మదన్‌లాల్
వికీపీడియా నుండి
మదన్‌లాల్ | ||||
బొమ్మ:Cricket no pic.png |
||||
India | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
బౌలింగ్ శైలి | రైట్-ఆర్మ్ మీడియం | |||
కెరీర్ గణాంకాలు | ||||
Tests | ODIs | |||
మ్యాచ్‌లు | 39 | 67 | ||
పరుగులు | 1042 | 401 | ||
బ్యాటింగ్ సగటు | 22.65 | 19.09 | ||
100లు/50లు | 0/5 | 0/1 | ||
అత్యుత్తమ స్కోరు | 74 | 53* | ||
Overs | 999.3 | 536 | ||
Wickets | 71 | 73 | ||
Bowling average | 40.08 | 29.27 | ||
5 wickets in innings | 4 | 0 | ||
10 wickets in match | 0 | n/a | ||
Best bowling | 5/23 | 4/20 | ||
Catches/stumpings | 15/- | 18/- | ||
As of ఫిబ్రవరి 4, 2006 |
మార్చి 20, 1951లో పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించిన మదన్‌లాల్ (Madan Lal Udhouram Sharma)[1] భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1974 నుంచి 1987 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 31 టెస్టులు, 67 వన్డేలు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చక్కగా రాణించి 10,000 పరుగులు మరియు 600 వికెట్లు సాధించాడు.
విషయ సూచిక |
[మార్చు] టెస్ట్ క్రికెట్
మదన్‌లాల్ భారత్ తరఫున 31 టెస్టులలో పాల్గొని 22.65 సగటుతో 1042 పరుగులు సాధించాడు. అందులో 5 అర్థ సెంచరీలు కలవు. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 74 పరుగులు. బౌలింగ్‌లో 71 టెస్ట్ వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 పర్యాయాలు తీసుకున్నాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 23 పరుగులకు 5 వికెట్లు.
[మార్చు] వన్డే క్రికెట్
మదన్‌లాల్ 67 వన్డేలలో పాల్గొని 19.090 సగటుతో 401 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్థసెంచరీ ఉంది. వన్డేలలో ఇతడి అత్యధిక స్కోరు 53 పరుగులు నాటౌట్. బౌలింగ్‌లో 29.27 సగటుతో 73 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 20 పరుగులకు 4 వికెట్లు.
[మార్చు] ప్రపంచ కప్ క్రికెట్
1975 ప్రపంచ కప్ క్రికెట్‌లో మదన్‌లాల్ తొలి బంతిని ఇంగ్లాండుకు చెందిన డెన్నిస్ అమిస్ కు బౌలింగ్ చేశాడు. [2]. రెండో సారి భారత్ ప్రపంచ కప్ సాధించిన 1983 లో కూడా ప్రాతినిధ్యం వహించాడు.
[మార్చు] రిటైర్‌మెంట్ తరువాత
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటర్‌మెంట్ పొందిన తరువాత మదన్‌లాల్ అనేక స్థానాలలో క్రికెట్ పదవులను నిర్వహించాడు.
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.
- సెప్టెంబర్ 1996 నుంచి సెప్టెంబర్ 1997 వరకు భారతజట్టుకు జాతీయ క్రికెట్ కోచ్‌గా వ్యవహరించాడు.
- 2000 మరియు 2001లలో సెలెక్షన్ కమిటీ మెంబర్‌గా వ్యవహరించాడు.
[మార్చు] మూలాలు
- ↑ http://content.cricinfo.com/ci/content/player/30873.html | మదన్‌లాల్ ప్రొఫైల్
- ↑ Who Shrunk Test Cricket?. Rediff (2002-12-26). తీసుకొన్న తేదీ: 2007-04-02.
|
|
---|---|
వెంకట రాఘవన్ (కెప్టెన్) · ఏక్నాథ్ సోల్కర్ · అంశుమన్ గైక్వాడ్ · కర్సన్ ఘావ్రి · బ్రిజేష్ పటేల్ · గుండప్ప విశ్వనాథ్ · ఫరూక్ ఇంజనీర్ (వికెట్ కీపర్) · అబిద్ అలీ · మోహిందర్ అమర్నాథ్ · మదన్‌లాల్ · బిషన్ సింగ్ బేడీ |
|
|
---|---|
కపిల్ దేవ్ (కెప్టెన్) · సునీల్ గవాస్కర్ · కృష్ణమాచారి శ్రీకాంత్ · దిలీప్ వెంగ్‌సర్కార్ · సందీప్ పాటిల్ · మోహిందర్ అమర్నాథ్ · యశ్పాల్ శర్మ · రోజర్ బిన్నీ · మదన్‌లాల్ · సయ్యద్ కిర్మాణి (వికెట్ కీపర్) · కీర్తి ఆజాద్ · బల్విందర్ సంధూ · రవిశాస్త్రి · సునీల్ వాల్సన్ |