ని వస్తువులు అనిత్యం
- అనత్త (సంస్కృతం: అనాత్మ): నేను అని నిరంతరం కలిగే భావన ఒక "భ్రమ"
- దుక్క (సంస్కృతం: దు:ఖం): అజ్ఞానము కారణముగా అన్ని జీవులు దు:ఖానికి గురి అవుతున్నాయి.
[మార్చు] భాష
బుద్ధుడు పండితుల భాషైన సంస్కృతాన్ని కాక సాధారణ ప్రజలు భాషించే పాళీ భాషలో మాట్లాడాడని అధికుల భావన, ఆయన మాటలను తిపిటకలో యథాతథంగా గ్రంథస్తం చేసారు కూడా. కొంత మంది మగథ ప్రాకృతి అని, మరికొందరు పరిశోధకులు నాటి ఈశాన్య భారతంలోని మరో భాషను మాట్లాడాడని అభిప్రాయపడుతున్నారు.
|
|
---|---|
ధేరవాద బౌద్ధము | గౌతమ బుద్ధుడు · 28 బుద్ధుల జాబితా |
ఐదు ధ్యాని బుద్ధులు | అమితాభ బుద్ధుడు · మహావైరోచన బుద్ధుడు · అక్షోభ్య బుద్ధుడు · అమోఘసిద్ధి బుద్ధుడు · రత్నసంభవ బుద్ధుడు |
ఇతర బుద్ధులు | ఆదిబుద్ధుడు · భైషజ్యగురు బుద్ధుడు · నైరాత్మ్యా · వజ్రధారుడు |