Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
నేపాల్ - వికీపీడియా

నేపాల్

వికీపీడియా నుండి

హిమాలయాలలో ఉన్న నేపాల్ రాజ్యము, 2006 నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికు పూర్వం ప్రపంచం లోని ఏకైక హిందూ రాజ్యము. ఇది దక్షిణ ఆసియా లో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉన్నది.ఇది ఒక భూఖండ దేశము(landlocked country)

नेपाल
Nēpāl
నేపాల్
Flag of నేపాల్ నేపాల్ యొక్క Coat of arms
నినాదం
जननी जन्मभूमिष्च स्वर्गादपि गरीयसी
(Sanskrit: Motherland is even dearer than the heavens)
జాతీయగీతం
Rastriya Gaan
నేపాల్ యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Kathmandu
27°42′N, 85°19′E
అధికార భాషలు Nepali
ప్రభుత్వం Transitional
 -  King
Prime Minister
Gyanendra
Girija Prasad Koirala
Unification
విస్తీర్ణం
 -  మొత్తం 147,181 కి.మీ² (94th)
56,827 చ.మై 
 -  జలాలు (%) 2.8
జనాభా
 -  July 2005 అంచనా 27,133,000 (42nd)
 -  2002 జన గణన 23,151,423 
 -  జన సాంద్రత 196 /కి.మీ² (39th)
508 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $42.17 billion (81st)
 -  తలసరి $1,675 (152nd)
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) 0.526 (medium) (136th)
కరెన్సీ Rupee (NPR)
టైం జోన్ NPT (UTC+5:45)
 -  వేసవి (DST) not observed (UTC+5:45)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .np
కాలింగ్ కోడ్ +977

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

నేపాల్ కి వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనేది 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చిన మరియు చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 563 లో నేపాల్ లోనే జన్మించాడు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో బాటు ఇప్పటి నేపాల్ లోని దక్షిణ ప్రాంతాలను(హిమాలయ పర్వత ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో లేవు) పరిపాలించాడు. క్రీస్తు శకం 200కల్లా బౌద్ధ సామ్రాజ్యాన్ని హిందువులు అంతమొందించి లిక్కావి వంశ పరిపాలనను ప్రారంభించారు.

900వ సంవత్సరంలో లిక్కావి వంశాన్ని పారద్రోలి ఠాకూర్లు, వారిని పారద్రోలి మల్లులు పరిపాలనకు వచ్చారు. వాళ్ళే 18వ శతాబ్దం వరకూ పాలించారు. 1768లో ప్రిథ్వి నారాయణ్ షా అనే గూర్ఖా రాజు ఖాట్మండును ఆక్రమించుకున్నాడు. 1814లో నేపాల్ ఇంగ్లీషు వారితో యుద్ధం చేసింది(ది ఆంగ్లో నేపాలీస్ వార్). 1816లో సుగౌలి సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఇంగ్లీషు వారికి సిక్కింను, దక్షిణ భాగాలను ఇచ్చివేయడంతో ఇంగ్లీషు వారు వెనుదిరిగారు. కానీ 1857 లో భారత దేశంలోని సిపాయిల తిరుగుబాటును అణచివేయడంలో ఇంగ్లీషు వారికి సహాయపడినందుకుగాను ఇంగ్లీషువారు దక్షిణ ప్రాంతాలను తిరిగి ఇచ్చివేశారు.

