See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
పెనుగొండ (ప.గో) - వికీపీడియా

పెనుగొండ (ప.గో)

వికీపీడియా నుండి

  ?పెనుగొండ (ప.గో) మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెనుగొండ (ప.గో) మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెనుగొండ (ప.గో) మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము పెనుగొండ (ప.గో)
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 14
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
68,755 (2001)
• 34675
• 34080
• 75.03
• 80.92
• 69.06

పెనుగొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, గ్రామము. శ్రీ నగరేశ్వర వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానము ద్వారా పెనుగొండ పట్టణము సుప్రసిద్దము.ఈ నగరము పాలకొల్లు మరియు నిడదవోలు ప్రధాన రహదారిన కలదు. పాలకొల్లుకు 15 కి.మీ. మరియు తణుకుకు 16 కి.మీ. దూరంలో ఉన్నది.

విషయ సూచిక

[మార్చు] కన్యక వృత్తాంతము

పూర్తి వ్యాసం కొరకు చూడండి. కన్యకా పరమేశ్వరి

కన్యక లేదా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి పేరుతో కుసుమశ్రేష్టి పుత్రికగా జన్మించి విష్ణువర్ధనుడు అనే అహంకార రాజ్యాధిపతితో వివాహానికి అంగీకరించక ఆత్మత్యాగం చేసుకొనుట ద్వారా వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆరాద్య దైవంగా నిలిచిన యువతి. ఈమె దైవాంశ సంభూతురాలని ఆమె మరణానికి ముందు ఆమె దైవాంశను అందరూ దర్శించారని వాసవిదేవి గాధలలో వ్రాయబడి ఉన్నది.

[మార్చు] నగర చరిత్ర

ఈ నగరము చారిత్రక ప్రాదాన్యత కలిగిన నగరము.రాజ్యపరిపాలన జరుగుతున్నకాలమందు ఈ ప్రాంతమునకు పెనుగొండ రాజదానిగా ఉండేది.

[మార్చు] దేవాలయములు

శ్రీ నగరేశ్వర స్వామివారి దేవస్థానము

ఇది ఊరికి దక్షణాన కల అతి పురాతన దేవాలయము.మొదట ఈ దేవాలయము తక్కువ విస్తీర్ణము కలిగి చిన్న దేవాలయముగా ఉండేది. తదనంతరము దీనిలో అంతర్భాగముగా కన్యకా పరమేశ్వరీ దేవస్థానము కట్టడంతో అతి పెద్ద దేవాలయముగా వృద్ది చెందినది. ఈ దేవాలయము నిడవోలు,నర్సాపురం ప్రధాన కాలువ తీరాన కలదు.

శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము .

ఆర్యవైశ్యుల కులదైవమయిన శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము చారిత్రక నేపద్యము కలిగి ఉన్నది. నిజానికి ఈ ఆలయము శ్రీ నగరేశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణములోనే వేరొక ప్రక్క నిర్మింపబడినది. తరువాత గోపురము మరియు విశ్రాంతి మందిరములు కళ్యాణ మండపము ఇత్యాదులతో అభివృద్ది చేయుటచే పెద్ద యాత్రా స్థలముగా మారినది.

[మార్చు] విద్యాలయాలు

నగరంలో ప్రదానంగా ఒకే ప్రాంగణంలో గల రెండు కళాశాలలు కలవు.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ సైన్స్ మరియు ఆర్ట్స్ కళాశాల.

దీనిని 1974 లో నిర్మించారు.జిల్లాలోని అన్ని కళాశాలలకన్న మిన్నగా ఉత్తీర్ణతాశాతం ఎక్కువగా ఉండేందుకు అహర్నిసలూ కృషి చేసే కళాశాల యాజమాన్యం ఈ కళాశాల ప్రధాన బలం.ఈ మద్యనే పి,జి కోర్సు ప్రవేశ పెట్టబడినది.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ మరియు పితాని వెంకన్న జూనియర్ కళాశాల.

