భారతి (మాస పత్రిక)
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడ స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది.
సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడ ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో.
భారతి పత్రికకు గన్నవరపు సుబ్బరామయ్య సంపాదకులుగా ఉన్నారు.
నాగేశ్వరరావు అనంతరం అతని అల్లుడు శంభుప్రసాద్, ఆ తరువాత అతని కుమారుడు శివలెంక రాధాకృష్ణ భారతిని నిర్వహించారు.
భారతి తొలి సంచికలో మంగిపూడి వేంకటశర్మ రచించిన గాంధీ శతకము ప్రచురణ ప్రారంభించారు.
భారతిలో పనిచేసిన వారిలో తిరుమల రామచంద్ర, విద్వాన్ విశ్వం మొదలైన వారు ఉన్నారు. ఈ పత్రికలో మరొక ఆకర్షణ తలిశెట్టి రామారావు కార్టూనులు.
భారతి పత్రిక 1949లో రజతోత్సవం మరియు 1984లో వజ్రోత్సవం జరుపున్నది.
వ్యాపార పక్షంగా లాభదాయకంగా లేక పోయినా సాహితీ ప్రియులకి ఇది ఒక అభిమాన పత్రిక.