ఆస్ట్రేలియా
వికీపీడియా నుండి
కామన్వెల్త్ అఫ్ ఆస్ట్రేలియా | ||||||
---|---|---|---|---|---|---|
|
||||||
జాతీయగీతం Advance Australia Fair |
||||||
రాజధాని | క్యాన్బెర్రా |
|||||
Largest city | సిడ్నీ | |||||
అధికార భాషలు | ఆంగ్ల భాష | |||||
ప్రజానామము | ఆస్ట్రేలియన్ (Australian) | |||||
ప్రభుత్వం | పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ రాజరికం | |||||
- | రాణి | రెండవ ఇలిజబెథ్ [1] | ||||
- | గవర్నర్-జనరల్ | మైకల్ జెఫ్రీ[2] [3] | ||||
- | ప్రధాన మంత్రి | కెవిన్ రడ్డ్[4] | ||||
స్వతంత్రం | ఇంగ్లాండు నుండి | |||||
- | జలాలు (%) | 1 | ||||
జనాభా | ||||||
- | 2008 అంచనా | 21,200,000[5] (53వది) | ||||
- | 2006 జన గణన | 19,855,288 | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | US$718.4 బిలియన్లు (IMF) (17వది) | ||||
- | తలసరి | US$34,359 (IMF) (14వది) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | US$889.7 బిలియన్లు (AU $1.1 ట్రిలియన్లు) (15వది) | ||||
- | తలసరి | US$42,553 (DFAT) (16వది) | ||||
కరెన్సీ | ఆస్ట్రేలియన్ డాలర్ (AUD ) |
|||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .au | |||||
కాలింగ్ కోడ్ | +61 |
ఆస్ట్రేలియా, అధికారిక నామం కామన్వెల్త్ అఫ్ ఆస్ట్రేలియా, భూగోళం యొక్క దక్షిణ భాగంలో, పసిఫిక్ మహసముద్రం కు భారత మహసముద్రం కు మధ్య ఉన్న ఒక దేశం. అది ప్రపంచం లోని ఆరవ అతి పెద్ద దేశం.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళిక స్వరూపం
ఆస్ట్రేలియా మరియు చుట్టుపక్కని ద్వీపాలు లక్షల సంవత్సరాల మునుపు మిగిలిన ప్రపంచం నుండి విడిపోయాయి. ఇందువల్ల, అక్కడ కనిపించే జంతువులు మరియు పక్షులు మరి యెక్కడ కనపడవు. 50,000 సంవత్సరాల మునుపు ఇక్కడికి మొదటి మానవ సంతతి ఆరంభమైంది. వీళ్ళని ఇప్పుడు ఆస్ట్రేలియన్ అబొరిజైన్స్ (Australian Aborigines) అంటారు. చుట్టుపక్కని ద్వీపాలు అన్ని ఇంగ్లాండు నుండి 1850 ప్రాంతం లో స్వాతంత్రం పొందాయి. అవన్నీ కలిసి జనవరి 1 1901 నాడు ఒక సమాఖ్యగా మారాయి. ఆస్ట్రేలియా మెదటి ప్రధాన మంత్రి ఎడ్మండ్ బార్టన్. ఆస్ట్రేలియా ఐక్యరాజ్య సమితి మరియు కామన్వెల్త్ అఫ్ నేషన్స్ (Commonwealth of Nations) లో భాగం.
[మార్చు] ప్రాంతాలు మరియు నగరాలు
జులై 2007 లో ఆస్ట్రేలియా జనాభా 2.1 కోట్లు. ఆస్ట్రేలియా వైశాల్యంలో చాలా పెద్దది అయినప్పటికీ ఎక్కువ శాతం భూమి ఎడారి లాంటిది. అందువలన చాలా మంది సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్, బ్రిస్బేన్, డార్విన్, హోబార్ట్ వంటి సమద్రతీరం వద్ద ఉన్న పట్టణాల్లో ఉంటారు. సముద్రానికి దూరంగా ఉండే అతి పెద్దటి పట్టణం క్యాన్బెర్రా. అదే ఆస్ట్రేలియా రాజధాని.
[మార్చు] చరిత్ర
[మార్చు] మొదటి మనుషులు
ఆస్ట్రేలియాకి మొట్ట మొదట మనుషులు 50,000 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చినట్టు ఆధారాలున్నాయి. వీళ్ళనే అబొరిజైన్స్ అంటారు. 1788లో ఇంగ్లీష్ వారు వచ్చే వరకు, వీళ్ళు వేటాడుతు బ్రతికే వాళ్ళు. అక్కడ పుష్కలంగా ఉన్న కంగారూలను వాళ్ళు ఎక్కువగా వేటాడే వాళ్ళు. కంగారూలు అడవుల్లో, పెద్ద పెద్ద చెట్లున్న చోట జీవంచడానికి ఇష్టపడవు. అందువల్ల ప్రతి ఐదారు సంవత్సరాలకోసారి ఉన్న గడ్డి, చిన్న చెట్లను కాల్చేసే వారు.
