Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
సునీల్ గవాస్కర్ - వికీపీడియా

సునీల్ గవాస్కర్

వికీపీడియా నుండి

సునీల్ గవాస్కర్
బొమ్మ:Cricket no pic.png
India
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ మీడియం
కెరీర్ గణాంకాలు
Tests ODIs
మ్యాచ్‌లు 125 108
పరుగులు 10122 3092
బ్యాటింగ్ సగటు 51.12 35.13
100లు/50లు 34/45 1/27
అత్యుత్తమ స్కోరు 236* 103*
Overs 63.3 3.3
Wickets 1 1
Bowling average 206 25
5 wickets in innings 0 0
10 wickets in match 0 n/a
Best bowling 1/34 1/10
Catches/stumpings 108/- 22/-

As of ఫిబ్రవరి 4, 2006
Source: [1]

1949 జూలై 10న జన్మించిన సునిల్ మనోహర్ గవాస్కర్ ( Sunil Manohar Gavaskar) (Hindi:सुनील् मनोहर गावसकर) భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. సన్నీ అని ముద్దుగా పిల్వబడే ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ 1970' , 1980' దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించాడు. తన హయంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు . డిసెంబర్ 2005 లో మనదేశానికే చెందిన సచిన్ టెండుల్కర్ ఈ రికార్డును అధికమించాడు. 125 టెస్టు మ్యాచ్ లు ఆడి మొత్తం 10122 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. తర్వాత ఆస్త్రేలియా కు చెందిన అలాన్ బోర్డర్ ఈ రికార్డును అధికమించిననూ టెస్ట్ క్రికెట్ లో 10 వేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్ గా ఇతని రికార్డు మాత్రం ఎవరూ చెరపలేనిది. తొలిసారిగా వెస్ట్‌ఇండీస్ పర్యటనలో ఒకే సీరీస్ లో 774 పరుగులు చేసినప్పటి నుంచి చివరగా పాకిస్తాన్ తో బెంగుళారు టెస్టులో 96 పరుగులు చేసే వరకు అతని క్రీడాజీవితంలో ఎన్నో మైళ్ళురాళ్ళు. బ్యాట్స్‌మెన్లను గడగడలాడించే అరవీర భయంకర బౌలర్లను ఎదుర్కొని సుధీర్ఘ టెస్టు క్రికెట్ జీవితంలో 51.12 సగటుతో 34 సెంచరీలు, 45 అర్థ సెంచరలు సాధించడం సామాన్యం కాదు. ఆ సమయంలో తిరుగులేని జట్టుగా నిల్చిన వెస్ట్‌ఇండీస్ పైనే సెంచరీలపై సెంచరీలు సాధించి 65.45 సగటు పరుగులు సాధించడం అతని పోరాట పటిమను తెలియజేస్తుంది. కెప్టెన్ గా అతను అంతగా విజయం సాధించకపోయిననూ క్రీడాకారుడిగా అతని విజయాలు అమోఘమైనవి. మైకేల్ హోల్డింగ్ , ఆంబ్రోస్ , ఆండీ రాబర్ట్స్ , జెఫ్ థాంప్సన్ , డెన్నిస్ లిల్లీ , ఇమ్రాన్ ఖాన్ ల బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని భారత జట్టుకు అపురూప విజయాలు సాదించిన గవాస్కర్ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ భారత జట్టుకు ఇంతవరకూ లభించలేడు. గవాస్కర్ కు, కపిల్ దేవ్ కు మద్య నాయకత్వ పోటీ ఏర్పడే సమయంలో టెస్టు జట్టు నుంచి నిష్క్రమించాడు. 1983 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుదే కాకుండా 1984 లో ఆసియా కప్ గెల్చిన భారత జట్టుకు ఇతడు నాయకుడు.

విషయ సూచిక

[మార్చు] ప్రారంభ క్రీడా జీవితం

చిన్న వయసులోనే క్రికెట్ బ్యాట్ చేతపట్టిన గవాస్కర్ 1966 లో దేశంలోనే బెస్ట్ స్కూల్ బాయ్ గా నిల్చినాడు. ఆ సంవత్సరం ఇంగ్లాండు స్కూల్ బాయ్ కు విరుద్ధంగా 246*, 222 మరియు 85 పరుగులు సాధించాడు. 1966-97 లో వజీర్ సుల్తాన్ కోల్ట్స్ XI తరఫున తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినాడు. రంజీ ట్రోఫీ లో 1968-69 లో కర్ణాటక పై ఆడి డకౌట్ అయ్యాడు. భారత మాజీ వెక్ట్ కీపర్ మరియు బొంబాయి సెలక్షన్ కమీటీ సభ్యుడైన తన మామ మాధవ మంత్రి సిఫార్సు పైనే ఎన్నికైనాడనే విమర్శను ఎదుర్కొన్నాడు. కాని రెండో మ్యాచ్ లో రాజస్థాన్ కు విరుద్ధంగా 114 పరుగులు సాధించి విమర్శకులకు బ్యాట్ తోనే సమాధానం చెప్పినాడు. ఆ తర్వాత మరో రెండు శతకాలు సాధించి 1970-71 లో వెస్ట్‌ఇండీస్ లో పర్యటించే భారత జట్టుకు ఎన్నికైనాడు.

[మార్చు] టెస్ట్ క్రీడా జీవితం

వెస్ట్‌ఇండీస్ పర్యటనకు ఎంపికైన గవాస్కర్ తొలి టెస్ట్ లో స్వల్ప గాయం కారణంగా ఆడలేకపోయాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జర్గిన రెండో టెస్టులో 65 మరియు 67* సాధించి భారత జట్టు విజయాన్కి చేయూతనిచ్చాడు. ఇది వెస్ట్‌ఇండీస్ పై భారత్ కు తొలి టెస్ట్ విజయం కావడం గమనార్హం. జార్జి టౌన్ లో జర్గిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 116 పరుగులు సాధించి తన తొలి శతకం సాధించాడు. బ్రిడ్జి టౌన్ లో జర్గిన నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్సులో 117* పరుగులు సాధించి మరో శతకం జోడించాడు. సీరీస్ లోని ఆఖరి మ్యాచ్ ట్రినిడాడ్ లో తొలి ఇన్నింగ్సులో సెంచరీ (124), రెండో ఇన్నింగ్సులో డబుల్ సెంచరీ (220) సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే వాల్టర్స్ (Doug Walters) తర్వాత రెండో బ్యాట్స్‌మెన్ మాత్రమే. ఆంతేకాదు ఒకే సీరీస్ లో 4 శతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయుడుగానూ రికార్డు సృష్టించాడు. ఒకే టెస్టులో రెండూ శతకాలు సాధించడంలో విజయ్ హజారే తర్వాత ఇతను రెండో భారతీయ బ్యాట్స్‌మెన్. వరుసగా 3 ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించడంలో విజయ్ హజారే, పాలీ ఉమ్రీగర్ ల తర్వాత మూడో భారతీయుడు. సీరీస్ లో అతను సాధించిన మరో ఘనత ఒకే సీరీస్ లో 700 పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించడం. ఈ సీరీస్ లో 154.8 పరుగుల సరాసరితో నివడం కూడా మరిచిపోలేనిది.

అదే సంవత్సరంలో 3 టెస్టుల సీరీస్ కై ఇంగ్లాండ్ పర్యటించిన భారత జట్టుకు ఎంపైకైననూ ఈ సీరీస్ లో 2 అర్థ శతకాలు మినహా చెప్పుకోదగ్గ రికార్డులు సాధించలేడు. సీరీస్ ప్రారంభానికే ముందు అతని తొలి సీరీస్ విజయాలపై అక్కడి పత్రికలు ప్రముఖంగా వ్రాయడంతో అతనిపై ఒత్తిడి పెర్గింది. ఈ సీరీస్ లో అతను 24 పరుగుల సరాసరితో మొత్తం 144 పరుగులు మాత్రమే సాధించాడు.

