చోడవరం(రామచంద్రాపురం మండలం)
వికీపీడియా నుండి
చోడవరం తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం మండలానికి చెందిన గ్రామము . చోడ రాజు (రాజేంద్ర చోడుడు) ఇచ్చిన వరం కాబట్టి "చోడవరం" ఆని పేరు వచ్చింది. బికనీర్ (రాజస్థాన్) నుండి పిఠాపురం ఆస్థానానికి మంత్రి, సేనాని పదవులకు అమ్మన్న, తమ్మయ్య ఆనే ఇద్దరు అన్నాతమ్ముళ్ళను పిఠాపురం మహారాజా రప్పించాడు. బికనీర్ నుండి వచ్చారు కాబట్టి బికనీర్ వారు అని ప్రజలు పిలవడం మొదలు పెట్టారు. అదే కాలక్రమంలో బిక్కని వారు గా పరిణామం చెందింది.
ఈ బిక్కని అమ్మన్న బిక్కని తమ్మయ్య లు ఒక యుద్ద సమయం లో "రాజేంద్ర చోడ" అనే మహారాజు కి సహాయం చేయడం వల్ల దానికి కృతఙ్ఞత గా అమ్మన్నకు పెద్దాపురం దగ్గర వున్న కట్టమూరు, తమ్మయ్య కు రామచంద్రపురం దగ్గర వున్న చోడవరం దానం గా ఇచ్చాడు. కనుకనే ఇప్పటికీ ఈ రెండు ఊళ్ళ లో బిక్కని వారి జనాభా అత్యధికం. ఆ "బిక్కని" నే కొందరు బిక్కిని అనీ, బిక్కిన అనీ అంటున్నారు. వీరి గోత్రం "మునికూళ్ళ". కొందరు దీనిని మునికుల అంటున్నారు. కాని పూర్వపు పత్రాలలో వీరి ఇంటిపేరు బిక్కని అని వుండటం మనం గమనించవచ్చు.
వ్యవసాయం చోడవరం గ్రామ ఆయకట్టు మొత్తం 2,500 ఎకరాలు మొత్తం మాగాణి. ప్రదాన పంట వరి. వేసవి లో మూడవ పంట గా పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలు పండిస్తారు.
[మార్చు] దేవాలయాలు
- చోడవరం లో చోడరాజులు నిర్మించిన కేశవస్వామి దేవాలయం అతి పురాతన దేవాలయం. ఈ దేవాలయం ఇంచుమించు పదవ శతాబ్ధం లో నిర్మించారు. ఈ దేవాలయం లో కేసవస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై వున్నారు. ఈ దేవాలయం పూర్తిగా ఇసుక రాతి తో నిర్మింపబడింది. దేవాలయం మాత్రమే కాక ఈ ప్రాంగణం లోనే షోడష స్తంభ (పదహారు స్తంభాల 4x4) నాట్యమండపం కూడా నిర్మించారు. ఈ దేవాలయానికి 1980 లో మరమ్మత్తులు చేసారు. ఇదే ఆవరణలో 1960 వ దశకం లో నిర్మించిన కోదండరాముని ఆలయం కూడా మనంచూడవచ్చు.
- రాజేంద్రచోడుడు నిర్మించిన శ్రీ అగస్థేశ్వర స్వామి(శివుడు) ఆలయం వుండేది. అది జీర్ణావస్థ లో వుండడంతో 1960 వ దశకం లో దానిని పునర్మించారు. 1980 లో తి.తి.దే.(తిరుమల తిరుపతి దేవస్థానములు) వారి ఆర్దిక సహాయం తో ఈ దేవాలయానికి ప్రహారీ గోడ మరియు ఒక కళ్యాణ మండపం నిర్మించారు.
- పాగేలమ్మ వారి దేవాలయం మరొక ముఖ్యమైన దేవాలయం. ఈవిడ గ్రామదేవత. ఈవిడ మారెడ్డి వారి ఇంటి ఆడపడుచు, బిక్కని వారి ఇంటి కోడలు అనీ, ముత్యాలమ్మ (బిక్కని వారి ఇంటి ఆడపడుచు), గంగమ్మ(మల్లిపూడి (గొల్లలు) వారి ఆడపడుచు), సత్తమ్మ, బంగారమ్మ (బంగారు బాపనమ్మ) (బ్రాహ్మల ఆడపడుచు), గొంతెమ్మ (రాజుల ఆడపడుచు, మాలల కోడలు), పోతురాజు లకు అక్క అనీ ఒక నమ్మకం. ఈ దేవతలందరి విగ్రహాలూ గుడిలో వుండటమే కాక ఎవరికి వారి గుడులు వేరువేరుగా వారివారి స్థానాలలో వుంటాయి. పాగేలమ్మ వారి జాతర వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజున గరగ ఎత్తటం తో మొదలై వైశాఖ బహుళ చతుర్దశి రోజున జాగరణ, వైశాఖ బహుళ అమావాస్య రోజున తీర్దం, జేష్ట శుద్ధ పాడ్యమి రోజున బలిహరణ(కుంభం పోయడం)తో ముగుస్తుంది. నేటికీ మనం ఇక్కడ శివసత్తులను (శివ శక్తులు) చూడవచ్చు.