షా వంశాన్ని 1846లో జంగ్ బహద్దూర్ రాణా అంతమొందించి దేశ పరిపాలనను తన చేతిలోకి తీసుకున్నాడు. దీనికోసం అతడు దాదాపు కొన్ని వందలమంది రాకుమారులను, తెగల నాయకులను అంతమొందించాడు (దాన్నే కోట్ ఊచకోత అంటారు). 1948వ సంవత్సరము వరకూ రాణాలు వారసత్వ ప్రధానమంత్రులుగా నేపాల్ ను పరిపాలించారు. ఎప్పుడైతే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందో త్రిభువన్ అనే క్రొత్త రాజు నేపాల్ పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. రాజు త్రిభువన్ కుమారుడైన రాజు మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి పార్టీలు లేని పంచాయితీ పద్ధతి ద్వారా నేపాల్ని పరిపాలించాడు. అతని కుమారుడు బీరేంద్ర సింహాసనాన్ని అధిరోహించాడు. అతను కూడా 1989 వరకూ పంచాయితీ పద్ధతినే అనుసరించాడు. కాని ప్రజా ఆందోళన తర్వాత బలవంతంగా రాజ్యాంగ మార్పులను ఆమోదించాడు. 1991 మే నెలలో దాదాపు యాభై సంవత్సరాల తరువాత నేపాల్ లో ఎన్నికలు జరిగాయి. నేపాలి కాంగ్రెస్ పార్టీ, కమ్మూనిస్ట్ పార్టీలకు ఎక్కువ వోట్లు దక్కాయి. ఏ పార్టీ కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పరిపాలించలేక పోయాయి. అందుకు కారణంగా ప్రజోపయోగ కార్యక్రమాలలో మార్పు లేకపోవటం, అవినీతి రోగంలాగా మారటాన్ని చూపిస్తారు.

ఫిబ్రవరి 1996లో మావోయిస్టు పార్టీ ప్రజాస్వామ్యాన్ని మార్చి సామ్యవాదాన్ని స్థాపించడం కోసం విప్లవాత్మక ధోరణిని ఎంచుకొని ప్రజా యుద్ధాన్ని ప్రారంభించింది. అదే ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారి 10 వేల మంది మరణానికి దారితీసింది.

నేపాల్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2001, జూన్ 1 నాడు సింహాసన వారసుడు దీపేంద్ర తన ప్రేమను ఒప్పుకోలేదని రాజభవనంలో రాజు బీరేంద్రను, రాణి ఐశ్వర్యను, తమ్ముడిని, చెల్లెల్ని, ఇద్దరు బాబాయిలను, ముగ్గురు పిన్నులనూ కాల్చి చంపేశాడు. తర్వాత తనూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నడు. అతడు కోమాలో ఉన్నా సంప్రదాయం ప్రకారం అతడ్ని వైద్యశాల పడక పైనే రాజుగా ప్రకటించారు. అతడు మూడు రోజుల తరువాత మరణించాడు.

అతని మరణం తరువాత బీరేంద్ర తమ్ముడు అయిన జ్ఞానేంద్రను జూన్ 4న రాజుగా ప్రకటించారు. వెంటనే అతను రాజ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. మావోయిస్టులతో యుద్ధానికి నేపాల్ సైన్యాన్ని రంగంలోకి దించాడు.

[మార్చు] జోనులు

నేపాలును మొత్తం 14 ప్రాంతీయ జోనులుగా విభజించినారు. భాగమతి, భేరి, ధావలగిరి, గండకి, జానక్ పూర్, కర్నలి, కోషి, లుంబిని, మహాకాళి, మేచి, నారాయణి, రప్తి, సగర్మత, సేతి

[మార్చు] భౌగోళికం మరియు వాతావరణం

హిమాలయ పర్వత దృశ్యాలు
హిమాలయ పర్వత దృశ్యాలు

నేపాల్, భారత్ మరియు చైనా మధ్యలో భౌగోళికముగా బంధింపబడి ఉన్నది. మొత్తం 1,47,181 చ.కి.మీ. వైశాల్యములో విస్తరించి ఉన్నది. అందులో 56,827 చ.మై. భౌగోళిక వైవిధ్యమున్నప్పటికీ పర్వతాలతో నిండి ఉన్నది. అడ్డంగా మూడు వైవిధ్య భౌగోళిక స్వరూపాలు ఈ దేశంలో ఉన్నాయి. దక్షిణాన లోతట్టు ప్రాంతము, మధ్యన చిన్న పర్వతాలతో ఉన్న ప్రాంతము, ఉత్తరాన హిమాలయాలతో(ఎవరెస్టు, ఇతర ఎత్తైన శిఖరాలతో) కూడిన అతి ఎత్తైన ప్రాంతము (8,850 మీ లేదా 29,035 అడుగులు). మొత్తము నేపాల్ లో 20% భూమి మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది. అడవుల కొట్టివేత కూడా ఒక ముఖ్య సమస్య.

