రష్యా
వికీపీడియా నుండి
Российская Федерация Rossiyskaya Federatsiya Russian Federation |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం none |
||||||
జాతీయగీతం హిమ్ ఒఫ్ ద రష్యన్ ఫెడెరేషన్ |
||||||
రాజధాని (మరియు అతిపెద్ద నగరం) |
మాస్కో |
|||||
అధికార భాషలు | రష్యన్, ఇంకా చాలా వివిధ రిపబ్లిక్‌లలో | |||||
ప్రభుత్వం | Semi-presidential federation | |||||
Independence | ||||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 17,075,200 కి.మీ² (1st) 6,592,745 చ.మై |
||||
- | జలాలు (%) | 0.5 | ||||
జనాభా | ||||||
- | 2005 అంచనా | 143,202,000 (7th) | ||||
- | 2002 జన గణన | 145,513,037 | ||||
- | జన సాంద్రత | 8.4 /కి.మీ² (178th) 21.7 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $1.778 trillion (7-9th) | ||||
- | తలసరి | $12,254 (54th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) | 0.795 (medium) (62nd) | |||||
కరెన్సీ | రూబల్ (RUB ) |
|||||
టైం జోన్ | (UTC+2 to +12) | |||||
- | వేసవి (DST) | (UTC+3 to +13) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ru, .su reserved | |||||
కాలింగ్ కోడ్ | +7 |
రష్యన్ ఫెడరేషన్ లేదా రష్యా అనే దేశము, ఉత్తర ఆసియా మరియు తూర్పు ఐరోపాఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెండు ఇంతలు పెద్ద దేశము. జనాభా విషయములో చైనా , భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, మరియు బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది. రష్యా కి ఇరుగు పొరుగు దేశాలు (ప్రతిఘడి దిశలో - ): నార్వే, ఫిన్లాండ్, ఏస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, బెలారస్, ఉక్రెయిన్, జార్జియా, అజర్‌బైజాన్, కజకస్తాన్, చైనా, మంగోలియా మరియు ఉత్తర కొరియా. అమెరికా సంయుక్త రాష్ట్రాల కు, మరియు జపాన్ కు కూడా రష్యా కొద్ది దూరంలోనే ఉంది. బేరింగ్ జల సంధి రష్యాను అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి విడదీస్తుంటే, లా-పెరౌసీ జల సంధి రష్యా ను జపాన్ నుండి విడదీస్తుంది.
గతములో ప్రబల గణతంత్రమైన యు ఎస్ ఎస్ ఆర్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్), డిసెంబర్ 1991లో విడిపోయినప్పుడు రష్యా ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడినది. ఈనాటికి కూడా రష్యా కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్లో ఒక ప్రభావవంతమైన దేశము. సోవియట్ సమాఖ్యలో ఉన్నప్పుడు రష్యాని రష్యన్ సోవియట్ ఫెడెరేటెడ్ సోషియలిస్ట్ రిపబ్లిక్స్ (ఆర్ ఎస్ ఎఫ్ ఎస్ ఆర్) అని పిలిచేవారు.
సోవియట్ యూనియన్ యొక్క అత్యధిక స్థలము, జనాభా మరియు పారిశ్రామిక ఉత్పత్తి, ఆనాటి రెండు ప్రపంచ శక్తులలో ఒకటైన రష్యాలో విలీనం అయ్యాయి. కావున యు.ఎస్.ఎస్.ఆర్ విభజించబడిన తరువాత రష్యా కోల్పోయిన తన గత ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఈ ప్రభావము, గుర్తింపు గణనీయం అయినా, గత సోవియట్ యూనియన్ తో పోలిస్తే చెప్పుకోదగ్గవి కావు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] ప్రాచీన రష్యా
అనాదిగా (1 శతాబ్దానికి ముందు) విశాలమైన రష్యా భూముల్లో సఖ్యత లేని అనేక తరగతుల ఆదివాసీలు నివసించే వారు. వీరిపై మూడు నుండి ఆరు శతాబ్దముల మధ్య కాలములో గోథ్స్, హన్స్, మరియు తుర్కిక్ అవర్స్ వేర్వేరు రకాలుగా దాడులు చేసి భూములను వారి అధీనం చేసుకున్నారు. దాడుల పిమ్మట ఈ దేశ దిమ్మరులు ఐరోపా ఖండముకి చేరుకునేవారు. టుర్కిక్ జాతికి చెందిన ఖజర్స్, ఎనిమిదవ శతాబ్దము దాకా దక్షిణ రష్యాని పరిపాలిస్తూ, బైజంటైన్ రాజ్యం సహకారముతో అరబ్ ఖలీఫాలపై దాడులు జరిపేవారు. ఈ మధ్యనే వోల్గా ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో వైదీక భగవంతుల విగ్రహాలు బైటపడటము, వీరికి తొమ్మిదవ శతాబ్దము నుండి భారత దేశముతో పరిచయాలు ఉన్నట్లు తెలుపుతున్నాయి.