అబొరిజైన్స్ పెద్ద ఇళ్ళు, గోడలు, ఆవరణములు కట్టుకోలేదు. గడ్డీ, ఆకుల తో చిన్న గుడిసెలు మాత్రమే కట్టుకున్నారు. ఆస్ట్రేలియా లో ఆవులు, గుర్రాలు అప్పుడు లేవు. అందువలన వాళ్ళకు ఆవరణములు కట్టుకోవలసిన అవసరం లేదు. అబొరిజైన్స్ కుండలు, లోహాలు వాడలేదు. కేవలం చెక్క మాత్రమే వాడారు. ఆస్ట్రేలియాలో ధ్రుడమైన చెక్క ఉన్న చెట్లు చాలా ఉన్నాయి. వీటినే అబొరిజైన్స్ వాడేవారు.
[మార్చు] టెర్రా ఆస్ట్రాలిస్
1600 ప్రాంతంలో డచ్ దేశస్తులు ఇండోనీషాతో వ్యాపారం చేసేవారు. ఇండొనేషియా ఆస్ట్రేలియాకి ఉత్తరాన ఉంది. ఆ కాలంలో కొన్ని డచ్ ఓడలు ఆస్ట్రేలియా యొక్క ఉత్తర సముద్ర తీరాన్ని చేరుకున్నాయి. డచ్ గవర్నర్ వాన్ దిఎమెన్ (van Diemen), అబెల్ తాస్మాన్ (Abel Tasman) అనే నావికుణ్ణి, ఆస్ట్రేలియా దక్షిణ భాగానికి పంపాడు. అప్పుడు తాస్మాన్ ప్రస్తుత తాస్మనియాను కనుగొని, దానికి వాన్ దిఎమెన్ స్ లాండ్ (van Diemen's Land) అని పేరు పెట్టాడు. తరువాత దాని పేరు, తాస్మాన్ గౌరవార్థం, తాస్మానియా అని మార్చారు.
ఇంగ్లాండు వారు దక్షిణమున ఒక పెద్ద దీవి ఉండాలని తెలుసుకున్నారు. అందువల్ల వాళ్ళు కెప్టెన్ జేమ్స్ కుక్ (Captain James Cook)ని పసిఫిక్ మహాసముద్రం వైపు పంపారు. అతడి ఓడ HMS Endeavour. అతడి రహస్య గమ్యం "టెర్రా ఆస్ట్రాలిస్" (అంటే "దక్షిణ భూమి"). అతడి పయనం చాలా అనుకూలముగా సాగెను. ముందుగా వాళ్ళు న్యూజీలాండ్ కనుగొనిరి. దాన్ని దాటి పశ్చిమ దిక్కున వెళ్ళిరి. అప్పుడు టాం హిక్స్ అనే కుర్రవాడికి దూరంలో భూమి కనిపించెను. క్యాప్టెన్ కుక్ ఆ చిన్న పాటి భూమిని, పాయింట్ హిక్స్ (Point Hicks) అని పేరు పెట్టిరి. తీరం వరుకు వెళ్ళిన తరువాత క్యాప్టెన్ కుక్ ఆ భూమికి, "న్యూ సౌత్ వేల్స్" అని పేరు పెట్టిరి. శాస్త్రవేత్తలు సర్ బ్యాంక్స్ మరియు డా.సొలాండర్ అక్కిడికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయిరి. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందెప్పుడు చూడనటువంటి వృక్ష, జంతు మరియు పక్షి జాతులు వాళ్ళకు కనపడ్డాయి. చాలా వృక్ష జాతులను ఓడలో ఇంగ్లాండుకు తీసుకెళ్ళారు.
క్యాప్టెన్ కుక్ అక్కడ ఉన్న అబొరిజైన్స్, వాళ్ళ సహహమైన జెవనాశైలి, వాళ్ళు చేపలు పట్టడం, వేటాడటం, పళ్ళు ఏరుకోవడం చూసాడు. కాని అక్కడ ఇళ్ళు కాని ఆవరణములు కానీ లేవు. ప్రపంచంలో చాలా చోట్ల అక్కడ ఉంటున్న ప్రజలు, ఏదో ఒక రకముగా "ఈ భూమి నాది" అని చెప్పుకుంటారు. ఒక గోడ కట్టుకోవచ్చు, ఒక గీత గీసుకోవచ్చు. కాని అబొరిజైన్స్ అలాంటివేమి చేయలేదు. అందువల్ల క్యాప్టెన్ కుక్ ఇంగ్లాండు ప్రభుత్వంకు ఆ భూమి ఎవరిదీ కాదని చెప్పాడు. దీని వల్ల అబొరిజైన్స్ కి ముంముందు చాలా కష్టాలు వచ్చాయి.
