See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
మాల్దీవులు - వికీపీడియా

మాల్దీవులు

వికీపీడియా నుండి

ދިވެހިރާއްޖޭގެ ޖުމުހޫރިއްޔާ
రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్
Flag of మాల్దీవులు బొమ్మ:Maldives National Emblem.png
జాతీయగీతం
Gavmii mi ekuverikan matii tibegen kuriime salaam
(జాతీయ సమైక్యతతో మన దేశానికి వందనం చేద్దాం)

మాల్దీవులు యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
మాలే
4°10′N, 73°30′E
అధికార భాషలు ధివేహి
ప్రభుత్వం గణతంత్రము
 -  అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్
స్వాతంత్ర్యము
 -  యునైటెడ్ కింగ్‌డంనుండి జూలై 26,1965 
విస్తీర్ణం
 -  మొత్తం 300 కి.మీ² (185వది)
116 చ.మై 
 -  జలాలు (%) నామమాత్రం
జనాభా
 -  జూలై 2005 అంచనా 329,000 (175వది)
 -  జన సాంద్రత 1,171 /కి.మీ² (5వది)
3,010 /చ.మై
జీడీపీ (PPP) 2002 అంచనా
 -  మొత్తం 1.25 బిలియన్ డాలర్లు (183వది)
 -  తలసరి $3,900 (2002 est.) (148వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) 0.745 (medium) (96వది)
కరెన్సీ Rufiyaa (MVR)
టైం జోన్ (UTC+5)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mv
కాలింగ్ కోడ్ +960

మాల్దీవుల గణతంత్రరాజ్యం భారతదేశానికి నైఋతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం. మాల్దీవులలో 26 పగడపు దిబ్బలలో మొత్తం 1,196 పగడపు దీవులు ఉన్నాయి.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

మాల్దీవుల యొక్క ప్రాచీన చరిత్ర అస్పష్టముగా ఉన్నది. మాల్దీవుల కథల ప్రకారం, కోయిమాలే అనే ఒక సింహళ యువరాజు తన పెండ్లికూతురైన శ్రీలంక చక్రవర్తి కుమార్తెతో పాటు ఒక మాల్దీవుల లగూన్ లో చిక్కుకొని అక్కడే స్థిరపడి మాల్దీవుల మొదటి సుల్తాన్‌గా పరిపాలించాడని ప్రతీతి.

శతాబ్దాలుగా ఈ దీవుల అభివృద్ధిపై దగ్గరగా ఉన్నఅరేబియా సముద్ర, హిందూ మహాసముద్ర తీరాల నుండి వచ్చిన నావికుల ప్రభావము ఉంది. మలబార్(ఇప్పటి భారత దేశంలోని కేరళ) తీరానికి చెందిన మోప్లా సముద్రపు దొంగలు ఈ దీవులను ఎంతో ఇబ్బందికి గురి చేసారు. 16వ శతాబ్దములో పోర్చుగీసు వాళ్ళు ఈ దీవులను తమ ఆధీనములోనికి తెచ్చుకుని 15 సంవత్సరాలు (1558-1573) వరకూ పాలించారు. వారిని మహమ్మద్ అల్ ఆజమ్ అనే దేశభక్తి గల వీరుడు తరిమివేశాడు.

చాలాకాలం స్వతంత్ర మహమ్మదీయ రాజ్యంగా ఉన్నా(1153-1968) మాల్దీవులు ఇంగ్లీషు వారి రక్షణగల దేశంగా ఉండేది (1887-జులై 25 1965). గణతంత్ర రాజ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగినా మహమ్మదీయ సామ్రాజ్యంగానే ఉండిపోయింది. ఇస్లామ్ మతానికి మారక ముందు మాల్దీవులలో బౌద్ధం విలసిల్లింది. ఈ మత మార్పిడికి కూడా రన్నమారి అనే సైతాను గురించిన ఊహాజనితమైన నమ్మశక్యము కాని కథ ప్రచారంలో ఉంది.

