విటమిన్ సి
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
విటమిన్ C రసాయనిక నామం 'ఏస్కార్బిక్ ఆమ్లం'. నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా బంగాళాదుంప, టమాటో మొదలైన వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ C మృదులాస్థి, ఎముక, డెంటీన్ ల మాత్రికను, రక్తనాళాల ఎండోథీలియమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రక్తంలో కొలెస్టిరాల్ ను కరిగిస్తుంది. గాయాలు త్వరగా మానడానికి, ఇనుము శోషణాన్ని అధికం చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
విటమిన్ C లోపం వల్ల స్కర్వీ వ్యాధి కలుగుతుంది. చర్మం పగలటం, పళ్ళ చిగుళ్ళు వాయడం, చిగుళ్ళనుంచి రక్తస్రావం, గాయాలు త్వరగా మానకపోవడం ఈ వ్యాధి లక్షణాలు.