[మార్చు] ఇంగ్లాండునుండి సెటిల్‌మెంట్లు
1700ల ప్రాంతంలో, ఇంగ్లాండులో న్యాయ సంభందిత సమస్యలు చాలా ఉండేవి. ఒక బ్రెడ్డు ముక్క దొంగతనం చేస్తే, మరణ దండన విధించేవారు. చాలా మందిని చరసాలలో బంధించేవారు. ఆప్పడు అమెరికా ఇంగ్లాండు ఆధీనంలో ఉండేది. ఇంగ్లాండులో స్థలం లేక, చాలా మందిని ఖైదీలను అమెరికాకు పంపేవారు. కాని 1776లో అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. అప్పుడు ఇంగ్లాండు వారికి ఏం చేయాలో తెలీలేదు.
1780 ప్రాంతంలో ఇంగ్లాండులోని చరసాలలు నిండిపోయాయి. అందువల్ల, చాలా మంది ఖైదీలను పాత, పనికిరాని ఓడలలో బంధించేవారు. అప్పుడు ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్ లో ఒక వలస స్థానం (settlement)ఏర్పాటు చేసి, కొంతమంది ఖైదీలను అక్కడికి పంపాలని నిర్ణయించింది. 1788లో 11 ఓడలు పోర్ట్స్ మౌత్ నుంది బయలుదేరాయి. ఆ ఓడలలో ఖైదీలు, నావికులు, కొంత మంది స్వతంత్రంగా వలసకు సిద్ధమైనవారు (free settlers), రెండు సంవత్సరాలకు సరిపడే ఆహారము ఉన్నాయి. ఆ ఓడలకు నాయకుడు, క్యాప్టెన్ ఆర్తర్ ఫిలిప్స్. వాళ్ళ ధ్యేయం క్యాప్టెన్ కుక్ కనుగొన్న స్థలంలో ఒక గ్రామాన్ని కట్టడం. అక్కడ ఆ శాస్త్రవేత్తలు కనుగొన్న చెట్ల వల్ల, ఆ చుట్టుపక్కల సముద్రాన్ని బాటనీ బే (Botany Bay) అని పేరు పెట్టారు.
బాటని బే దగ్గర త్రాగు నీరు ఎక్కువగా లేవు. అందువలన క్యాప్టెన్ ఫిలిప్స్ కొంచం దూరం ముందుకెళ్ళీ చూసాడు. అక్కడ అతినికి ఒక పెద్ద సహజ రేవు కనపడింది. తరువాత తన జీవితంలో అంత మంచి రేవు చూడలేదని క్యాప్టెన్ ఫిలిప్స్ అన్నాడు. ఒక చిన్న నది ఉన్న స్థలం ఎంచుకున్నారు. 1788లో ఇంగ్లాండు పతాకం ఎగురవేసి, న్యూ సౌత్ వేల్స్‌కి, ఇంగ్లాండు రాజు, మూడవ జార్జి ని రాజుగా ప్రకటించారు. ఆ చిన్న ఊరుకి సిడ్నీ అని పేరు పెటారు.
మెదట కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఇంగ్లాందు వారు ఎలాంటి ఖైదీలను పంపాలో అలోచించలేదు. అక్కడ ఉన్న వాళ్లలో ఒక్కడికే పొలం దున్నటం వచ్చు. ఇళ్ళు ఎలా కట్టాలో ఎవరికీ తేలీదు. తెచ్చుకున్న ఆవులు, మేకలు అన్ని తప్పించుకుపోయాయి. అక్కడ ఉన్న చెట్లు ఇంతకుముందు ఎవరు ఎక్కడా చూడలేదు. అవి తినచ్చో లెదో తెలీదు. అక్కడికి వచ్చిన జనం మెత్తం చనిపోయేంత పనైంది.
[మార్చు] మూలాలు
- ↑ Elizabeth at Inogolo.com
- ↑ Michael at Inogolo.com
- ↑ Jeffery at Inogolo.com
- ↑ Rudd at Inogolo.com
- ↑ Official Population Clock
మూస:ఆస్ట్రేలియా