[మార్చు] ఎవరెస్టు శిఖరము

ఈ శిఖరము ప్రపంచము లోనే ఎత్తైనది. దీనిని నేపాలీలో 'సాగరమాత' అనీ, టిబెట్ భాషలో'ఖోమోలోంగ్మ' అనీ పిలుస్తారు. ఇది నేపాల్-ఛైనా సరిహద్దులొ ఉన్నది. సమున్నతమైన ఎవరెస్టు శిఖరము, హిమాలయ పర్వత సానువుల తో బాటు ప్రపంచములో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాల్లోనే ఉన్నాయి. ఇవి పర్యాటకులకు ముఖ్య ఆకర్షణ. వీటిని ప్రకృతి వింతలుగా చెప్తారు. నేపాల్ లో ఐదు వాతావరణ ప్రాంతాలు ఎత్తుల వారీగా ఉన్నాయి. దక్షిణాన సమశీతోష్ణ మండలము మొదలుకొని చల్లని వాతావరణము, ఉత్తరాన అతిశీతల ప్రదేశాల వరకూ ఉన్నాయి. వర్షపాతం వివిధ ఋతువులలో ఋతుపవనాల పై ఆధారపడి వివిధ రకాలుగా ఉ॰టు॰ది.ఆ వర్షపాతమే మొత్తము స॰వత్సర వర్షపాతములో 60-80% మేర ఇస్తుంది. సంవత్సరానికి తూర్పున 2500 మి.మీ., పశ్చిమాన 1000 మి.మీ., 1420 మి.మీ. ఖాట్మండు చుట్టుపక్కలా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఇది 4000 మి.మీ. దాకా, కొన్ని సార్లు 6000 మి.మీ. దాకా కూడా ఉండవచ్చు. ఋతుపవనాలు మంచి ఊపు మీద ఉన్నప్పుడు వర్షపాత వివరాలు. (జులై-ఆగస్ట్).

దదెల్ధురా: 350 mm
నేపాల్ గన్జ్: 510 mm
బుట్వల్: 715 mm
పోఖర: 920 mm
ముస్తాన్గ్: 60 mm
ఖాట్మండు: 370 mm
చైన్పుర్: 320 mm
నమ్ఛె బజార్: 220 mm

[మార్చు] ఆర్థికవ్యవస్థ

కొండ ప్రాంతాల్లో వ్యవసాయం
కొండ ప్రాంతాల్లో వ్యవసాయం
ప్రధాన వ్యాసము: నేపాల్ ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వము మావోయిస్టుల మధ్య నిరంతరము జరిగే గొడవలు, తగవులు, చిన్న అంతర్యుద్ధముల వల్ల నేపాలు ఆర్థికముగా పతనము చెందినది. ప్రపంచములోని అత్యంత పేద దేశాలలో నేపాల్ ఒకటి, కానీ ఆర్థికంగా ఓ ప్రబల శక్తిగా మారుటకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న దేశము, కానీ సరైన నాయకత్వం లోపం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. సేవలు, వ్యవసాయం దీని ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సుమారుగా 80% జనాభా, 41% స్థూల జాతియాదాయం ఈ రెండు రంగాల నుండే వస్తుంది. పారిశ్రామికీకరణ కేవలం వ్యవసాయాధార పరిశ్రమలయిన నార (jute), చక్కర, పొగాకు, ఆహార పంటలకు మాత్రమే పరిమితం అయినది. వస్త్ర ఉత్పత్తి, కార్పెట్ల తయారీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది, గత మూడు సంవత్సరాలలో ఇవి రెండూ దేశ విదేశీ మారక ద్రవ్య సంపాదనలో 80% ఆక్రమించినాయి. పారిశ్రామికాభివృద్ది చాలా వరకూ కాట్మండు లోయ చుట్టుపక్కల, మరియూ భిరత్ నగర్, బిర్గంజ్వంటి నగరాలలోనే జరిగినది. వ్యవసాయాభివృద్ది 5%, వార్షిక జనాభావృద్ది 2.3% గా ఉన్నది.

