Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
పసుపు - వికీపీడియా

పసుపు

వికీపీడియా నుండి

పసుపు
Curcuma longa
Curcuma longa
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Liliopsida
ఉపతరగతి: Zingiberidae
వర్గము: Zingiberales
కుటుంబము: జింజిబరేసి
ప్రజాతి: Curcuma
జాతి: C. longa
ద్వినామము
Curcuma longa
Linnaeus

పసుపు (Curcuma longa) అల్లం (Zingiberaceae) జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది. భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహారాష్ట్రాకు చెందిన సాంగ్లి పట్టణంలో ప్రపంచంలోనే గొప్పగా పసుపు వ్యాపారం జరుగుతుంది.

విషయ సూచిక

[మార్చు] గుణ గణాలు

పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా పండుతుంది. దుంపలపై ఉండే చెక్కుతీసి, ఎండ బెట్టి గృహస్థాయిలో తయారుచేసే పసుపును ముఖ్యంగా పూజలకు, ఇంటిలో వంటలకు వాడుతుంటారు. వాణిజ్య పరంగా పసుపుకు చాలా ప్రాముఖ్యం ఉంది. పసుపు దుంపలనుంచి వివిధ ప్రక్రియల ద్వారా పసుపు కొమ్ములు, పసుపు (పొడి) తయారుచేస్తారు.

పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ ఫాస్ఫరస్‌ గూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువులో వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీ బయోటిక్‌, కాన్సర్‌ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్‌ నిరోధించేవి, ట్యూమర్‌ కలుగకుండా వుండే, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి. పసుపు దుంపల్లో కర్‌క్యుమిన్‌ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కర్‌క్యుమిన్‌ అనే పదార్థం వల్లననే పసుపు సహజమైన పసుపురంగులో ఉంటుంది. ఇప్పటివరకు పసుపులో బంగారు వన్నెలో వుండే కర్‌క్యుమిన్‌, డిమిథాక్సి కర్‌క్యుమిన్‌, బిస్‌డిమిథాక్సి కర్‌క్యుమిన్‌ అనే పదార్థాలపై అత్యంత పరిశోధనలు జరిగాయి. పసుపు దుంపలో కర్‌క్యుమిన్‌ కేవలం 3 నుంచి 5 శాతమే ఉన్నప్పటికీ శరీర సౌందర్యానికి, శరీర ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.

[మార్చు] ఉపయోగాలు

[మార్చు] చర్మ సౌందర్యానికి

పసుపు బాహ్యంగాను, అంతరంగాను శరీర అందానికి తోడ్పడుతుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతిలో పోషిస్తుంది. సాంప్రదాయకంగా నువ్వులనూనె, సున్నిపిండితో పసుపు కలిపి స్నానానికి వాడుతుంటారు. అలాగే బాదాంనూనె, మీగడ, తేనెను పసుపుతో కలిపి వంటికి రాసుకొని స్నానం చేస్తే సౌందర్యం ఇనుమడిస్తుంది. వంటిమీద నొప్పి ఉన్నచోట, దెబ్బలు లేదా గాయాలు తగిలినచోట, వాపులవద్ద పసుపు రాస్తే చాలావరకు సంబంధిత భాధలు తగ్గుతాయి. చర్మం మీద మొటిమలు అనేక రుగ్మతలు పసుపు వాడితే తగ్గుతాయి.

[మార్చు] ప్రథమ చికిత్స

దెబ్బలు, గాయాలు తగిలినపుడు శరీరం నుంచి రక్త స్రావాన్ని ఆపుటకు పసుపు దోహదపడుతుంది. యాక్సిడెంట్లు, ఇతర సంఘటనలతో కొంతమంది మానసిక రుగ్మతలకు గురయినప్పుడు, అలాంటి సమయాలలో ఒక కప్పు వేడిపాలలో రెండు చెంచాల పసుపు, రెండు చెంచాల నెయ్యి కలిపి తాగిస్తే చాలావరకు తేరుకుంటారు. శరీరంలోని వివిధ అవయవాలలో జరిగే ప్రక్రియలు సక్రమంగా నిర్వహించడానికి పసుపు తోడ్పడుతుంది.

[మార్చు] జీర్ణకోశ సమస్యలకు

  • పొట్టలో, జీర్ణాశయంలో గ్యాస్‌ను తగ్గిస్తుంది.
  • హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాల నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది.
  • గుదం (రెక్టమ్‌) నుంచి రక్తస్రావం జరుగుతుంటే 2 లేదా 3 టీస్పూన్లు పసుపును అన్నంతోగాని, పాలలోగాని కలిపి తీసుకుంటే తగ్గుతుంది.
  • నీళ్ల విరేచనాలు/ రక్త విరేచనాలకు ఒక కప్పు పెరుగులో 10 గ్రా. లేదా 2 టీ స్పూన్లు పసుపు చేర్చి తింటే తగ్గిపోవచ్చు.
  • మూల వ్యాధి (పైల్స్‌)తో బాధపడేవారు పసుపు, ఆవనూనె, ఉల్లిరసం కలిపిన మిశ్రమాన్ని పైల్స్‌ ఉన్నచోట రాస్తే ఉపశమనం ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం.

కాలేయం (లివర్‌)

  • విషతుల్యమైన పదార్థాల నుంచి కాలేయానికి హాని కలుగకుండా కాపాడుతుంది.
  • కాలేయంలో తయారయ్యే పిత్తరసం లేదా బైల్‌ ఉత్పత్తిని పెంచుతుంది.
  • ఆల్కహాల్‌ ఎక్కువ తాగేప్పుడు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 5 గ్రా. పసుపును ఒక గ్లాసు నీళ్ళలోగాని, మజ్జిగలోగాని కలిపి నెలరోజులపాటు తాగితే లివర్‌కు ప్రమాదం లేకుండా ఉంటుంది.

[మార్చు] శ్వాసకోశ సమస్యలకు

  • బయటి కాలుష్యం నుంచి, విషతుల్యమైన పదార్థాల నుంచి శ్వాసకోశాన్ని రక్షిస్తుంది.
  • ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్‌ నెయ్యి, 4-5 గ్రా. పసుపు కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. ఆస్మా నుంచి ఉపశమనం ఉంటుంది.
  • నేతిలో ఒక స్పూన్‌ పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లులి వేసి వేయించి, వాసన పీల్చి తింటే బ్రాంకైటిస్‌ వున్నవారికి మందు బాగా పనిచేస్తుంది.
  • స్త్రీలలో నెలసరి సక్రమంగా జరగటానికి దోహదపడుతుంది.
  • బహిష్టులో వున్నప్పుడు ఎలాంటి నొప్పులు రాకుండా చేస్తుంది.
  • స్త్రీల గర్భసంచిలో ట్యూమర్‌ రాకుండా తోడ్పడుతుంది.
  • రొమ్ములో కాన్సర్‌ రాకుండా నివారిస్తుంది.

[మార్చు] ఇతర ఉపయోగాలు

  • రక్తంలో ఎల్‌.డి.ఎల్‌ కొలెస్టెరాల్‌ మోతాదును తగ్గించి గుండెజబ్బులు రాకుండా చూస్తుంది.
  • పసుపులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

[మార్చు] కాన్సర్‌ నివారణలో పసుపు

దేశవిదేశాలలో జరిగిన పరిశోధనల ద్వారా పసుపు శరీరంలోని ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, నోరు వగైరా భాగాలలో కాన్సర్‌ రాకుండా నివారిస్తుందని తెలిసింది. పసుపు శరీరంలో కాన్సర్‌ దరి చేరలేని పరిస్థితులు కల్పిస్తూ, శరీరంలోని వివిధ కణాలను కాన్సర్‌ ఎదుర్కొనేట్లు చేస్తుంది. ఎప్పుడైనా కణితి (ట్యూమర్‌) ఏర్పడితే దాన్ని నిర్మూలించేట్లు చేస్తుంది.

[మార్చు] వనరులు

[మార్చు] బయట లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com