బ్రిటీషు వారి నుండి 1965లో స్వాతంత్ర్యము పొందినా సుల్తాను రాజ్యమే తరువాతి 3 సంవత్సరాలు పరిపాలన సాగించింది. నవంబరు 11,1968 లో దాన్ని రద్దు చేసి ఇప్పటి పేరుతో గణతంత్ర రాజ్యముగా మార్చడం జరిగింది. పర్యాటక రంగము, మత్స్య పరిశ్రమ ఈ దీవుల సమూహములో అభివృద్ధి చెందింది.

26 డిసెంబరు 2004లో హిందూ మహాసముద్రములో వచ్చిన భూకంపము వలన ఏర్పడిన సునామీ వల్ల మాల్దీవులకు అపార నష్టం వాటిల్లింది. నిరోధించటానికి అవసరమైన భూమి లేకపోవటము వలన అలలు 1.2 -1.5 మీటర్ల ఎత్తు ఎగసి పడడంతో ఈ ఉపద్రవం సంభవించింది. ఇంతే కాకుండా ఈ దీవుల సమూహము సముద్ర మట్టానికి క్రిందుగా ఉండటము(సముద్ర మట్టానికి క్రిందుగా ఉన్న దేశాలలో ప్రపంచంలో ఇదీ ఒకటి) మూలంగా కూడా మొత్తము దేశమంతా ఛిత్తడి నేలగా మారిపోయింది. సుమారు 75 మంది, ఆరుగురు విదేశీయులతో సహా గల్లంతయ్యారు. ప్రజలు నివసించే 13 దీవులలో, 29 విహార దీవులలో మొత్తం వసతులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.

[మార్చు] ఆర్ధిక వ్యవస్థ

[మార్చు] మత్స్య పరిశ్రమ

మాల్దీవుల అర్ధికవ్యవస్థ అనేక శతాబ్దాలనుండి, మత్స్య పరిశ్రమ మరియు సముద్ర ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నది. నేటికీ ఇవే ప్రజల ప్రధాన జీవనాధారాలు. అందువల్లే ప్రభుత్వము మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.

దేశ ఆర్ధిక వ్యవస్థలోనూ, ఇక్కడి మత్స్య పరిశ్రమ చరిత్రలోనూ 1974లో సాంప్రదాయ విధానమైన ధోనిలో చేపలు పట్టే పద్ధతిని యాంత్రికీకరించడము ఒక పెద్ద మైలురాయిగా భావిస్తారు. 1977లో ఒక జపానుకు చెందిన కంపెనీ యొక్క సహకారముతో చేపలను డబ్బాలలో నింపే పరిశ్రమను ఫెలివారూ దీవిలో స్థాపించారు. 1979లో మత్స్యరంగము యొక్క అభివృద్ధికి అవసరమైన పాలసీ మార్గదర్శకాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలూ చేసేందుకు ఒక మత్స్యపరిశ్రమ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మానవవనరుల అభివృద్ధి పథకాలు 80వ దశకపు తొలినాళ్లలో ప్రారంభమయ్యాయి. మత్స్య పరిశ్రమ విద్యను పాఠశాలలో పాఠ్యాంశముగా చేర్చారు. ఫిష్ అగ్రవేటింగ్ డివైజులను మరియు నావిగేషనల్ సహాయకారక యంత్రాలను అనేక ప్రధాన ప్రాంతాలలో యేర్పాటు చేశారు. అంతేకాక, మాల్దీవుల మత్స్యరంగ ఎక్స్‌క్లూజివ్ ఆర్ధిక జోను (EEZ) ప్రారంభము మత్స్య పరిశ్రమ అభివృద్ధికి మరింత దోహదము చేసింది. ప్రస్తుతం, మాల్దీవుల మత్స్య పరిశ్రమ జాతీయ స్థూల ఆదాయములో 15% పైగా చేకూర్చటమే కాక, దేశంలోని 30% పైగా జనాభాకు ఉపాధి కల్పిస్తుంది. మాల్దీవుల విదేశీ మారక ఆర్జనలో పర్యాటక రంగము తర్వాత స్థానము మత్స్యపరిశ్రమదే.