1991నందు ప్రభుత్వము ఆర్థిక సరళీకరణల ద్వారా వ్యాపారాన్ని, విదేశీ సంస్థాగత ముదుపుదారులని ప్రోత్సహించడంద్వారా, ఆర్థికాభివృద్ది చాలా త్వరగా సాధించుదామని మొదలుపెట్టినది. కానీ రాజకీయ అస్థిరత్వం వల్ల, ఎక్కువగా వృద్ది సాధించలేకపొయినది. ముఖ్యముగా జల విద్యుత్తు, పర్యాటకరంగములలో అభివృద్దికి బాటలు పరచినది. కానీ చిన్న ఆర్థికవ్యవస్థ, రాజకీయ అస్తిరత్వం, సహజ దుర్ఘటనలు (?), సాంకేతికపరంగా వెనకబడి ఉండటం వల్ల, చైనా భారత దేశాల మధ్య భౌగోళికంగా చిక్కుకొని పోవడం వల్ల ఎక్కువగా పెట్టుబడులు రాలేదు, కానీ ఇప్పటికీ తన అభివృద్ధి బడ్జెటులో 80%, మొత్తం బడ్జటులో 28% విదేశీ పెట్టుబడులే ఆక్రమించినాయి.

[మార్చు] జనగణన వివరాలు,స॰స్కృతి

నేపాలు బహు భాషా, బహు మత, బహు జాతులు గల సమాజం. ఈ క్రింద ఇవ్వబడిన లెక్కలు 2002 నేపాలు జన గణన నుండి ఇవ్వబడినది. [1]

[మార్చు] భాషలు

నేపాల్ కి వైవిధ్య భరితమైన భాషా స॰స్కృతి ఉ॰ది.అది మూడు భాషా సముదాయాల ను॰డి ఏర్పడి॰ది.1.ఇ॰డో-ఆర్యన్,2.టిబెటో-బర్మన్,3.దేశీయమైన.2001 జాతీయ లెక్కల ప్రకార॰ నేపాల్ లో మొత్త॰ 92 వివిధ భాషలు మాట్లాడతారు(93వ దాన్ని ఉన్నాగుర్తి॰చలేకపోయారు).మాతృభాషగా నేపాలీలు మాట్లాడేది జనాభా శాత॰ ప్రకార॰ నేపాలి(49%),మైథిలి(12%),భోజ్ పురి(8%),థారు(6%),తమ॰గ్(5%),నేవారి లేదా నేపాల్ భాష(4%),మగర్(3%),అవధి(2%),బ॰టవ(2%),లి॰బు(1%),బజ్జిక(1%). మిగతా 81 భాషలు మాతృభాషగా 1% కన్నా తక్కువ మ॰ది మాట్లాడతారు. అధికార భాష దేవనాగరి లిపిలో వ్రాయబడే నేపాలి భాష.వివిధ భాషలు మాట్లాడే నేపాలీల॰దరికీ,ఈ భాష భాషా మాధ్యమ॰గా ఉపయోగపడుతున్నది. దక్షిణ తెరాయ్ లేదా5-10మైళ్ళ వెడల్పు ఉన్న నేపాల్ భారత సరిహద్దు ప్రా॰త॰లో హి॰దీ కూడా మాట్లాడతారు.

[మార్చు] మతములు

పతన్‌లో హిందూ ఆలయం
పతన్‌లో హిందూ ఆలయం

అధికారిక॰గా నేపాల్ ప్రప॰చ॰లో ఏకైక హి॰దూ దేశము. కానీ దీర్ఘ కాల॰గా అక్కడి చట్టాలు బలవ॰తపు మత మార్పిడులను,అన్య మతవిద్వేషాన్ని అడ్డుకు॰టున్నాయి. 2001 లెక్కల ప్రకార॰ 80.6% మ॰ది హిదువులు,11% మ॰ది బౌద్ధులు.కాని ఇరు మతాల వాళ్ళూ ఇరు మతాల సా॰ప్రదాయాలనూ,ఆచారాలనూ,సమాన॰గా ఆచరిస్తారు.ఇ॰కా 4.2% మ॰ది మహమ్మదీయులు,3.6% మ॰ది కిరా॰తులనబడే వాళ్ళూ ,0.5% మ॰ది క్రైస్తవులూ ఉన్నారు.వీరి స॰ఖ్య 2005 కు 6లక్షలకు పెరిగి॰ది.

