తెలుగుదేశం పార్టీ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
తెలుగుదేశం పార్టీ | |
---|---|
నాయకత్వము | చంద్రబాబు నాయుడు |
స్థాపితము | మార్చి 29, 1982 |
ముఖ్య కార్యాలయము | రోడ్డు నంబరు.2, బంజారా హిల్స్, హైదరాబాదు-500033 |
కూటమి | నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ నుండి ఈ మధ్యనే విడిపోయింది |
సిద్ధాంతము | ప్రాంతీయతావాదం |
ప్రచురణలు | |
వెబ్ సైట్ | http://www.telugudesamparty.org/ |
చూడండి | భారత రాజకీయ వ్యవస్థ భారతదేశ రాజకీయ పార్టీలు భారతదేశంలో ఎన్నికలు |
తెలుగుదేశం పార్టీ లేదా TDP భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.
13వ లోక్‌సభ (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచినది.
విషయ సూచిక |
[మార్చు] నందమూరి తారక రామారావు శకం
నందమూరి తారక రామారావు తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలొ సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమితెలుసన్న అప్పటి ప్రధాని "ఇందిరా గాంధీ" హేళనకు గట్టి జవాబు చెపారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 40 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్ధులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 500 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రేసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలివిడత, ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది.
వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భ్రుతిగా స్వీకరించినా, అది కేవలం NTRకు మాత్రమే చెల్లింది.
1988లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది.
1988 మరియు 1994ల మధ్యకాలంలో, ఎన్.టి.రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్-టైం విలేఖరి మరియు రాజకీయ చరిత్ర విద్యార్ధి అయిన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు. ఈ కాలంలో ఎన్.టి.రామారావు అప్పటి ప్రధానులైన వి.పి.సింగ్ మరియు చంద్ర శేఖర్లకు మద్దతునిచ్చి, "నేషనల్ ఫ్రంట్" పార్టీని స్థాపించి, కేంద్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు.
1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు రెండవసారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో, అప్పటి ఆర్ధిక మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో, ఎన్.టి.రామారావుకు తాను స్థాపించిన పార్టీ మీదనే అధికారం కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు ఎన్నికల సంఘం కూడా పార్టీ పేరును ఎన్.టీ రామారావు తరపు వారికి కాకుండా చంద్రబాబు తరపు వారికే కట్టబెట్టింది. దానితో ఎన్.టీ.రామారావు, ఎన్.టి.ఆర్ తెలుగుదేశం అనే కొత్త పార్టీని స్థాపించారు. సినిమాలలో "రాముడి"గా, "కృష్ణుని"గా వేరెవ్వరినీ ఊహించుకోవీలులేని విధంగా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిన ఆంధ్రుల "అన్నగారి మహాభినిష్క్రమణానికి హాజరైన జనసందోహమే ఆ మహానాయకుని అనంత కీర్తికి,ప్రజాభిమానానికి ప్రతీక.
[మార్చు] చంద్రబాబు నాయుడి శకం
1996లో రామారావు మరణము తరువాత ఆయన భార్య లక్ష్మీ పార్వతి అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్ధులు వారసత్వానికి పోటిపడిన తరుణములో మరలా చీల్చినది. అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవడము మొదలైన కారణాలతో ఆ తరువాత జరిగిన ఎన్నికలలో నామమాత్రము లేకుండా పోయింది. ఇప్పుడు అధికారికముగా తెలుగు దేశము పార్టీగా గుర్తింపబడుతున్న అధిక సంఖ్యాక వర్గానికి నాయకుడు చంద్రబాబు నాయుడు.
నాయుడు హైదరాబాదును మరియు రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చినాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.
[మార్చు] ఇవికూడా చూడండి
- భారతదేశ రాజకీయ పార్టీల జాబితా
- భారత రాజకీయాలు