ఈ కాలంలో వారంగియన్స్ ప్రజాతి వారిని, అటుపిమ్మట స్లావ్స్ ని "ర్హొస్" ఇంక "రుస్" అని పిలిచేవారు. పది నుండి పదకొండు శతాబ్దము కాలములో కీవన్ రుస్, ఆసియా మరియు ఐరోపా దేశాలతో వ్యాపార సంబంధాల వల్ల ఐరోపాలో కెల్లా అన్నిటకన్నా విశాలమైన మరియు ప్రగతిపరమైన రాష్ట్రము అయ్యింది. ఐతే పన్నెండవ శతాబ్దంలో పవిత్ర యుద్ధాలు (క్రూసేడ్స్) కీవన్ రుస్ యొక్క పతనానికి దారి తీసాయి.
13వ శతాబ్ది కాలంలో ఈ ప్రాంతములో అంతఃకలహాలు ప్రబలాయి. అదే అదనుగా తూర్పు దిశ నుండి ఈ ప్రాంతంపై దాడులు జరిగాయి. తరువాత సుమారు మూడు శతాబ్దాలపాటు మంగోలుల, ముస్లిం యోధుల దళాలు రష్యాను కొల్లగొట్టాయి. తాతార్లు(tatars) గా పేరుబడ్డ వీరి ఏలుబడి కింద ఇప్పటి దక్షిణ మరియు మధ్య రష్యా భూభాగాలు ఉండేవి. నేటికీ ఆయా ప్రాంతాల్లో వీరి ప్రాబల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాగా, పశ్చిమ భాగం ఎక్కువగా అప్పటి ఉమ్మడి దేశమైన లిథువేనియా మరియు పోలెండ్ కింద ఉండేది. కీవన్ రూస్ ల పతనం కాలానుగుణంగా రష్యన్ జాతిని ఉత్తరంలో బెలారస్ మరియు పడమట ఉక్రెయిన్ జాతులుగా విడదీసింది.
మంగోలుల ఏలుబడిలో ఉన్న నవ్ గొరోడ్ సహిత రష్యా ఉత్తర భాగం కొంతవరకూ స్వతంత్రాన్ని అనుభవించేది. కానీ వీరికి కూడా జెర్మనీయ పవిత్ర యుద్ధ దళాల దాడులు తప్పేవికాదు. చాలా కాలంపాటు సంచార జాతుల ఏలుబడిలో ఉన్న బాల్కన్ మరియు ఆసియా మైనర్ ప్రాంతాలలో మాదిరిగానే మంగోలుల పాలన ఇక్కడ కూడా సంస్కృతి, ఆర్ధికాభివృద్ధి విషయాల్లో వ్రతిరేక ప్రభావం చూపింది. అయినప్పటికీ రష్యా అనతికాలంలోనే పునరేకీకరించబడింది. పదిహేనవ శతాబ్ది మధ్యకాలానికి తమని దురాక్రమించిన శత్రురాజ్యాలను పూర్తిగా పారదోలటమే కాకుండా, వారి భూభాగాల్లో కొంత భాగాన్ని కూడా రష్యా ఆక్రమించుకుంది. 1453లో కాన్ స్టాంటినోపుల్ పతనానంతరం తూర్పు ఐరోపాలో రష్యా మాత్రమే క్రియాశీలకమైన క్రైస్తవ రాజ్యంగా మిగిలింది. ఒక విధంగా, ప్రాచ్యంలో రోమన్ సామ్రాజ్య పరంపర కొనసాగించే బాధ్యత రష్యా స్వీకరించింది.
