Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
అనిల్ కుంబ్లే - వికీపీడియా

అనిల్ కుంబ్లే

వికీపీడియా నుండి

అనిల్ కుంబ్లే

India
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ లెగ్ స్పిన్
కెరీర్ గణాంకాలు
Tests ODIs
మ్యాచ్‌లు 127 271
పరుగులు 2427 938
బ్యాటింగ్ సగటు 18.24 10.53
100లు/50లు 1/5 0/0
అత్యుత్తమ స్కోరు 110* 26
Overs 6477 2416
Wickets 608 337
Bowling average 29.06 30.89
5 wickets in innings 35 2
10 wickets in match 8 n/a
Best bowling 10/74 6/12
Catches/stumpings 57/- 85/-

As of ఫిబ్రవరి 13, 2008
Source: [1]

భారతదేశపు ప్రముఖ క్రికెట్ బౌలర్ అనిల్ కుంబ్లే (కన్నడ:ಅನಿಲ್‌ ರಾಧಾಕೃಷ್ಣ ಕುಂಬ್ಳೆ). 1970 అక్టోబర్ 17కర్ణాటక లోని బెంగుళూరు లో జన్మించిన అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. ప్రస్తుతం మనదేశం తరఫున టెస్ట్ క్రికెట్ లోనూ, వన్డే క్రికెట్ లోనూ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అనిల్ కుంబ్లే. 2007 నవంబర్ 8 న అతనికి టెస్ట్ క్రికెట్ నాయకత్వ బాధ్యతలు కూడా అప్పగించబడినది. మొదటగా పాకిస్తాన్ తో స్వదేశంలో జర్గే 3 టెస్టుల సీరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. 1990 లో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించి 603 టెస్ట్ వికెట్లను, 337 వన్డే వికెట్లను పడగొట్టాడు. బంతిని బాగా స్పిన్ చేయలేడని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆస్ట్రేలియా కు చెందిన షేన్ వార్న్ తర్వాత టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో లెగ్ స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు, స్పిన్నర్లలో షేన్ వార్న్, శ్రీలంక కు చెందిన ముత్తయ్య మురళీధరన్ ల తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. 2008, జనవరి 17 నాడు టెస్ట్ క్రికెట్‌లో 600వ వికెట్టును సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అవతరించినాడు. టెస్ట్ క్రికెట్ లో అతని యొక్క అత్యంత ప్రముఖ సంఘటన ఒకే ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లను సాధించడం. ఇంగ్లాండ్ కు చెందిన జిమ్‌లేకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ కావడం గమనార్హం. అతని యొక్క సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2005 లో పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది.

విషయ సూచిక

[మార్చు] బాల్యం, వ్యక్తిగత జీవితం

కృష్ణస్వామి మరియు సరోజ దంపతులకు కర్ణాటక రాజధాని బెంగుళూరు లో 1970 అక్టోబర్ 17 న జన్మించాడు. ఇంటిపేరు కుంబ్లే కేరళ లోని కాసర్‌గొడ్ జిల్లా లోని కర్ణాటక సరిహద్దు గ్రామమైన కుంబ్లే నుంచి వచ్చింది. అతని భార్య పేరు చేతన రామతీర్థ. చిన్నతనం లోనే అనిల్ కుంబ్లేకు క్రికెట్ పై మక్కువ ఉండేది. బెంగుళూరు వీధులలో బ్యాటింగ్ ప్రాక్టీసు చేసి 13 సంవత్సరాల ప్రాయంలోనే యంగ్ క్రికెటర్స్ క్లబ్ లో ప్రవేశించాడు. 1991-92 లో రాష్టీయ విద్యాలయ కాలేజీ ఆప్ ఇంజనీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పుచ్చుకున్నాడు. ఇతనికి దినేశ్ అనే సోదరుడు ఉన్నాడు. అతని బంతి జంబోజెట్ వేగంతో వస్తుందని అతనికి జంబో అనే ముద్దు పేరు కలదు.

