డెనిస్-ఓ బెడద
వికీపీడియా నుండి
డెనిస్ | |
ఓ బెడద |
|
జన్మ నామం | డెనిస్ |
---|---|
జననం | మార్చి 12, 1951 కార్మెల్, కాలిఫొర్నియా, అమెరికా |
స్వస్థలం | అమెరికా |
నివాసం | పత్రికల చిత్రాలలో, పాఠకుల హృదయాలలో |
ఇతర పేర్లు | డెనిస్-ఓ బెడద |
వృత్తి | అల్లరి చెయ్యటం |
డెనిస్ ఓ బెడద (Dennis The Menace) అనేది ఒక వ్యంగ్య చిత్రాల(Cartoon) సంపుటి. ఈ వ్యంగ్య చిత్రాల సృష్తికర్త అమెరికాకు చెందిన హాంక్ కెచ్చమ్(Hank Ketcham) అనే వ్యంగ్య చిత్రకారుడు.
విషయ సూచిక |
[మార్చు] జననం
1950లో హాంక్ కెచ్చమ్ తాను సాటర్ డె ఈవెనింగ్ పోస్ట్ (The Saturday Evening Post) పత్రికలో వేయవలసిన వ్యంగ్య చిత్రం గురించి అలోచించుకుంటూ ఉండగా, అతని బెడ్ రూమ్ ప్రాంతంనుండి పెద్ద గడబిడ శబ్దాలు వినబడ్డాయట. ఆ వెనువెంటనే, అతని భార్య, అతను కూర్చున్న గది తలుపులు తటాలున తెరుచుకొని లోపలకొచ్చి, చాలా కోపంగా, "శుభ్రంగా నిద్రపోవలిసిన వెధవ, మన బెడ్ రూమ్ అంతా ధ్వంసం చేసేశాడు. మీ కొడుకు "ఓ బెడద" గా తయారయ్యాడని వాళ్ళ నాలుగేళ్ళ కొడుకు గురించి ఫిర్యాదు చేసింది. వాళ్ళ కొడుకు పేరు డెనిస్ ల్లాయడ్ కెచ్చమ్. అప్పుడు హాన్క్ కెచ్చమ్ కు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. "డెనిస్ ఓ బెడద" అని కొన్ని వ్యంగ చిత్రాలను ఏందుకు వెయ్యకూడదు అనుకుని, వెంటనే, చాలా చిలిపిగా కనిపించే ఓ చిన్న పిల్లాడి బొమ్మల్ని డజను దాకా పెన్సిలు తో గీసి, న్యూయార్క్ లో ఉన్న తన ఏజంటుకు పంపించాడు.
[మార్చు] పేరు ప్రఖ్యాతులు
పది రోజుల తరువాత, అతని ఏజంటు అయిన జాన్ కెనడీ(John Kennedy)ఒక పెద్ద పత్రిక వాళ్ళకి నీ బొమ్మలు నచ్చాయి, మరో డజను పంపించు, వాళ్ళు కొనేట్లున్నారు అని టెలిగ్రాం ఇచ్చాడు. మిగిలిన విషయం వ్యంగ్య చిత్రాల చరిత్రగా మారింది.డెనిస్ ఓ బెడద అనే వ్యంగ్య చిత్రాల సంపుటి జన్మించింది. ప్రారంభంలో, ఎకంగా పదహారు వార్తా పత్రికలలో ఏక కాలంలో మార్చి 12, 1951 న ప్రారంభించబడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ప్రజాదరణ పొందిన వ్యంగ చిత్రాల సంపుటి ఇది. 1952 కల్లా, అంటే ప్రారంబించిన సంవత్సరానికల్లా, ఆ వ్యంగ్య చిత్రాలన్నీ ఒక పుస్తక రూపంలో ప్రచురించబడి లక్షా ఇరవై ఒక్క వేలు అమ్ముడు పొయినాయట. ఆ సంవత్సరానికి, కెచ్చమ్ కు "అద్భుత కార్టూనిస్ట్" బహుమతి నేషనల్ కార్టూనిస్ట్ సొసైటీ వారిచే ఇవ్వబడింది.1959లో జె నార్త్ "డెనిస్" గా ఒక టి.వి ధారావాహిక మొదలయ్యింది. "డెనిస్" పేరు మీద ఆటబొమ్మలు, పుస్తకాలు బొమ్మలు మొదలయినవి రావటం మొదలయ్యింది. ఇప్పటికి, దాదాపు వెయ్యికి పైగా వార్తా పత్రికలలో, 48 దేశాలలో ఈ వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడుతున్నాయి.
[మార్చు] ఇవి కూడా చూడండి
- ఆంగ్లంవికీలో సంబంధించిన వ్యాసాలు
[మార్చు] బయటి లింకులు
- Dennis the Menace - the Official Website
- Dennis the Menace at King Features
- List and short bios of the strip's characters
- Toonopedia: Dennis the Menace
- Fantagraphics' Dennis The Menace page
- NCS Awards