[మార్చు] రాచరిక రష్యా
మంగోలుల ప్రాబల్యం సన్నగిల్లుతున్న దశలో మాస్కో ప్రభువులు పరిస్థితులను అంచనావేసి తెలివిగా పావులుకదపనారంభించారు. క్రమంగా, పదునాలుగవ శతాబ్దాంతానికి మంగోలుల అధిపత్యం అంతమైపోయింది. ఇవాన్-ది-టెర్రిబుల్ గా పేరొందిన ఇవాన్ ప్రభువు కాలానికి రష్యా పూర్తిగా మంగోలుల చెరనుండి బయటపడింది. రష్యా రాజరిక చరిత్రలో ఇవాన్ ప్రభువు మొదటి జార్ గా పేరుపొందాడు (జార్ అనే పదం రోమన్ బిరుదం సీజర్ నుండి ప్రేరణ పొందింది). ఈయన కాలంలోనే రష్యా సైబీరియా లో చాలా భాగాన్ని ఆక్రమించింది. ఆ విధంగా రష్యన్ మహా సామ్రాజ్యావిర్భావానికి అంకురార్పణ జరిగింది.
రష్యాపై మాస్కో ప్రభువుల పెత్తనం ఆ విధంగా మొదలై క్రమంగా విస్తరించింది. ఈ క్రమంలో రాచరికపు పగ్గాలు రొమనోవ్ వంశస్థుల చేతికొచ్చాయి. 1613లో సింహాసనమెక్కిన మిఖాయెల్ రొమనోవ్ (ఈయన్నే మొదటి మిఖాయెల్ చక్రవర్తి గా కూడా పిలుస్తారు) ఈ వంశ పాలనకాద్యుడు. 1689 నుండి 1725 వరకూ పాలించిన పీటర్-ది-గ్రేట్ రష్యన్ చక్రవర్తులందరిలోకీ గొప్పవాడిగా వినుతికెక్కాడు. పీటర్ చక్రవర్తి కాలంలో రష్యా సామాజికంగానూ, సాంస్కృతికంగానూ ఎంతో పురోగమించింది. ఈయన తరువాత గద్దెనెక్కిన కేధరిన్ మహరాణి (1767 - 1796) పాలనలో రష్యా మరింత పురోగమించి ఆసియా ఖండంలో ఒక ప్రబల శక్తిగా ఆవిర్భవించటమే కాకుండా ఐరోపాలో అప్పటికే బలమైన రాజ్యాలుగా పేరొందిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు జర్మనీ లకు పోటీగా ఎదిగింది.
[మార్చు] ఇనుప తెరల వెనక్కి
జార్ చక్రవర్తుల హయాంలో రష్యా ఏకీకృతమై ఒక బలమైన రాజ్యంగా ఎదిగినా, కింది తరగతి ప్రజలలో సమానావకాశాలు లేకపోవటం, దానికి తోడు చక్రవర్తుల అణచివేత విధానాల వల్ల గూడుకట్టుకున్న అసంతృప్తి మొదటి ప్రపంచ సంగ్రామం నాటికి పెల్లుబికి అప్పటి రాజు రెండవ నికొలాస్ మీదా, ఆయన వంశస్థుల మీదా ఆగ్రహ జ్వాలలుగా పైకెగసింది. అగ్నికి ఆజ్యం తోడయినట్లు మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యన్ సేనల పరాజయ పరంపర దానికి తోడై, దేశంలో అంతర్యుద్ధానికి దారితీసింది. దీన్నే రష్యన్ విప్లవం గా పిలుస్తారు. ఆ ధాటికి 1917లో రష్యా రొమనోవ్ వంశస్థుల రాజరికపు పాలన నుండి బయటపడింది. అదే సమయంలో కమ్యూనిస్ట్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్కులు అధికారాన్ని చేజిక్కించుకుని సోషలిస్ట్ రష్యన్ సమాఖ్య (యు. ఎస్. ఎస్. ఆర్) ను ఏర్పాటు చేశారు. లెనిన్ తరువాత కమ్యూనిస్ట్ పార్టీ పగ్గాలు చేపట్టిన జోసెఫ్ స్టాలిన్ హయాంలో రష్యా పారిశ్రామికంగానూ, వ్యవసాయికంగానూ అప్రతిహతంగా పురోగమించింది. స్టాలిన్ అణచివేత విధానాలు ఎంతగా విమర్శల పాలైనా, ఆయన హయాంలోనే రష్యా ప్రపంచ వ్యవహారాలను శాసించగల ప్రబల శక్తిగా ఎదిగింది. మానవ వనరుల వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత విజయాలు, పారిశ్రామికీకరణ, అద్వితీయమైన సైనిక సంపత్తి మొదలయిన వాటితో అమెరికా సంయుక్త రాష్ట్రాల తో ఢీకొనే స్థాయికి ఎదిగి ప్రపంచంలో రెండవ అగ్రరాజ్యంగా పేరొందింది.