[మార్చు] క్రికెట్ ఆటగాడిగా

కుడిచేతివాటం గల అనిల్ కుంబ్లే లెగ్ స్పిన్ తో అందునా ఫ్లిప్పర్ తో బంతులను విసరడంలో నేర్పరి. మీడియం పేసర్ గా తను క్రీడాజీవితం ప్రారంభించడంతో బంతులు వేయడంలో వేగం ఉంటుంది. 1989 నవంబర్ లో అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కర్ణాటక జట్టు తరఫున మొదటిసారిగా ప్రాతినిద్యం వహించాడు. హైదరాబాదు తో జర్గిన ఈ మ్యాచ్ లో 4 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత అండర్-19 జట్టులో భారతదేశానికి ప్రాతినిద్యం వహించి అందులో సెంచరీ సాధించాడు. 1990 ఏప్రిల్ 5 న మొదటిసారిగా శ్రీలంక తో షార్జా లో ఒకరోజు క్రికెట్ మ్యాచ్ ఆడినాడు. అదే సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్ళిన భారత జట్టులో ఎంపికై రెండో టెస్ట్ లో ప్రాతినిద్యం వహించి టెస్టులలో ఆరంగేట్రం చేశాడు. 1992 లో దక్షిణాప్రికా వెళ్ళిన భారత జట్టు ద్వారా ప్రాతినిద్యం వహించి రెండో టెస్టులో 8 వికెట్లు సాధించి తన బౌలింగ్ ను మెరుగుపర్చుకున్నాడు. అదే సంవత్సరం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో 3 టెస్టుల సీరీస్ లో కేవలం 19.8 సరాసరితో మొత్తం 21 వికెట్లు సాధించి తన సత్తా నిరూపించుకున్నాడు.

[మార్చు] తక్కువ మ్యాచ్ లలో 50 వికెట్లు

టెస్ట్ క్రికెట్ లో తను మొదటి 50 వికెట్లను కేవలం 10 టెస్టు మ్యాచులలోనే తీసుకోవడం ాతని పోరాట పటిమను తెలియజేస్తుంది. ాతితక్కువ టెస్టులలోనే ఈ ఘనత సాధించిన భారతీయ బౌలర్ గా రికార్డును సృష్టించాడు, ఆ తర్వాత కేవలం 21 టెస్టులలోనే 100 వికెట్లు పడగొట్టి ఎర్రవల్లి ప్రసన్న తర్వాత అతితక్కువ టెస్టులలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా నిల్చినాడు. 1993 నవంబర్ 27కోల్‌కత లో వెస్ట్‌ఇండీస్ తో జర్గిన ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో కేవలం 12 పరుగులకే 6 వికెట్లు సాధించాడు. 10 సంవత్సరాల వరకు ఈ గణాంకమే భారతదేశం తరఫున బెస్ట్ బౌలింగ్ రికార్డు గా నిల్చింది.

[మార్చు] 1996 ప్రపంచ కప్ లో

1996 లో అతని వన్డే క్రికెట్ బౌలింగ్ శిఖరాలకు చేరింది. ఆ సంవత్సరం జర్గిన భారత ఉపఖండంలో జర్గిన ప్రపంచ కప్ క్రికెట్ లో 61 వికెట్లను సాధించాడు. ఈ ప్రపంచ కప్ లో అతనిచ్చిన ప్రతి వికెట్టుకు సరాసరి పరుగులు 20.24 కాగా ప్రతి ఓవర్ కు ఇచ్చిన పరుగులు కేవలం 4.06 మాత్రమే.

[మార్చు] ఒకే ఇన్నింగ్సులో మొత్తం 10 వికెట్లు

టెస్ట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు సాధించిన వారిలో ఇంగ్లాండు కు చెందిన జిమ్‌లేకర్ తర్వాత అనిల్ కుంబ్లే రెండో బౌలర్. 1999 లో ఫిబ్రవరి 4 నుండి 8 వరకు ఢిల్లీ లో పాకిస్తాన్ తో జర్గిన రెండో టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే ఈ ఘనతను సాధించాడు. కాని ఈ టెస్ట్ లో పాకిస్తాన్ కు చెందిన వకార్ యూనిస్ ను రెండు ఇన్నింగ్సులలోనూ ఒక్కసారి కూడా ఔట్ చేయలేడు. అతని వికెట్టును కూడా సాధించి ఉంటే ఒకే టెస్ట్ మ్యాచ్ లో ప్రత్యర్థికి చెందిన మొత్తం 11 బ్యాట్స్‌మెన్ లను ఔట్ చేసిన అరుదైన ఘనతను అనిల్ కుంబ్లే సొంతం చేసుకునేవాడు. ఆ ఇనింగ్సులో 9 వికెట్లను తీసిన తర్వాత అతని సహ బౌలర్ అయిన జవగళ్ శ్రీనాథ్ అనిక్ కుంబ్లే కు 10 వికెట్లు దక్కాలనే నెపంతో అతను వికెట్టు సాధించడానికి ప్రయత్నించలేడనే వాదన ఉంది. అనిల్ కుంబ్లే ఈ అరుదైన రికార్డు సాధించిన తర్వాత బెంగుళూరు లోని ఒక ప్రధాన కూడలికి అతని పేరు పెట్టబడింది.

