See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
తులసి - వికీపీడియా

తులసి

వికీపీడియా నుండి

తులసి

శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియాప్సిడా
వర్గము: లామియేల్స్
కుటుంబము: లామియేసి
ప్రజాతి: ఓసిమం
జాతి: ఓ. టెన్యుయిఫ్లోరమ్
ద్వినామము
ఓసిమం టెన్యుయిఫ్లోరమ్
లి.
Synonyms
ఓసిమం శాంక్టమ్ లి.

తులసి (Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్ (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు.

విషయ సూచిక

[మార్చు] తులసి ప్రాముఖ్యత

హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్ధం అన్నమాట తరచు వింటాము.

వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంధం చరక సంహితంలోనూ, అంతకంటే పురాతనమైన ఋగ్వేదంలోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా గృహ వైద్యంచిట్కాలలో కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేశే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం.


ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒకోసారి తులసి (హోలీ బేసిల్)గా పొరపడటం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, రుచి, వాసనలోనూ తేడాలున్నాయి.

[మార్చు] ఔషధంగా తులసి

తులసి మొక్క.
తులసి మొక్క.

తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.

కొన్ని ఉపయోగాలు
  • తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా,

జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.

  • తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.
  • పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
  • చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
  • ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - కీటకాలను దూరంగా ఉంచడం కోసం.


ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, హెర్బల్ టీ, నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును.


ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక COX-2 inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న యూజినాల్'(Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).[1][2] ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక డయాబెటిస్ (చక్కెర వ్యాధి) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది. [3] రక్తంలో కోలెస్టరాల్ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది. [4]


'రేడియేషన్' కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి.[5] అలాగే కంటి శుక్లాల సమస్యకు కూడా. [6]

[మార్చు] పురాణాలలో తులసి

తులసిని గురించి హిందూమతంలో ఎన్నో కధలు, నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి.

[మార్చు] బ్రహ్మవైవర్త పురాణం

బ్రహ్మవైవర్త పురాణంలో తులసి గురించి దాని పవిత్రత గురించి వివరింపబడింది. పరశురాముడు తన గురువైన శివుడిని దుర్గాదేవి గణపతిని అన్ని పుష్పములతో అర్చించాడు కాని తులసితో అర్చించక పోయినా గణపతి ఆ పూజలు ఎందువలన స్వీకరించాడు అని నారదుడు నారాయణ మునిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వృత్తాంతాన్ని చెబుతారు. ఒక్కప్పుడు యవ్వనము నందున్న తులసి నారాయణుడిని మనసులో తలచుకొనుచు వెళ్ళుచుండగా గంగానది తీరంలో చందనము రాసుకొని రత్నాలంకారములతో నారాయణుడి గురించి ధ్యానం చేసుకొనుచున్న గణపతి కనిపించెను. ఆయనను చూసి తులసి కామ పీడితురాలై గణపతితో వికారముగా గజముఖమును కలిగి లంబోదరముతో ఏకదంతము కలిగి నువ్వు ధ్యానం వదిలి పెట్టి బాహ్య ప్రపంచములోకి రమ్ము అని అంటుంది. దానికి సమాధానంగా, తల్లి శ్రీకృష్ణ పాదపంకజాలను స్మరిస్తున్న నన్ను ఏలా నా ధ్యానంను భంగము చేయుచున్నావు, నీ తండ్రి ఎవరు, నీకు ఏ విఘ్నాలు కలగకుండ ఉండుగాక నీ విషయాలు తెలుపుము అని అంటాడు. అప్పుడు తులసి తాను ధర్మద్వజుడు కుమార్తెనని భర్త కోసం తపం ఆచరిస్తున్నానని గణపతిని భర్తగా అవ్వమని కోరుకొంటుంది. అప్పుడు గణపతి వివాహానికి నిరాకరించి పెళ్ళి దుఃఖం కలిగించునని శ్రీహరి సాన్నిధ్యము నుండి వేరు చేయునని, మోక్షమార్గానికి కవాతం కాదని వారిస్తాడు. తులసి దానికి కోపించి గణపతిని ఈ విధంగా శపిస్తుంది "నీభార్య అందరివద్ద ఉండుగాక". ఈ శాపవచనమును విన్న గణపతి ప్రతిశాపంగా "నువ్వు రాక్షస జన్మ ఎత్తుతావు, శరీరాన్ని పరిత్యజించిన తరువాత వృక్షానివి అవ్వుతావు" అంటాడు. ఆ ప్రతిశాపం విన్న తులసి రోదించి గణపతిని స్తుతించింది , అది విని గణపతి ప్రసన్నుడై