[మార్చు] పర్యాటక పరిశ్రమ

మాల్దీవుల రాజధాని మాలే
మాల్దీవుల రాజధాని మాలే

పర్యటక రంగము యొక్క అభివృద్ధి మొత్తం మాల్దీవుల యొక్క ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసింది. ఈ రంగము అనేకమందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి కల్పించడమే కాకుండా ఇతర సంబంధిత రంగాలలో ఆదాయమార్గాలను పెంపొందించింది. ప్రస్తుతం, పర్యాటకరంగము దేశం యొక్క అతిపెద్ద విదేశీమారక వనరు. జాతీయ స్థూల ఆదాయములో పర్యాటక రంగము యొక్క వాటా 20%. దేశం మొత్తం 86 పర్యాటక రెసార్టులు పనిచేస్తు ఉండగా, 2000 సంవత్సరములో 4,67,154 మంది పర్యాటకులు మాల్దీవులకు విచ్చేసినట్టు నమోదయ్యింది.

[మార్చు] కుటీర పరిశ్రమలు

దేశములో పర్యాటక రంగము అభివృద్ధితో చాపల అల్లకం, లక్కపని, హస్తకళలు మరియు కొబ్బరితాళ్ళ తయారీ వంటి అనేక సాంప్రదాయక కుటీర పరిశ్రములకు కూడా ఊతమిచ్చింది. కొత్తగా అభివృద్ధి చెందిన పరిశ్రమలలో ముద్రణ, పీవిసి పైపుల తయారీ, ఇటుకల తయారీ, సముద్రములో ఉపయోగించే ఇంజన్ల మరమ్మత్తు, షోడా నీళ్ళ బాట్లింగ్ పరిశ్రమ, దుస్తుల తయారీ మొదలైనవి ముఖ్యమైన పరిశ్రమలు.

[మార్చు] రాజకీయాలు

మౌమూన్ అబ్దుల్ గయూమ్, 1978లో మొదటి ఎన్నుకోబడిన అధ్యక్షుడు. అప్పటి నుండి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధికారదర్పముతో పరిపాలించాడు. 1988లో ఆయనకు వ్యతిరేకముగా జరిగిన ఒక కుట్రనుండి భారత రక్షక దళాల సహాయముతో తప్పించుకున్నాడు. 2003 నుండి అప్పుడప్పుడు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు రాజకీయ ప్రక్షాళనకు దారితీశాయి.

[మార్చు] భౌగోళికము

మాల్దీవులు ప్రపంచములోనే అతి చదునైన దేశముగా పేరుగాంచింది. దేశములోని అత్యున్నత స్థానము కేవలం 2.3 మీటర్లే. పెరుగుతున్న సముద్రమట్టము మాల్దీవుల ఉనికికి ప్రమాదకారిగా మారే అవకాశమున్నదని నివేదికలు వచ్చినప్పటికీ, వాస్తవానికి ఇటీవలి దశకాలలో సముద్రమట్టము కొంచెం తరిగినది.

2004లో హిందూ మహాసముద్రములో సంభవించిన సునామీ వళ్ళ మాల్దీవులలోని కొంతభాగము జలమయమై అనేకమంది ప్రజలను నిర్వాసితులను చేసింది. ఈ వినాశనము తర్వాత, కార్టోగ్రాఫర్లు సునామీ వళ్ళ రూపాంతరము చెందిన దీవుల యొక్క పటాలను తిరిగి గీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మాల్దీవుల ప్రజలు మరియు ప్రభుత్వము ఎప్పుడో ఒకప్పుడు మాల్దీవులు సముద్రపటమునుండి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.

[మార్చు] బయటి లింకులు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -