కరీంనగర్ లోకసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గం
- చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గం
- సిరిసిల్ల అసెంబ్లీ నియోజక వర్గం
- మానకొండూరు అసెంబ్లీ నియోజక వర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- హుజురాబాదు అసెంబ్లీ నియోజక వర్గం
- హుస్నాబాదు అసెంబ్లీ నియోజక వర్గం
[మార్చు] నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
-
-
-
లోకసభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ రెండవ 1957-62 ఎం.ఆర్.కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 జె.రమాపథిరావు భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 జె.రమాపథిరావు భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 ఎం.సత్యనారాయణ రావు తెలంగాణా ప్రజా సమితి ఆరవ 1977-80 ఎం.సత్యనారాయణ రావు భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 ఎం.సత్యనారాయణ రావు భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 జె.చొక్కారావు భారత జాతీయ కాంగ్రెస్ తొమ్మిదవ 1989-91 జె.చొక్కారావు భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 జె.చొక్కారావు భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 రమణ తెలుగుదేశం పార్టీ పన్నెండవ 1998-99 సి.విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టీ పదమూడవ 1999-04 విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టీ పదునాల్గవ 2004-06 కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి (ఉపఎన్నిక) 2006-08 కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి (ఉపఎన్నిక) 2008-ప్రస్తుతం వరకు కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి
-
-
[మార్చు] 2004 ఎన్నికలు
2004 లో జరిగిన 14వ లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితోనూ, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతోనూ పొత్తు కుదుర్చుకున్నందున తెరాస తరఫున ఆ పార్టీ అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు, భాజపా తరఫున సి.హెచ్.విద్యాసాగర్ రావులు పోటీపడ్డారు. హోరాహోరీగా జరిగిన పోరులో కె.చంద్రశేఖరరావు 1,31,168 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇంతకు క్రితం రెండు సార్లు విజయం సాధించిన విద్యాసాగర్ రావుకు రెండో స్థానం లభించింది.
- 2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్లు
-
-
-
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి 4,51,199 సి.హెచ్.విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టీ 3,20,031 మామిడిపల్లి గంగారాం ఇండిపెండెంట్ 59,686 కొత్తపల్లి సాంద్రి మేనయ్య బహుజన్ సమాజ్ పార్టీ 43,582
-
-
[మార్చు] 2006 ఉపఎన్నికలు
లోకసభ సభ్యుడిగా ఉన్న కె.చంద్రశేఖర్రావు రాజీనామా చేయడంతో 2006లో ఉపఎన్నిక అనివార్యమైంది. 2004లో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన కెసిఆర్ ఈ సారి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయిననూ తెలంగాణా భావన అధికంగా ఉండుటచే సునాయాసంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించాడు. సమీప ప్రత్యర్థి కామ్గ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండులక్షలకుపైగా మెజారిటీపొంది లక్ష్యం నెరవేర్చుకున్నాడు.
- 2006 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్లు
-
-
-
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి 3,78,030 టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 1,76,448 ఎల్.రమణ తెలుగుదేశం పార్టీ 1,70,268 సి.హెచ్.విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టీ 21,144
-
-
[మార్చు] 2008 ఉపఎన్నికలు
తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యుల మూకుమ్మడి రాజీనామాల వలన జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 4 లోకసభ, 18 శాసనసభ స్థానాలలో (రెండు శాసన సభ స్థానాలలో సభ్యుల మరణాల వల్ల జరిగాయి) 2008లో ఉపఎన్నికలు జరిగాయి. ఈ లోకసభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో పర్యాయం తెరాస అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఎన్నికల రంగంలోకి దిగాడు. తెరాసతో పాటు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కూడా ఈ స్థానంకై ఇంతకు క్రితం పోటీచేసిన అభ్యర్థులను నిలబెట్టాయి. భాజపా మాత్రం ఈపోటీలకు దూరంగా ఉండటమే కాకుండా ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. తెరాస క్రితం సారి సాధించిన భారీ మెజారిటీతో మరియు తెలంగాణా అంశంతో ఉత్సాహంగా బరిలోకి దిగగా, కాంగ్రెస్ మరియు తెలుగుదేశంలు కూడా ఈ స్థానం చేజిక్కించుకొనుటకు చాలా ప్రయత్నించాయి. ఏడాది లోపలే సాధారణ ఎన్నికలు ఉండటంతో ఈ ఎన్నికలను ప్రాధాన్యత ఏర్పడింది. హోరాహోరీగా జరిగిన పోరులో చివరికి తెరాస అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు విజయం సాధించిననూ ఆధిక్యం మాత్రం బాగా తగ్గిపోయింది. కేవలం 15,765 ఓట్ల తేడాతో చంద్రశేఖరరావు సమీప సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన టి.జీవన్ రెడ్డిపై గెలిచాడు.