పుష్పాణాం సార భూతాం త్వం భవిష్యసి మనోరమే
కళాంశేన మహాభాగే స్వయం నారాయం ప్రియా
ప్రియత్వం త్వరదేవానాం శ్రీకృష్ణస్య విశేశతః
పూజా విముక్తిదా నౄణాం మయాభోగ్యాన నిత్యశః
ఇత్యుక్త్వాతాం సురశ్ర్ష్ఠో జగామ తపసేపునః
హరేరాధన నవ్యగ్రో బదరి సన్నిధింయయౌ

పుష్పములన్నింటికి ప్రధానదానవు అవుతావు, సమస్త దేవతలకు ప్రత్యేకంగా శ్రీకృష్ణపరమాత్మకు ప్రీతి పాత్రురాలు అవుతావు, నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి గణపతి బదరికా వనానికి వెళ్ళి పోతాడు.

ఆ తరువాత తులసి శంఖచూడునకు అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మిస్తుంది, శంఖచూడుడు శివుని చేత శూలంతో సంహరించబడ్డాక తులసి వృక్షరూపాన్ని పొందుతుంది. అందువల్ల గణపతి ప్రతి నిత్యం తులసితో పూజించరాదు. ఈ విషయాలు ధర్ముడు తనకు చెప్పెనని నారాయణ ముని నారదునితో చెప్పడంతో ఆ వృత్తాంతం ముగుస్తుంది.

తులాభారం

శ్రీ కృష్ణ తులాభారం కధలో -సత్యభామ బారువులకొలది బంగారం వేసినా సరితూగని కృష్ణుడు రుక్మిణి ఒక్క తులసి ఆకు వేయగానే తూగాడు. భగవంతుడు భక్తికి అందుతాడని ఈ గాధ సందేశం.

[మార్చు] ఆచారాలలో తులసి

తులసికి సంబంధించిన ఆచారాలకు మౌలికమైన నమ్మకాలు:

  • తులసి విష్ణువునకు ప్రియమైన భక్తురాలు. విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు.
  • తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది.
  • తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు.
  • ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి.

కార్తీక శుక్ల ఏకాదశి నాటినుండి పౌర్ణమి వరకు తులసీ వివాహం ఉత్సవం జరుగుతుంది.

ఇతర మతాలలో
  • ఏసు క్రీస్తును శిలువ వేసిన స్థలంలో తులసి పెరిగిందని ఒక కధ.
  • షియా రచనలలో కూడా తులసి ప్రస్తావన ఉంది[7].

[మార్చు] తులసిని గురించిన సూక్తులు, ప్రార్ధనలు

ఇంటి ప్రాంగణములో తులసికోట
ఇంటి ప్రాంగణములో తులసికోట
  • "గంగ స్మరణం లాగానే తులసీ స్మరణం, హరి నామస్మరణం సకల పాపహరణము" - బృహన్నారదీయ పురాణం
  • "తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్ధీంచడం వలన రోగములు నశిస్తాయి. తులసిని పూజించిన యమునిగూర్చి భయముండదు." - స్కంద పురాణం
  • "తులసి ఆకులు, పూలు శ్రీకృష్ణునకు అత్యంత ప్రీతికరమైనవి." - భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకురా


తులసీ స్తోత్రం నుండి
జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టి స్థిత్యంత కారిణీ
నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయికే
తులసీ శ్రీ మహాలక్ష్మీర్విద్యా యశస్వినీ
ధర్మా ధర్మా నవా దేవీ దేవ దేవః మనఃప్రియా
లక్ష్మీప్రియసఖీ దేవీద్యౌర్భమిరచలాచలా
షోడశైతాని నామాని తులస్యాః కీర్తెయేన్నరః
లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం భవేత్
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా
తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

[మార్చు] దేవతగా తులసి

దేవతామూర్తి రూపములో పూజించబడుతున్న తులసి
దేవతామూర్తి రూపములో పూజించబడుతున్న తులసి

తులసి ఇంటి ప్రాంగణములో ఉండటం ఆ ఇంట్లో నివసించే హిందూ కుటుంబము యొక్క సాంప్రదాయ నిష్టను సూచిస్తుంది. వైష్ణవం వంటి అనేక సంప్రదాయాలలో తులసి మొక్క ఇంట్లో లేనిదే ఆ ఇళ్ళు అంసపూర్ణమని భావిస్తారు. ఇటువంటి కుటుంబాలలో తులసి ఒక ప్రత్యేకమైన స్థానములో తులసికోట కట్టించి అందులో నాటతారు. తులసికోటకు నలువైపులా దేవతాచిత్రాలు ఉండి నాలుగు వైపులా ప్రమిదలు లేదా దీపం పెట్టడానికి చిన్న గూళ్ళు ఉంటాయి. కొన్ని ఇళ్ళలో వరండాలో ఒక డజను దాకా తులసి మొక్కలు పెంచుతారు. ఒక చిన్నపాటి పొదలాగా పెరిగిన దీన్ని తులసీవనం లేదా తులసీ బృందావనం అని పిలుస్తారు.

