అటల్ బిహారీ వాజపేయి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
1924 లో మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఇతను మొదటిసారిగా రెండో లోక్‌సభ కు ఎన్నికైనాడు. మద్యలో 8 వ , 9 వ లోకసభలకు తప్పించి ప్రస్తుతం వరకు కూడా ప్రతి లోకసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అద్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అద్యక్షుడిగా పనిచేశాడు. 1996 లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగ్యం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998 లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించాడు. 1999 లో 13 వ లోకసభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.
ఇంతకు ముందు ఉన్నవారు: పి.వి.నరసింహారావు |
భారత ప్రధానమంత్రి 05/16/1996—06/01/1996 |
తరువాత వచ్చినవారు: దేవెగౌడ |
ఇంతకు ముందు ఉన్నవారు: ఐ.కె.గుజ్రాల్ |
భారత ప్రధానమంత్రి 03/19/1998—05/22/2004 |
తరువాత వచ్చినవారు: డా.మన్మోహన్ సింగ్ |
|
---|
అటల్ బిహారీ వాజ్‌పేయి · · లాల్ కృష్ణ అద్వానీ · · మురళీ మనోహర్ జోషి · · కుషభావ్ థాక్రే · · బంగారు లక్ష్మణ్ · · జానా కృష్ణమూర్తి · · వెంకయ్య నాయుడు · · రాజ్ నాథ్ సింగ్ |