- 2008 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్లు
-
-
-
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి 2,69,452 టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2,53,687 ఎల్.రమణ తెలుగుదేశం పార్టీ 1,73,400
-
-
[మార్చు] నియోజకవర్గ ప్రముఖులు
- సి.హెచ్.విద్యాసాగర్ రావు
- ప్రధాన వ్యాసం: సి.హెచ్.విద్యాసాగర్ రావు
- విద్యాసాగర్ రావు తొలిసారిగా 1980లో ఈ నియోజకవర్గం నుంచి జనతా పర్టీ తరఫున పోటీచేసి ఎం.సత్యనారాయణ (ఎమ్మెస్) చేతిలో ఓడిపోయాడు. ఆ తరువాత ఈ లోకసభ నియోజకవర్గం పరిధిలోని మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున వరుసగా 3 సార్లు (1985, 89 మరియు 94) గెలుపొందినాడు. 1998 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమణపై, 1999లో కాంగ్రెస్ అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించాడు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో సహాయమంత్రిగానూ పనిచేశాడు. ఇతడు కరీంనగర్ జిల్లా భాజపా అధ్యక్షుడిగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్ర సమితి అవరతణ తరువాత ఆ పార్టీ అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు కరీమ్నగర్ లోకసభ నుంచే పోటీచేయడంతో 2004లో మరియు 2006 ఉపఎన్నికలలో కెసిఆర్ చేతిలోోటమి చెందినాడు. 2008లో జరిగిన ఉపఎన్నికలలో కూడా పోటీ చేయలేడు.
- కె.చంద్రశేఖర రావు
- తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడైన కె.చంద్రశేఖర రావు ప్రత్యేక తెలంగాణ సాధనకై తెలుగుదేశం పార్టీని వదిలి ప్రత్యేకపార్టీని ఏర్పాటుచేశాడు. ఇతని స్వస్థలం మెదక్ జిల్లా సిద్ధిపేట్ అయిననూ కరీంనగర్ లోకసభ స్థానాన్ని ఎంచుకొని 2004 ఎన్నికలలో కామ్గ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని విజయం సాధించాడు. 2006లో లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2లక్షలకు పైగా మెజారిటీతో ఘనవిజయం పొందినాడు. 2008లో మళ్ళీ తెరాస సభ్యులందరూ రాజీనామా చేయడంతో జరిగిన ఉపఎన్నికలలో కూడా విజయం సాధించిననూ మెజారిటీ 15వేలకే పరిమితమైంది.
|
---|
అనంతపురం · అనకాపల్లి · అమలాపురం · అరకు · ఆదిలాబాదు · ఏలూరు · ఒంగోలు · కడప · కరీంనగర్ · కర్నూలు · కాకినాడ · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · చేవెళ్ళ · జహీరాబాదు · తిరుపతి · నంద్యాల · నరసాపురం · నరసారావుపేట · నల్గొండ · నాగర్కర్నూల్ · నిజామాబాదు · నెల్లూరు · పెద్దపల్లి · బాపట్ల · భువనగిరి · మచిలీపట్నం · మల్కాజ్గిరి · మహబూబాబాద్ · మహబూబ్నగర్ · మెదక్ · రాజంపేట · రాజమండ్రి · వరంగల్ · విజయనగరం · విజయవాడ · విశాఖపట్నం · శ్రీకాకుళం · సికింద్రాబాదు · హిందూపురం · హైదరాబాదు |