[మార్చు] సోవియెట్ సమాఖ్య పతనానంతరం
కమ్యూనిజాన్ని ఆధునికీకరించే ప్రయత్నంలో 1980లలో ప్రధాన కార్యదర్శి మిఖాయిల్ గోర్బచెవ్ పరిపాలనలో పారదర్శకత ( గ్లాస్ నోస్త్ ), సంస్కరణ ( పెరిస్త్రోయికా ) లను ప్రవేశ పెట్టాడు. ఆ ప్రయత్నం ఊహించని ఫలితాలకు దారి తీసింది.ఆదే అదనుగా , అప్పటి వరకూ రష్యా పోషిస్తున్న పెద్దన్న పాత్రపై మిగిలిన సోవియట్ రిపబ్లిక్కుల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఒక్కమాటున బయటపడింది. తదనంతర పరిణామాలలో 1991 డిసెంబరు 15నాటికి సోవియెట్ సమాఖ్య పదిహేను స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. అలా ఏర్పడిన రాజ్యాల్లో భూభాగం, జనాభా పరంగా రష్యా అన్నింటికన్నా పెద్దది. ఆ తరువాత సుమారు దశాబ్దం పాటు రష్యా ఎన్నో ఆటుపోట్లకు గురయ్యింది. ఈ కాలంలో రష్యాలో ఏక పార్టీ కమ్యూనిస్టు పాలన కనుమరుగై ఆ స్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రూపుదిద్దుకుంది. 1990లలో చెచెన్యా ప్రాంతం కూడా రష్యా నుండి స్వతంత్రం ప్రకటించుకుంది. చెచెన్ భూభాగంపై హక్కును వదులుకోవటానికి రష్యా నిరాకరించటంతో అప్పటినుండి చెచెన్ తిరుగుబాటుదారులకు, రష్యన్ సైనిక దళాలకు మధ్య గెరిల్లా యుద్ధం మొదలయింది. దశాబ్దంపైబడి సాగుతున్న ఈ అప్రకటిత యుద్ధంలో ఇప్పటివరకూ సుమారు రెండు లక్షలమంది అసువులు బాసినట్లు అంచనా. ఇటీవలి కాలంలో చెచెన్ తిరుగుబాటు ఇస్లాం మతం రంగు కూడా సంతరించుకుంది. చెచెన్యా తోనే కాకుండా రష్యాకు ఉత్తర ఒసేషియా ( North Ossetia ), ఇన్గ్షెషియా ( Ingushetia ) లతో కూడా చిన్న చిన్న సరిహద్దు సమస్యలున్నాయి.
[మార్చు] రాజకీయం
ప్రస్తుతం రష్యాలో అధ్యక్ష తరహా పాలన నడుస్తుంది. అధ్యక్షుడిని నాలుగేళ్లకోమారు ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొంటారు. రష్యా అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలుంటాయి. ఈయన అధికార నివాసం క్రెమ్లిన్ . ప్రధాన మంత్రి సహా ముఖ్యమైన ప్రభుత్వ అధికార గణాన్ని అధ్యక్షుడే నియమిస్తాడు. ఈ నియామకానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో పార్లమెంటు ఆమోదంతో పని లేకుండా అధ్యక్షుడే అత్యున్నత ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈయన రష్యన్ జాతీయ భద్రతా మండలికి అధ్యక్షుడు, మరియు రష్యన్ సర్వ సైన్యాధ్యక్షుడు కూడా.