[మార్చు] 400, 500 వికెట్ల క్లబ్ లో కుంబ్లే

అక్టోబర్ 6, 2004 రోజున కుంబ్లే సాధించిన మరో మైలురాయి టెస్టు క్రికెట్ లో 400 వికెట్లను సాధించడం. కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్ కుంబ్లే , స్పిన్నర్లలో ఇతనే ప్రథముడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే షేన్ వార్న్ (ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) ల తర్వాత ఇతను ఈ ఘనత సాధించిన మూడవ స్పిన్నర్. 400 టెస్టు వికెట్ల సాధనలో కుంబ్లే కపిల్ దేవ్ కంటే 30 టెస్టులు, షేర్ వార్న్ కంటే 7 టెస్టులు తక్కువగా ఆడి ఈ ఘనత పొందినాడు. అంతేకాకుండా 300 వన్డే వికెట్లు సాధించాడు. ఈ ఘనత కుంబ్లే కాకుండా మరో ఒక్క భారతీయ బౌలర్ (శ్రీనాథ్) మాత్రమే సాధించాడు. 2006 లో వెస్ట్‌ఇండీస్ పై చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్సులో 78 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి భారత్ కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ సీరీస్ లోని మొదటి టెస్ట్ మ్యాచ్ లో కుంబ్లే 45 పరుగులు చేసి తెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు, 2000 పరుగుల ఘనతను సాధించిన రెండో ఆల్‌రౌండర్ గా (షేన్ వార్న్ తర్వాత) రికార్డు సృష్టించాడు.

[మార్చు] కపిల్ దేవ్ రికార్డు ను అధికమించుట

డిసెంబర్ 10, 2004బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ రఫిక్ ను ఔట్ చేసి టెస్ట్ క్రికెట్ లో 434 వికెట్లు చేజిక్కించుకొని భారత్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన కపిల్ దేవ్ రికార్డును అధికమించినాడు. అదే ఆతతీరును ప్రదర్శిస్తూ జూన్ 11, 2006 న 520 టెస్ట్ వికెట్లు పూర్తిచేసి కోర్ట్నీ వాల్ష్ రికార్డును కూడా వెనక్కి నెట్టి నాల్గో స్థానంలో నిలబడ్డాడు.

[మార్చు] వన్డే క్రికెట్ నుంచి విరమణ

2007 ప్రపంచ కప్ లో భారత జట్టు పేవలమైన ఆటతీరుతో దేశవ్యాప్తంగా ఆటగాళ్ళపై ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ళపై నిరసన వ్యక్తం కావడంతో బాధ్య్తాయుతంగా ముందుకు వచ్చి వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు మార్చి 30 , 2007 న ప్రకటించినాడు.

[మార్చు] తొలి శతకం

టెస్ట్ క్రికెట్ లో ఎన్నో వికెట్లు సాధించి రికార్డులు నెలకొల్పిన కుంబ్లేకు శతకం మాత్రం ఊరిస్తూనే ఉంది. తన 118 వ తెస్టు మ్యాచ్ ఆడుతూ ఆగస్టు 10 , 2007 రోజున ఇంగ్లాండు పై 110* సాధించడంతో తన కల ఫలించింది. సుధీర్ఘ కాలం తర్వాత సాధించిన శతకం కూడా మరో రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు 96 టెస్టు మ్యాచ్ తర్వాత శతకం సాధించి శ్రీలంక కు చెందిన చమిండా వాస్ రికార్డును కుంబ్లే బ్రేక్ చేశాడు. ఇది 3 టెస్టుల సీరీస్ లో భారతీయుడి ఏకైక సెంచరీ. అంతేకాదు టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్సులో మొత్తం పదికి పది వికెట్లు మరియు టెస్ట్ సెంచరీ సాధిచిన ఏకైక క్రికెటర్ గా కొత్త రికార్డునూ నెలకొల్పాడు.

[మార్చు] ఇన్నింగ్సులో అత్యధిక సార్లు 5 వికెట్లు సాధించిన భారతీయుడు

టెస్ట్ ఇన్నింగ్సులో 30 సార్లు 5 వికెట్లు పైగా సాధించి భారత్ తరఫున ీ ఘనతను అత్యధిక పర్యాయాలు సాధించిన బౌలర్ గా రికార్డు స్థాపించాడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ ఘనతను కేవలం నలుగురు బౌలర్లు మాత్రమే (రిచర్డ్ హాడ్లీ, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ )సాధించారు.