[మార్చు] జాతులు,కులములు

నేపాల్ లో 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తము 103(ఒక గుర్తు తెలియని జాతితో సహా) జాతులు/కులములు ఉన్నట్లు తేలినది. కులములు అనే పద్దతి హిందూ మతము నుండి వచ్చింది. జాతుల విభజన అనేది, చారిత్రక విశేషాల వల్లా, వారికే ప్రత్యేకమైన ప్రాంతీయ ఊహాజనితమైన కథల వల్లా జరిగినది. 2001 జనాభా లెక్కల ప్రకారం ముఖ్యమైన కులాలు క్షత్రియ(ఛెత్రి)15.8%, బ్రాహ్మణ(హిల్)12.7%, మధేషి 33%, మగర్ 7.1%, తమంగ్ 5.6%, నేవార్ 5.5%, మహమ్మదీయ 4.3%, కామి 3.9%, (జాతులు)రాయ్ 3.9%, గురుంగ్ 2.8%, దమాయ్/ధోలి 2.4%. మిగతా 92 కులాలు/జాతులు 2% కన్నా తక్కువగా ఉన్నారు. వీళ్ళలోనే ప్రఖ్యాతిగాంచిన షెర్పాలు కూడా ఉన్నారు.

[మార్చు] పట్టణ జనాభా

ప్రాంతము జిల్లా జనాభా 19911 జనాభా. 2001 సరాసరి పెరుగుదల 2005 అంచనా
ఖాట్మండు ఖాట్మండు 414.264 671.846 4,7 807.300
లలిత్ పూర్ లలిత్ పూర్ 117.203 162.991 3,4 190.900
పోఖరా కాశి 95.311 156.312 5,0 190.000
భిరత్ నగర్ మోరంగు 130.129 166.674 2,5 184.000
బిర్గంజ్ పార్ష 68.764 112.484 4,9 136.200
ధరన్ సంసారి 68.173 95.332 3,6 109.800
భరత్ పూర్ చిత్వాన్ 54.730 89.323 4,9 108.200
భూత్వాల్ రూపందేహి 44.243 75.384 5,3 92.700
మహేంద్రనగర్ కంచన్ పూర్ 62.432 80.839 2,7 89.900
జానక్ పూర్ ధనుషా 55.021 74.192 3,1 83.800
ధన్ గడి కైలాలి 45.094 67.447 4,1 79.200
భక్తాపూర్ భక్తాపూర్ 61.122 72.543 1,7 77.600
హేతౌడా మక్వన్పూరు 54.072 68.482 2,4 75.300
త్రియుగ ఉదయపూర్ - 55.291 3,9 64.400
నేపాల్ గంజ్ బంకే 48.556 57.535 1,9 62.000
సిద్ధార్థ్ నగర్ రూపందేహి 35.456 52.569 2,9 58.900
మధ్యపూర్- తిమ్మి భక్తాపూర్ - 47.751 4,0 55.900
మేచి నగర్ జప - 49.060 2,8 54.800
గులరియ బర్డియ - 46.011 4,1 50.700
త్రిభువన నగర్ దంగ్దౌకురి 29.152 43.126 4,0 50.500
ఇటహ సంసారి - 41.210 4,3 48.800
లేన్కత్ కాశి - 41.369 3,2 46.900
టికాపూర్ కైలాలి - 38.722 4,1 45.500
కిర్తిపూర్ ఖాట్మండు - 40.845 2,7 45.400
రత్నానగర్ చిత్వాన్ - 37.791 4,1 44.500
కమలమయి సింధూలి - 32.828 5,3 40.400
కలైయా బర 17.265 32.260 5,6 40.100
తులసీపూర్ దంగ్దేఖురి 20.752 33.876 4,0 39.600
భీరేంధ్ర నగర్ సుర్ఖేట్ 22.888 31.381 3,1 35.500
దమక్ జప 41.419 35.009 -1,7 35.000
రాజ్ బిరాజ్ సప్తరి 23.847 30.353 2,3 33.200
కపిలబస్తు కపిలబస్తు 17.146 27.170 4,6 32.500
బ్యాస్ తనహు 20.175 28.245 3,4 32.300
లహన్ సిరాహ 19.046 27.654 3,8 32.100
పుతలిబజార్ స్యంజ - 29.667 1,4 31.400
ప్రుథ్వినారాయణ్ గోర్ఖా - 25.738 2,2 28.100
పనౌటి కభ్రేపలంచోక్ - 25.563 2,4 28.100
గౌర్ రౌతహట్ 23.258 25.383 2,2 27.700
దీపాయల్-సిల్గధి దోటి 12.259 22.061 5,8 27.600
ఇనరువ సన్సరి 18.562 23.200 2,2 25.300
సిరాహ సిరాహ - 23.988 1,0 25.000
రాంగ్రాం నవల్ పరసి - 22.630 1,8 24.300
తాన్సేన్ పల్ప 13.617 20.431 4,0 23.900
జలేశ్వర్ మహోత్తరి 18.161 22.046 2,0 23.900
భగ్లంగ్ భగ్లంగ్ - 20.852 3,2 23.700
భీమేశ్వర్ డోలఖ - 21.916 1,3 23.100
ఖడ్బరి సంకువసభ - 21.789 1,5 23.100
ధనుకుట ధనుకుట 17.155 20.668 1,9 22.300
బీదుర్ నువాకోట్ 18.862 21.193 1,3 22.300
వలింగ్ స్యంజ - 20.414 2,0 22.100
నారాయణ్ దైలేఖ్ - 19.446 2,1 21.100
మలంగ్వ సర్లహి 13.666 18.484 2,7 20.600
భధ్రపూర్ జప 15.123 18.145 1,8 19.500
అమరగడి దడేల్ధుర - 18.390 1,1 19.200
దశరథచండ్ భైతడ్ - 18.345 0,2 18.500
ఇలాం ఇలాం 13.150 16.237 2,1 17.600
బనేప కభ్రేపలంచోక్ 12.622 15.822 2,3 17.300
ధులికేల్ కభ్రేప్లంచోక్ 9.664 11.521 1,6 12.300
మొత్తం పట్టణ జనాభా 1.742.359 3.197.834 3,5 3.545.500
increase 91-01 for first 36 mun. 1.742.359 2.528.218