తులసి కాండముతో చేసిన జపమాల
తులసి కాండముతో చేసిన జపమాల

గంధర్వతంత్రము ప్రకారం ఏకాగ్రత మరియు నిష్టతో ధాన్యము చేసుకోవటానికి మరియు పూజలు చేసుకోవటానికి అనుకూలమైన స్థలాల్లో, తులసి మొక్కలు గుబురుగా పెరిగిన ప్రదేశాలు కూడా ఉన్నవి. అటువంటి ఆలయాలలో ఒకటైన వారణాసిలోని తులసీ మానస్ మందిర్ లో ఇతర హిందూ దేవతలతో పాటు తులసి కూడా పూజలందుకొంటున్నది. వైష్ణవులు, విష్ణువుకు తులసి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా గౌరవించి నైవేద్యములో భాగముగా తులసి ఆకులను స్వీకరిస్తారు. వీళ్లు తులసి కాండముతో చేసిన పూసల దండలను ధరిస్తారు. తులసి దండల తయారీ, అనేక తీర్ధయాత్రా స్థలాల్లో కుటీర పరిశ్రమగా కొనసాగుతున్నది. గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో తులసికి, బృందావన దేవత, బృందాదేవి లేదా వృందాదేవి అని కూడా మరోపేరు కలదు.

[మార్చు] తులసి పూజ

పూజ కొరకు అలంకరించిన ఒక తులసి మొక్క. పక్కనే బాణాసంచా కాల్చటాన్ని కూడా చూడవచ్చు
పూజ కొరకు అలంకరించిన ఒక తులసి మొక్క. పక్కనే బాణాసంచా కాల్చటాన్ని కూడా చూడవచ్చు

ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి (సాధారణంగా దీపావళికి రెండువారాల తర్వాత) రోజున తులసి మొక్కకు చెరుకు గడలతో పందిరి వేసి, ఆ పందిరికి మామిడి తోరణాలు కట్టి, తులసి మొక్కను పూలతో అందంగా అలంకరించి పూజ చేసే సాంప్రదాయము భారతదేశములో ఉన్నది. దీపావళి ఉత్సవాలలో లాగే తులసి మొక్కచుట్టూ మరియు ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలో దీపాలు పెట్టి అలంకరిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా బాణాసంచా కూడా కాల్చుతారు. ఉత్తర భారతదేశములో మరియు దక్షిణాన గౌడియ వైష్ణవ సముదాయాలలో ఆ రోజును తులసీ వివాహ్ లేదా తులసికి కృష్ణునితో శిలారూపములో వివాహము జరిగిన రోజుగా భావిస్తారు.


[మార్చు] మూలాలు, వనరులు

  1. Indian J Exp Biol. 1999 Mar;37(3):248-52.
  2. Prakash P, Gupta N. Therapeutic uses of Ocimum sanctum Linn (Tulsi) with a note on eugenol and its pharmacological actions: a short review.
  3. Effect of Ocimum sanctum Leaf Powder on Blood Lipoproteins, Glycated Proteins and Total Amino Acids in Patients with Non-insulin-dependent Diabetes Mellitus. Journal of Nutritional & Environmental Medicine. V. RAI MSC, U. V. MANI MSC PHD FICN AND U. M. IYER MSC PHD. Volume 7, Number 2 / June 1, 1997. p. 113 - 118
  4. Evaluation of Hypoglycemic and Antioxidant Effect of Ocimum Sanctum,. Jyoti Sethi, Sushma Sood, Shashi Seth, and Anjana Talwar. Indian Journal of Clinical Biochemistry, 2004, 19 (2) 152-155.
  5. Devi, P. Uma; Ganasoundari, A.. Modulation of glutathione and antioxidant enzymes by Ocimum sanctum and its role in protection against radiation injury. Indian Journal of Experimental Biology, v.37, n.3, 1999. March,:262-268.
  6. Sharma, P; Kulshreshtha, S; Sharma, A L. Anti-cataract activity of Ocimum sanctum on experimental cataract. Indian Journal of Pharmacology, v.30, n.1, 1998:16-20
  7. http://al-islam.org/jesus_shiite_narrations/16.htm

[మార్చు] బయటి లింకులు

తులసి మాత
తులసి ఉపయోగాలు
తులసి పెంపకం
ఇతరాలు


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -