పాలు
వికీపీడియా నుండి
పాలు లేదా క్షీరము (Milk) సంపూర్ణాహారము. ఇందులో అన్ని రకాలైన పోషకవిలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ.
ప్రతిరోజూ చిన్నపిల్లలయితే లీటరున్నర, పెద్దవాళ్ళయితే అర లీటరు పాలు తాగవలెను.
విషయ సూచిక |
[మార్చు] పోషక విలువలు
- కొవ్వు పదార్దాలు 4 %
- పిండి పదార్ధాలు ('కార్బోహైడ్రేట్'లు) - 4.7 %
- మాంసకృత్తులు ('ప్రోటీన్'లు) - 3.3 %
- నీరు - 88 %
మనిషి పాలలో 71 కిలో కేలరీలు , ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు మరియు మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.
[మార్చు] పాల ఉత్పత్తులు
- పాలును తోడుపెట్టినచో పెరుగు తయారవుతుంది.
- పెరుగును పలుచగా నీటితో చిలకరించిన మజ్జిగ, లస్సీ తయారవుతాయి.
- మరిగించిన పాలు మీద పెరుగుమీద మీగడ తయారవుతుంది.
- మజ్జిగను బాగా నురుగ వచ్చినట్లుగా తిప్పిన వెన్న తయారవుతుంది.
- వెన్నను మరగబెట్టిన నెయ్యి వస్తుంది.
- పాలుతో కోవా మొదలైన మిఠాయిలు తయారుచేసుకోవచ్చు.
[మార్చు] పాలు ఉత్పాదకత
అత్యధిక పాల ఉత్పాదకులు — 2005 (1000 టన్నులు) |
|
---|---|
భారత్ | 91,940 |
అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 80,264.51 |
చైనా | 32,179.48 |
రష్యా | 31,144.37 |
పాకిస్తాన్ | 29,672 |
జర్మనీ | 28,487.95 |
ఫ్రాన్స్ | 26,133 |
బ్రెజిల్ | 23,455 |
యునైటెడ్ కింగ్డమ్ | 14,577 |
న్యూజిలాండ్ | 14,500 |
World Total | 372,353.31 |
Source: UN Food & Agriculture Organisation [1] |
ప్రపంచ వ్యాప్తంగా ఆవు పాలు మాత్రమే పరిశ్రమల స్థాయిలో తయారుచేస్తున్నారు. ఇదే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో 90 శాతం పాలు జెర్సీ ఆవులనుంచే తయారౌతుంది. పాల ఉత్పత్తిలో భారతదేశం, అమెరికా మొదటి, రెండు స్థానాలలో ఉన్నాయి.[1] భారతదేశంలో అముల్ సహకార సంస్థ అత్యంత విస్తృతమైనది.
[మార్చు] పురాణాలలో
- విష్ణువు పాల సముద్రములో శేషపానుపు మీద పవళిస్తాడు.
- శ్రీకృష్ణుడు వినాయక వ్రతకల్పము లో పాలభాండములో చవితి నాడు చంద్రున్ని చూడడం వల్ల నీలాపనింద కలిగింది.