ఈ కళాశాల డిగ్రీ కళాశాల కంటే ముందుగా నిర్మింపబడినది.

[మార్చు] నగరంలో సౌకర్యాలు

  • బస్టాండ్స్. నగర ఉత్తరదిక్కున అన్ని సౌకర్యాలతో కూడిన అతి పెద్ద జవ్వాది రంగనాయకులు ప్రయాణీకుల విశ్రాంతి మందిరము {బస్టాండ్} కలదు.ఇక్కడి నుండి ఆంద్రదేశంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు బస్సులు కలవు.
  • రక్షణభట నిలయము. {పోలీస్ స్టేషన్} నగరం రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నది. కాని రెండు పోలీస్ కార్యాలయాలు ఒకే ప్రాంగణము కలిగిఉండి కార్యకలాపాలు ఎవరి పరిధిలో వారు నిర్వహిస్తుందురు.
  • ఎల్లాప్రగడ రామచంద్రరాజు మొమొరియల్ హాస్పిటల్{కాలువ అవతల పాతవంతెన ప్రక్క}
  • గవర్నమెంట్ వారి ఆసుపత్రి {సిద్దాంతం మార్గములో}
  • మార్కెట్ యార్డు {పాత మర్కెట్ వెనుక సిద్దాంతం మార్గములో}
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ {కాలువ మార్గము}
  • వైశ్యాబ్యాంక్ {హైస్కూలు వద్ద}
  • సబ్ ట్రెజరీ కార్యాలయము {కన్యకా పరమేశ్వరీ దేవస్థానము వద్ద}
  • ప్రధాన తపాలా కార్యాలయము {జవ్వాది వారి వీది}

[మార్చు] వినోద సాధనాలు

ఊరిలో రెండు సినిమా ప్రదర్శన శాలలు కలవు. మొదటిది మినర్వా దియేటర్ ఇది గాంధీ బొమ్మల కూడలిలో కలదు. రెండవది ప్యాలెస్ ఇది సిద్దాంతము వైపు తిరిగే మలుపులో కలదు. మినార్వా దియేటర్ జిల్లాలో ఉన్న పురాతన సినిమా దియేటర్లలో ఒకటి.

[మార్చు] ఊరిలో ప్రముఖులు

  • ఎమ్మేల్యేగా పనిచేసిన పితాని లక్ష్మీనారాయణ.
  • ఎమ్మెల్సీగా పని చేసిన మల్లు లక్ష్మీనారాయణ.
  • డా.రామచంద్రరాజు [ఎల్లాప్రగడ మొమొరియల్ హాస్పిటల్]

సారదీ స్టూడియోస్ అధినేత మరియు నటుడు సారధికుటుంబం యొక్క స్వస్థలం.

[మార్చు] పెనుగొండ నియోజకవర్గం

పెనుగొండ 1952 లో ఏర్పడింది. మొదటి సారి ఎన్నికలలో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుండి ద్వారంపూడి బసివిరెడ్డి ఎన్నికయ్యాడు.

పెనుగొండ నియోజక వర్గ ఎమ్మెల్యేలు
  • 1955 జవ్వాది లక్ష్మయ్యనాయుడు(కాంగ్రెస్)
  • 1962 వంకా సత్యనారాయణ
  • 1967 జవ్వాది లక్ష్మయ్యనాయుడు(ఇందిరాకాంగ్రెస్)
  • 1972 వంకా సత్యనారాయణ (సి పి ఐ)
  • 1978 జక్కంశెట్టి వెంకటేశ్వరరావు (కాంగ్రెస్)
  • 1983 పత్తి మణెమ్మ (తెలుగుదేశం)
  • 1985 పత్తి మణెమ్మ (తెలుగుదేశం)
  • 1989 జవ్వాది రంగనాయకులు (కాంగ్రెస్)
  • 1994 వంకా సత్యనారాయణ (సి పి ఐ)
  • 1999 కూనపరెడ్డి వీరరాఘవేంద్రరావు
  • 2004 పీతాని సత్యనారాయణ (కాంగ్రెస్)

[మార్చు] గ్రామాలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -