అజిత్ అగార్కర్
వికీపీడియా నుండి
1977 డిసెంబర్ 4 న ముంబాయి లో జన్మించిన అజిత్ అగార్కర్ భారతదేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు. ఇతని పూర్తి పేరు అజిత్ భాలచంద్ర అగార్కర్ (Ajit Bhalchandra Agarkar} (Marathi:अजित भालचंद्र आगरकर).తన క్రీడాజీవితం ప్రారంభంలోనే వన్డే క్రికెట్ లో అత్యంతవేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టులలో కూడా 2002 లో లార్డ్స్ లో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్ గా బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ సాధించాడు. అగార్కర్ ఫాతిమా ఘడియాలీ ని వివాహం చేసుకున్నాడు. [1]
1998 లో కోచి లోని నెహ్రూ స్టేడియం లో తన తొలి వన్డే మ్యాచ్ ఆడినాడు. అందులో కొద్ది పరుగులకే ఆడం గిల్‌క్రిస్ట్ చేతిలో ఔటైనాడు. అగార్కర్ వన్డే లో సాధించిన మరో ప్రపంచ రికార్డు 200 వికెట్లు మరియు 1000 పరుగులు అతి తక్కువ మ్యాచ్‌లలో సాధించడం. అగార్కర్ ఈ ఘనతకు కేవలం 133 వన్డేలలో సాధించి ఇంతకు క్రితం దక్షిణాఫ్రికా కు చెందిన షాన్ పోలాక్ రికార్డును అధికమించాడు.
వన్డేలలో రికార్డులు సృష్టించిననూ టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఒకటి, రెండు సందర్భాలు మినహా అతని గణాంకాలు పేవలంగా ఉన్నాయి. 2003 లో ఆస్త్రేలియా పై అడిలైడ్ టెస్ట్ లో 41 పరుగులకు 6 వికెట్లు సాధించి రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ విజయం సాధించుటకు కృషిచేశాడు.
[మార్చు] మూలాలు
|
|
---|---|
అజహరుద్దీన్ · సచిన్ టెండుల్కర్ · సౌరవ్ గంగూలీ · రాహుల్ ద్రవిడ్ · అజయ్ జడేజా · ఖురాసియా · నయన్ మోంగియా · జవగళ్ శ్రీనాథ్ · వెంకటేష్ ప్రసాద్ · అజిత్ అగార్కర్ · రాబిన్ సింగ్ · నిఖిల్ చోప్రా · అనిల్ కుంబ్లే · దేబాషిశ్ మహంతి · సదాగొప్పన్ రమేశ్ |
|
|
---|---|
సౌరవ్ గంగూలీ · రాహుల్ ద్రవిడ్ · వీరేంద్ర సెహ్వాగ్ · సచిన్ టెండుల్కర్ · అనిల్ కుంబ్లే · హర్భజన్ సింగ్ · శ్రీశాంత్ · జహీర్ ఖాన్ · ఆశిష్ నెహ్రా · నయన్ మోంగియా · పార్థివ్ పటేల్ · సంజయ్ బంగర్ · అజిత్ అగార్కర్ · యువరాజ్ సింగ్ · మహమ్మద్ కైఫ్ |