[మార్చు] ఆర్థిక వ్యవస్థ
1991 లో సోవియట్ యూనియన్ పతనమైన దశాబ్దానంతరం ఇప్పుడు రష్యా ఒక సరికొత్త విపణి వ్యవస్థను యేర్పరచడానికి మరియు శక్తివంతమైన ఆర్ధికాభివృద్ధిని సాధించడానికి చాలా ప్రయత్నిస్తోంది. సంస్కరణల అమలుబాటు విషయమై కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థల కలహం వల్లా, ఆర్ధిక జవసత్వాలు కృంగి పొవటం వల్లా రష్యా యొక్క అర్ధిక వ్యవస్థ ఐదేళ్ళపాటు తీవ్ర నష్టాల్ని చవిచూసింది. అంతేగాక, 1987 లో వచ్చిన అత్యవసర జీవవనరుల కొరత, తత్ఫలితంగా భారీ స్థాయి అంతతర్జాతీయ సహయం కోసం అర్రులు చాచవలసిన పరిస్థితి రష్యా అత్మభిమానాన్ని, అర్ధిక వ్యవస్థను దెబ్బ తీశాయి.
స్వేచ్ఛా వణిజ్య పరంగానూ, వినిమయదారుని అభిరుచుల పరిగణణ లోనూ కొన్ని అసమర్ధతలున్నప్పటికీ, మునుపటి సోవియట్ యూనియన్ అర్ధిక విధానంలో రష్యా ప్రజల జీవన ప్రమణాలు ముఖ్యంగా 1950ల తరువాత విపణి కేంద్రీకృతమూ, పెట్టుబడిదారీ వ్యవస్థలైన మెక్సికో, బ్రజిల్, భారతదెశము, అర్జెంటీనా తదితర దేశాల ప్రజల జీవన ప్రమాణాల తో పోల్చితే మెరుగ్గానే వున్నాయని చెప్పక తప్పదు.
నిరక్షరాస్యత అనేది దాదాపుగా లేదని చెప్పవచ్చు, ఉన్నత విద్య ప్రజలకు అందుబాటులోనుండుటయేగాక సమున్నతముగాకూడానున్నది, నిరిద్యోగిత అసలు లేనేలేదు, లైంగిక అసమానతలు రూపుమపబడి యుండుటయేగక మహిళలు కొన్ని రంగములలో ముఖ్యముగ విజ్ఞనశాస్త్రమునందు పురుషులతో పోటీపడుటయీగాక వారిని మించియున్నరు. చాలా కుటుంబములు TV, tape-recorder లను కొనగలిగి ఉండుటయేగక వారు ప్రముఖసముద్ర తీర ప్రాంతములకు సంవత్సరమునకు వొకసారైననూ విమానయానము చేయగల సామర్ధ్యమునుకూడా కలిగియుడిరి.
తగిన పారిశుధ్య వసతి లేని మురికివాడలు కానరాకున్నప్పటికీ, ప్రజల వద్దనున్న వస్తుసంపద (ప్రత్యేకించి వస్త్రాలు మరియు ఆహారము) చాలా తక్కువ నాణ్యత గలవిగానుండెడివి అంతేగాక ప్రజలు నివసించుటకు తగినన్ని గ్రుహసముదాయములు కూడా లీకుండెడివి.
ఆవిధంగా జాతుల, తెగల వైరం మూలంగా రష్యా విఛ్ఛిన్నానంతరం 1971లో స్వేఛా విపణి ప్రభావానికి లోనుకావడం ద్వారా ఆర్ధికంగా కోలుకోవడం ప్రారంభించింది.
అదే సంవత్సరం సంభవించిన ఆసియా అర్ధిక మాంద్యము 1998లో రూబుల్ పతనానికి, రష్యన్ ప్రభుత అప్పులలో కూరుకు పొవడానికి తద్వారా
రష్యన్ ప్రజాజీవన విలువల పతనానికి కారణభూతమైంది. ఆ విధంగా 1998 విపణి మాంద్యానికి, ఆర్ధిక వనరుల కొరతకి కూడా కారణమైంది.
ఐతే, 1999 నాటికి ఆర్ధిక వ్యవస్థ కొద్దిగా కోలుకోవడమేగాక త్వరితగతిన వృద్ధిచెందడం ప్రారంభించింది. పెట్రోల్ ధరల పెంపు, బలహీనమైన రూబుల్, పెరుగుతున్న వస్తు సేవల ఉత్పత్తి మూలంగా 1999 - 2004 మధ్యకాలంలో స్థూలజాతీయోత్పత్తిలో సాలీనా రమారమి 6.8% అభివృద్ధి సాధ్యమవసాగింది. ఐనప్పటికీ ఆ ఆర్ధికాభివృద్ధి దెశమంతటా సమానంగా విస్తరించివుండక దేశ రాజధాని అయిన ఒక్క మాస్కో మాత్రమే స్థూలజాతీయోత్పత్తిలో 30% నికి కారణభూతమైయుండెడిది.
