స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు
వికీపీడియా నుండి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ఒక అనుబంధ బ్యాంకు మరియు భారతదేశములోని షెడ్యుల్డ్ బ్యాంకులలో ఒకటి. ప్రారంభంలో హైదరాబాదు నిజాంచే ఈ బ్యాంకు స్థాపించబడింది. స్వాతంత్రం అనంతరం ఇతర బ్యాంకులతో పాటు సంస్థానంలోని ఈ బ్యాంకును కూడా 1959 బ్యాంకుల అనుబంధ చట్టం ప్రకారం పేరు మార్చబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ బ్యాంకుగా చేయబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, భారతీయ స్టేట్ బ్యాంకుకు మొట్టమొదటి అనుబంధ బ్యాంకు. దీని ప్రధాన కేంద్రం హైదరాబాదు నగరంలో ఉంది.
[మార్చు] చరిత్ర
హైదరాబాదు సంస్థానాన్ని పరిపాలించిన చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1941లో నిజాం రాజ్యపు కేంద్ర బ్యాంకుగా దీనిని స్థాపించారు. బ్రిటీష్ పరిపాలన కాలంలో నిజాం రాజ్యంలో ప్రత్యేకంగా చెలామణి అవుతున్న ఉస్మానియా సిక్కా కరెన్సీని కూడా ఈ బ్యాంకు నిర్వహించేది.
[మార్చు] ఇవి కూడా చూడండి
|
---|
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్ • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ • స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ • స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా • స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్ |