[మార్చు] టెస్ట్ కెప్టెన్ గా నియామకం

భారత టెస్ట్ జట్టుకు సారథిగా వ్యవహరించడానికి రాహుల్ ద్రవిడ్ నిరాకరిండం, సచిన్ టెండుల్కర్ ఒప్పుకోకపోవడంతో కెప్తెన్ వేట మొదలైంది. 17 సంవత్సరాలుగా దేశానికి సేవలందిస్తూ వివాదరహితుడిగా పేరుతెచ్చుకున్న అనిల్ కుంబ్లే పేరు వాస్తవంగానే బయటికి రావడం, అతనూ సమ్మతించడంతో దేశంలో జర్గే 2007 పాకిస్తాన్ సీరీస్ కై కెప్టెన్ గా నియామకం ఖరారైంది. 118 టెస్ట్ మ్యాఛ్‌లలో భారత్ కు ప్రాతినిద్యం వహించిన కుంబ్లేకు కెప్టెన్ పదవి ఇవ్వడం సముచితమే. దీంతో బిషన్ సింగ్ బేడీ , వెంకట రాఘవన్ ల తర్వాత భారత టెస్ట్ జట్టుకు నేతృత్వం వహించిన మూడో స్పిన్నర్ గా కుంబ్లే అవతరించాడు.

[మార్చు] 600 వికెట్ల క్లబ్‌లో కుంబ్లే

2008 జనవరి 17 నాడు పెర్త్ లో ఆస్త్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో సైమండ్స్ వికెట్ సాధించి 600 వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచ బౌలర్లలో కుంబ్లే మూడో బౌలర్. ఇది వరకు ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ మరియు శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ లు మాత్రమే ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు.

[మార్చు] అత్యధిక కాట్ అండ్ బౌల్డ్ లో ప్రపంచ రికార్డు

600 వికెట్లను సాధించి మరో వికెట్ తీయగానే గానే జంబో ఖాతాలో కొత్త ప్రపంచ రికార్డు చేరింది. అతని బౌలింగ్ లోనే షాన్ టెయిట్ కొట్టిన బంతిని క్యాచ్ అందుకొని అత్యధిక కాత్ అండ్ బౌల్డ్ వికెట్లలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ విధంగా వికెట్ తీయడం కుంబ్లేకు 32 వ సారి. ఇంతకు పూర్వం ఈ రికార్డు ముత్తయ్య మురళీధరన్ (31 వికెట్లు) పేరిట ఉండేది.

[మార్చు] రికార్డులు

  • ఒకే టెస్ట్ ఇన్నింగ్సులో మొత్తం 10 వికెట్లు సాధించిన ఏకైక భారతీయుడు.
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారతీయుడు. (603 వికెట్లు)
  • అతి తక్కువ మ్యాచ్‌లలో 50 వికెట్లు సాధించిన భారతీయుడు.
  • ఇన్నింగ్సులో 5 వికెట్లను అత్యధిక పర్యాయాలు సాధించిన భారతీయుడు. (35 సార్లు)
  • అత్యధిక టెస్టుల తరువాత సెంచరీ సాధించిన క్రికెటర్ (ప్రపంచ రికార్డు).
  • 500 టెస్ట్ వికెట్లను సాధించిన తొలి మరియు ఏకైక భారతీయుడు.
  • 600 టెస్ట్ వికెట్లను సాధించిన తొలి మరియు ఏకైక భారతీయుడు.
  • అత్యధిక పర్యాయాలు కాట్ అండ్ బౌల్డ్ వికెట్లు సాధించిన బౌలర్ (ప్రపంచ రికార్డు)[1].

[మార్చు] అవార్డులు, గుర్తింపులు

  • 1995 లో భారత ప్రభుత్వం చే క్రీడా రంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డు గ్రహీత అయ్యాడు.
  • 1996 విజ్డెన్ క్రికెటర్ ఆప్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.
  • 2002 లో 21 వ శతాబ్దపు విజ్డెన్ అత్యున్నత భారత క్రికెటర్లలో 16 వ స్థానం పొందినాడు. (కపిల్ దేవ్ కు ప్రథమ స్థానం లభించింది.
  • 2005 లో భారత ప్రభుత్వం చే పద్మశ్రీ అవార్డు లభించింది.