1972-73 లో 5 టెస్టుల సీరీస్ లో పాల్గొనడానికి వచ్చిన ఇంగ్లాండు జట్టుపై తొలి 3 టెస్టులలో పేవలమైన ఆటతీరును ప్రదర్శించాడు. 5 ఇన్నింగ్సులలో మొత్తం 60 పరుగులు మాత్రమే సాధించాడు. అయిననూ భారత జట్టు 2-1 తో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత రెండు టెస్టులలో 2 శతకాలు నమోదు చేసినాడు. ఇది ఇంగ్లాండు తో టెస్టు సీరీస్ విజయానికి దోహదపడింది. సొంతగడ్డపై అతను ఆడిన తొలి సీరీస్ లో 24.89 సగటుతో 224 పరుగులు సాధించాడు. 1974 లో ఇంగ్లాండు లో భారత జట్టు పర్యటనలో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జర్గిన తొలి టెస్టులో 101 మరియు 58 పరుగులు సాధించాడు. భారత జట్టు 3-0 తో చిత్తుగా ఓడి సీరీస్ కోల్పోయిననూ అతను ఈ సీరీస్ లో 37.83 పరుగుల సరాసరితో 227 పరుగులు సాధించాడు.

1974-75 లో భారత్ లో వెస్ట్‌ఇండీస్ పర్యటన సమయంలో గవాస్కర్ కేవలం మొదటి మరియు ఐదవ టెస్ట్ మ్యాచ్ లోనే ఆడే అవకాశం లభించింది. ఈ సీరీస్ లో 27 పరుగుల సగటుతో 108 పరుగులు సాధించాడు. ముంబాయి లో జర్గిన ఆఖరి టెస్టులో 86 పరుగులు సాధించి సొంత మైదానంలో పరవాలేదనిపించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా 106 టెస్టు మ్యాచ్ లు ఆడి రికార్డు సృష్టించడానికి ఆ టెస్ట్ ప్రారంభ వేదికగా నిల్చింది.

1975-76 లో న్యూజీలాండ్ తో 3 టెస్టుల సీరీస్, వెస్ట్‌ఇండీస్ తో 4 టెస్టుల సీరీస్ లో ప్రాతినిధ్యం వహించాడు. బిషన్ సింగ్ బేడీ గాయపడటంతో 1976 జనవరిలో న్యూజీలాండ్ పై జర్గిన ఆక్లాండ్ లో జర్గిన టెస్టులో తొలి సారిగా భారత జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. 116 మరియు 35* పరుగులతో భారత్ 8 వికెట్లతో గెల్వడానికి సహకారమందించాడు. సీరీస్ లో మొత్తం 266 పరుగులు 66.33 సగటుతో సాధించాడు. వెస్టీండీస్ పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జర్గిన రెండో, మూడో టెస్టులలో 156, 102 పరుగులతో సెంచరీలు సాధించాడు. తన తొలి సీరీస్ లోనే ఈ మైదానంలో 2 శతకాలు సాధించాడు. మూడో టెస్టులో అతను సాధించిన 102 పరుగులతో భారత్ సాధించిన 4 వికెటకు 406 పరుగులు నాల్గవ ఇన్నింగ్సులో విజయం సాధించిన అత్యధిక పరుగుల రికార్డు గా నిల్చింది. గవాస్కర్ ఈ సీరీస్ లో 390 పరుగులను 55.71 సగటుతో సాధించాడు.

[మార్చు] రచనలు

గవాస్కర్ యొక్క ప్రముఖ రచనలు

  • Sunny Days (ఆత్మకథ)
  • One Day Wonders
  • Idols
  • Runs 'n' Ruins

[మార్చు] బిరుదులు, గుర్తింపులు

  • భారత ప్రభుత్వము చే పద్మభూషణ్ అవార్డు పొందినాడు.
  • 1994 లో ముంబాయి నగర షరాఫ్ (Sheriff) గా నియమించబడ్డాడు.
  • అతని పేరు మీదుగా భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్ విజేతకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రధానం చేయబడుతుంది.
  • క్రికెట్ కామెంటరీ వ్యాఖ్యాతగా మరియు పలు పత్రికలకు కాలమ్స్ వ్రాయుటలో మంచి గుర్తింపు లభించింది.

[మార్చు] ఇవి కూడా చూడండి


[మార్చు] బయటి లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com