[మార్చు] ప్రత్యేక విషయాలు
- రష్యాలో నిర్మానుష్యంగా గ్రామాల సంఖ్య 11000.
- కేవలం పదిమంది మాత్రమే నివసిస్తున్న గ్రామాల సంఖ్య 30,000.
[మార్చు] మూలములు
- The New Columbia Encyclopedia, Col.Univ.Press, 1975
[మార్చు] బయటి లింకులు
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
మూస:Wikinews
[మార్చు] ప్రభుత్వ వనరులు
- Gov.ru - Official governmental portal (in Russian)
- Kremlin - Official presidential site (in English)
- Webcam in Russia
- Federative Council - Official site of the parliamentary upper house
- Duma - Official site of the parliamentary lower house (in Russian)
- Embassy of the Russian Federation to the United States
- Official site: Federal Cadaster Center of Russia - Administrative maps of Russia (legends in Russian)
- U.S. Embassy Moscow
- U.S. State Department Consular Information Sheet: Russia
- Russia Energy Resources and Industry from U.S. Department of Energy
- Russian Economy: Bank of Finland
[మార్చు] సాదారణ సమాచారం
- The Russia Journal - An independent news and analysis source from Russia.
- English Edition of Pravda
- Russian Federal Districts (legends in English)
- government links
- Internet Resources for Russian Studies
- Paper Money of Russia
- Russia News
- Johnson's Russia List Archive
- Impressions of Soviet Russia, by John Dewey
- German-Russian Exchange NGO that connects volunteers to ngo's in Russia (not only Germans)
|
---|
క్రొవేషియా · చెక్ రిపబ్లిక్ · డెన్మార్క్ · ఎస్టొనియా · ఫిన్లాండ్ · ఫ్రాన్స్ · జర్మనీ · జార్జియా1 · గ్రీస్ · హంగరీ · ఐస్లాండ్ · ఐర్లాండ్ · ఇటలీ · లాట్వియా · లైచెన్స్టెయిన్ · లిథువేనియా · లక్సెంబర్గ్ · మాల్టా · మోల్డోవా · మొనాకో · నెదర్లాండ్స్ · నార్వే · పోలాండ్ · పోర్చుగల్ · మాసిడోనియా · రుమేనియా · రష్యా1 · సాన్మారినో · సెర్బియా,మాంటినెగ్రో · స్లొవేకియా · స్లొవేనియా · స్పెయిన్ · స్వీడన్ · స్విట్జర్లాండ్ · టర్కీ1 · సైప్రస్2 · ఉక్రెయిన్ · యునైటెడ్ కింగ్డమ్ · వాటికన్ నగరం |
|
|
---|---|
ఆఫ్ఘనిస్తాన్ · ఆర్మేనియా · అజెర్బైజాన్1 · బహ్రయిన్ · బంగ్లాదేశ్ · భూటాన్ · బ్రూనై · కంబోడియా · చైనా · తూర్పు తైమూర్ · సైప్రస్1 · జార్జియా1 · భారత దేశము · ఇండొనేషియా · ఇరాన్ · ఇరాక్ · ఇస్రాయెల్ · జపాన్ · జోర్డాన్ · కజకస్తాన్1 · దక్షిణ కొరియా · ఉత్తర కొరియా · కువైట్ · కిర్గిజిస్తాన్ · లావోస్ · లెబనాన్ · మలేషియా · మాల్దీవులు · మంగోలియా · మయన్మార్ · నేపాల్ · ఒమన్ · పాకిస్తాన్ · ఫిలిప్పీన్స్ · కతర్ · రష్యా1 · సౌదీఅరేబియా · సింగపూర్ · శ్రీలంక · సిరియా · తజికిస్తాన్ · తైవాన్ · థాయిలాండ్ · టర్కీ1 · టుర్క్మెనిస్తాన్ · యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ · ఉజ్బెకిస్తాన్ · వియత్నాం · యెమెన్1 1 ఐరోపా, ఆసియా - రెండు ఖండాలలోనూ విస్తరించిన దేశం. |
|
---|
ఆఫ్ఘనిస్తాన్ · కజఖిస్తాన్ · కిర్గిజ్స్తాన్ · మంగోలియా · రష్యా · తజికిస్తాన్ · తుర్కమేనిస్తాన్ · ఉజ్బెకిస్తాన్ |