[మార్చు] టెస్ట్ క్రికెట్ లో 4 అవార్డులు

# సీరీస్ సంవత్సరం సీరీస్ లో గణాంకాలు
1 ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ 1992/93 16 (3 మ్యాచ్ లు, 2 ఇన్నింగ్సులు); 181-53-416-21 (1x5 WI); 1 Catch
2 న్యూజీలాండ్ తో టెస్ట్ సీరీస్ 1999/00 39 పరుగులు (3 మ్యాచ్ లు, 3 ఇన్నింగ్సులు); 197.4-76-364-20 (2x5 WI, 1x10 WM); 2 Catches
3 జింబాబ్వే తో టెస్ట్ సీరీస్ 2001/02 47 పరుగులు (2 మ్యాచ్ లు, 3 ఇన్నింగ్సులు); 134.2-48-291-16 (1x5 WI)
4 శ్రీలంక తో తెస్ట్ సీరీస్ 2005/06 67 పరుగులు (3 మ్యాచ్ లు, 4 ఇనింగ్సులు); 138.3-28-374-20 (2x5 WI, 1x10 WM); 2 Catches

[మార్చు] వన్డే క్రికెట్ లో ఒక అవార్డు

# సీరీస్ సీజన్ సీరీస్ గణాంకాలు
1 సహరా కప్ (పాకిస్తాన్ v/s ఇండియా) 1996 26 (5 మ్యాచ్ లు & 3 ఇన్నింగ్సులు); 44-2-159-13

[మార్చు] మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డులు (టెస్ట్ లలో)

Match
క్ర.సం. ప్రత్యర్థి స్టేడియం సీజన్ మ్యాచ్ గణాంకాలు
1 శ్రీలంక కే.డి.సింగ్ బాబు స్టేడియం, లక్నో 1993/94 1st Innings: 4 (1x4); 37-10-69-4
2nd Innings: 27.3-9-59-7; 1 Catch
10+ Wicket Match
2 పాకిస్తాన్ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఢిల్లీ 1998/99 1st Innings: 0; 24.3-4-75-4; 1 Catch
2nd Innings: 15 (2x4); 26.3-9-74-10
10 Wickets in Innings and 10+ Wickets in Match
3 న్యూజీలాండ్ గ్రీన్ పార్క్ స్టేడియం లక్నో 1999/00 1st Innings: 5 Runs; 32.5-12-67-4
2nd Innings 26.5-5-67-6
10 Wicket Match
4 ఇంగ్లాండ్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహలీ, చండీగర్ 2001/02 1st Innings: 37 (6x4); 19-6-52-2; 1 Catch
2nd Innings: 28.4-6-81-6; 1 Catch
5 జంబాబ్వే విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, [[నాగ్‌పూర్}} 2001/02 1st Innings: 13* (1x4); 33.5-12-82-4
2nd Innings: 37-15-63-5
6 ఆస్ట్రేలియా చిదంబరం స్టేడియం, చేపాక్, చెన్నై 2004/05 1st Innings: 20 (2x4); 17.3-4-48-7; 1 Catch
2nd Innings: 47-8-133-6
10+ Wickets Match
7 శ్రీలంక ఫిరోజ్ షా కోట్లా స్టేడియం, ఢిల్లీ 2005/06 1st Innings: 8 (1x4); 28-6-72-6; 1 Catch
2nd Innings: 36-7-85-4; 1 Catch
10 Wicket Match
8 ఇంగ్లాండ్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహలీ , చండీగర్ 2005/06 1st Innings: 32 (2x4); 29.4-8-76-5
2nd Innings: 29-7-70-4
9 ఇంగ్లాండ్ ఓవల్ స్టేడియం, లండన్ 2006/07 1st Innings: 110* (2x4); 29.1-7-94-3
2nd Innings: 8* 37-9-123-2


[మార్చు] మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డులు (వన్డే లలో)

క్ర.సం. ప్రత్యర్థి స్టేడియం సీజన్ మ్యాచ్ గణాంకాలు
1 ఇంగ్లాండ్ హెడింగ్లే స్టేడియం, హెడింగ్లే, లీడ్స్ 1990 11-2-29-2
2 వెస్ట్‌ఇండీస్ ఈడెన్ గార్డెన్ స్టేడియణ్, కోల్‌కత 1993/94 5* (1x4); 6.1-2-12-6
3 న్యూజీలాండ్ బేసిన్ రిజర్వ్ స్టేడియం, వెల్లింగ్టన్ 1993/94 10-0-33-5
4 దక్షిణాప్రికా వాంఖేడే స్టేడియం, ముంబాయి 1996/97 8.2-0-25-4
5 బంగ్లాదేశ్ వాంఖేడే స్టేడియం, ముంబాయి 1998 10-4-17-3
6 కెన్యా నైరోబీ జింఖానా క్లబ్, నైరోబీ 2001/02 10-1-22-2

[మార్చు] ఇవి కూడా చూడండి


[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు

  1. http://eenadu.net
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com