వికీపీడియా నుండి
1963, సెప్టెంబర్ 21న జన్మించిన కర్ట్లీ ఆంబ్రోస్ (Curtly Elconn Lynwall Ambrose) వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడికి లిటిల్ బర్డ్ అనే ముద్దుపేరు ఉంది. కోర్ట్నీ వాల్ష్ కు జతగా ఫాస్ట్ బౌలర్‌గా వెస్టీండీస్ జట్టులో కొనసాగినాడు. ఆంబ్రోస్ తన తొలి టెస్టును 1988లో పాకిస్తాన్ పై ఆడి 12 సంవత్సరాలు జట్టుకు సేవలందించి 2000, ఏప్రిల్‌లో ఇంగ్లాండు సీరీర్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించినాడు.
ఆంబ్రోస్ టెస్ట్ క్రికెట్లో 98 మ్యాచ్‌లు ఆడి 405 వికెట్లు సాధించాడు. 400 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్లలో ఇతడు ఐదోవాడు. ఇతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 45 పరుగులకు 8 వికెట్లు. ఇది 1990లో బార్బడస్ లో ఇంగ్లాండుపై సాధించినాడు. వన్డేలలో 176 మ్యాచ్‌లు ఆడి 225 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 17 పరుగులకు 5 వికెట్లు.
టెస్ట్ క్రికెట్లో 400 వికెట్లు సాధించిన బౌలర్లు |
ముత్తయ్య మురళీధరన్ · · షేన్ వార్న్ · · అనిల్ కుంబ్లే · · గ్లెన్ మెక్‌గ్రాత్ · · కోర్ట్నీ వాల్ష్ · · కపిల్ దేవ్ · · రిచర్డ్ హాడ్లీ · · షాన్ పొల్లాక్ · · వసీం అక్రం · · కర్ట్లీ ఆంబ్రోస్ |
1999 ప్రపంచ కప్ క్రికెట్లో వెస్ట్ఇండీస్ జట్టు సభ్యులు |
బ్రియాన్ లారా (కెప్టెన్) · జిమ్మీ ఆడమ్స్ · కర్ట్లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · హెండర్సన్ బ్రియాన్ · షెర్వింగ్ కాంప్‌బెల్ · చందర్‌పాల్ · మెర్విన్ డిల్లాన్ · రిడ్లీ జాకబ్స్ · రియాన్ కింగ్ · నెహెమై పెర్రీ · రికార్డో పోవెల్ · ఫిల్ సిమ్మన్స్ · కోర్ట్నీ వాల్ష్ · స్టూవర్ట్ విలయమ్స్ |