1 1991 నాటికి కేవలం 36 మున్సిపాలిటీలు మాత్రమే ఏర్పాటు చేయబడినాయి

[మార్చు] సెలవు దినములు

నేపాల్ కు నాలుగు పంచాంగాలు ఉన్నాయి. ప్రభుత్వపు సౌర మాన పంచాంగము. చాంద్రమాన పంచాంగము. నేపాలి సాంప్రదాయ పంచాంగము. పాశ్చాత్య పంచాంగము. నేపాల్ మతపరమైన సెలవు దినాలన్నీ చాంద్రమాస పంచాంగము ప్రకారము ఉంటాయి. అందువల్ల నేపాలీలకు సెలవు దినాల కోసమై ఒక స్థిరమైన తేదీలు అంటూ ఉండవు. సాధారణంగా రెండు ముఖ్యమైన సెలవు దినములు దషైన్,తిహార్ లు,అక్టోబర్, నవంబర్ మాసాలలో వస్తాయి.

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మరిన్ని విషయాలకు ఈక్రింద ఉన్న రచనలు చూడండి

  • Barbara Crossette. 1995. So Close to Heaven: The Vanishing Buddhist Kingdoms of the Himalayas. New York: Vintage. (ISBN 0679743634)
  • Bista, Dor Bahadur. The Peoples of Nepal
  • Peter Matthiessen.1993, "The Snow Leopard".(ISBN 0-00-272025-6)
  • Joe Simpson. 1997. "Storms of Silence"
  • Samrat Upadhyay. 2001. "Arresting God in Kathmandu"
  • Joseph R. Pietri.2001. "The King of Nepal"
  • Maurice Herzog.1951. "Annapurna"
  • Dervla Murphy.1967. "The Waiting Land"
  • Jon Kraukauer.1997. "Into Thin Air"
  • Indra Majupuria.1996. "Nepalese Women". (ISBN 974-89675-6-5)
  • Dor Bahadur Bista.1996. "People of Nepal". Kathmandu.
  • Eva Kipp.1995. "Bending Bamboo Changing Winds". (ISBN 81-7303-037-5)
  • Broughton Coburn.1982/1991. "Nepali Ama". (ISBN 0-918373-74-3)
ఇతర భాషలు
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com