Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
నిడదవోలు - వికీపీడియా

నిడదవోలు

వికీపీడియా నుండి

  ?నిడదవోలు మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
గోలింగేశ్వర స్వామి దేవాలయం
గోలింగేశ్వర స్వామి దేవాలయం
పశ్చిమ గోదావరి జిల్లా పటములో నిడదవోలు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో నిడదవోలు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°55′N 81°40′E / 16.92, 81.67
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నిడదవోలు
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 22
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
111.908 (2001)
• 55.73
• 56.178
• 74.47
• 78.20
• 70.79

అక్షాంశరేఖాంశాలు: 16°55′N 81°40′E / 16.92, 81.67

నిడదవోలు పట్టణం,మండలం పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలదు.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

చిన్న గాంధీ సెంటరు మెయిన్ రోడ్డు
చిన్న గాంధీ సెంటరు మెయిన్ రోడ్డు

నిడదవోలును పూర్వము నిరవద్యపురము అని పిలిచేవారు. 14వ శతాబ్దములో అనవోతారెడ్డి జయించేవరకు నిడదవోలును వేంగి చాళుక్యులు పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత ఆయన సోదరుడు అనవేమారెడ్డి నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించినాడు. రాష్ట్రకూటులతొ జరిగిన యుద్ధములో రెండవ చాళుక్య భీముడు యీ నగరములోనే విజయసారధి గా పేరుపొందినాడు.

తూర్పు చాళుక్య కాకతీయ "నిరవద్య పుర" సంక్షిప్త చరిత్ర ఇదే నేటి నిడదవోలు . మన నిడదవోలు చారిత్రక ప్రసిద్ధిగల నగరం.చాళుక్య పరిపాలనతో ఇది "నిరవద్య పురము "గా ఖ్యాతి గాంచిన జలదుర్గం. దీనినే కేంద్రముగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింప చేసారు. విష్ణుకుండినుల వేంగిని చాళుక్య రెండవ పులకేసి ధ్వంసం చేసి తమ్మునికి కృష్ణ గోదావరి మధ్య ప్రాంతం అప్పగించాడు. ఆ కుబ్జవిష్ణువర్ధనుడే తూర్పు చాళుక్య మూలపురుషుడు. వారికి ప్రధాన జలదుర్గం నిరవద్యపురం. మెకంజీదొర కైఫియతును బట్టి నిడదవోలు చాలా ప్రాచీన నగరము. ఇంత ప్రాచీన నగరాలు దేశంలో అక్కక్కడ మాత్రమే ఉన్నాయి.

తూర్పు చాళుక్య వీరుడు రెండవ విజయాదిత్యుడు అనేక యుద్దాలలో శత్రువులనోడించి రాజ్య విస్తరణ చేశాడు. జననష్ట పాప పరిహారార్ధం 108 శివాలయాలను కట్టించి "నిరవద్య " అనగా పాపము లేనివాడు అనే బిరుదు పొందాడు. అతనికి గల నిరవద్య అన్న పేరుతోనే ఈ ప్రాచీన నగరం "నిరవద్య పురమని" చరిత్రలో పిలవబడింది.

నిరవద్యపురము, పెదవంగూరులలో రాష్ట్ర కూటలకు-చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీమునకు జరగిన యుద్ధంలో చాళుక్యులు విజయం సాధించడంతో ఈ ప్రాంతంలో వారి పరిపాలన సుస్థిరము కాబడింది.ఆ యుద్ధంలో చాళుక్య భీముని కుమారుడు "ఇరిమర్తిగండ" మరణించాడు.అభిమన్యునితో పోల్చదగిన వీరుడు ఇతడు."దండిన గండయ్య" అనే ప్రసిద్ధ రాష్ట్ర కూట సేనాని ఆ యుద్ధంలో ఇతడు సంహరించి హతుడైనాడు.

దక్షిణ భారతదేశ చరిత్ర గతిని మార్చినదీ యుద్ధము. ఆ తరువాత చాళుక్య రాజధాని గోదావరి ఆవలి గట్టు "రాజమందిరానికి"చేరింది. నేటికీ మన ప్రాంత గ్రామీణులు రాజమండ్రిని రాజమంద్రం అంటుంటారు. గోదావరి ఆవలిగట్టున చాళుక్య రాజులకు వేసవి విడిది కోసం "రాజమందిరాలు" ఉండేదే నేటి రాజమహేంద్రి లేక రాజమండ్రి కీ.శ.972 సం ||లో రాజధాని రాజమండ్రికి మార్చినట్లు చరిత్ర చెబుతోంది. ద్రాక్షారామం, భీమవరం ,సామర్లకోట, పాలకొల్లులలోని పంచా రామక్షేత్రాల నిర్మాత చాళుక్య భీముడే. ఈ దేవాలయాలలోని శిలా శాసనాల ద్వారా "నిరవద్యపుర" ప్రశస్తి తెలుస్తోంది.

నన్నయ్య మహా భారత రచనలో రాజరాజనరేంద్రుని నిరవద్యనరేశ్వర, నిరవద్యరవిప్రభ, నిరవద్యయువతీమదనాని సంబోధించినాడు.దీనిని బట్టి రాజరాజనరేంద్రుని కాలంలో కూడా నిరవద్యపురం చాళుక్యుల ప్రముఖ నగరమని తెలుస్తోంది.

తెలుగు వారినందరినీ ఏకం చేయటానికి ఎంతో కృషి సల్పిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి తన జ్యేష్ట కుమార్తె రాణి రుద్రమదేవిని "నిరవద్యపుర" పాలకుడైన వీరభద్ర చాళుక్యునికి ఇచ్చి వివాహాం చేశాడు.13వశతాబ్దము లో కాకతీయులు పరిపాలించే సమయంలో రాణి రుద్రమ దేవి నిడదవోలు కోడలు అయ్యింది. అంటే చరిత్ర ప్రసిద్ధినొందిన వీరనారి రాణిరుద్రమ నిడదవోలుకు కోడలిగా వచ్చిన ఘన చరిత్ర ఈ నగరమునకు గలదు.

ఓరుగల్లు విధ్వంసం చేయబడి, ప్రతాప రుద్ర చక్రవర్తి బందీగా చేయబడి,రాజమండ్రి ధ్వంసం చేయబడి కటకవరకూ జరిగిన జునాఖాన్ దండయాత్రలో(సుల్తాన్ కావటానికి ముందు యువరాజు,మహ్మద్ బీన్ తుగ్లక్ ) బహూశా ఈ నగరం కూడా 1323లో విధ్వంసానికిలోనై యుండవచ్చును. దానికి తగిన చారిత్రిక ఆధారలుగా త్రవ్వకాలలో లభిస్తూనే యున్నాయి, ధ్వంసం చేయబడిన ఆలయ శిధిలాలు. పల్లవులకు కంచి ఎటువంటిదో చాళుక్యులకు నిరవద్యపురము అటువంటి గొప్ప శైవక్షేత్రము.

ఇక్కడ నుండి అనేకమంది పండితులు అనేక ప్రాంతాలలో విద్యా సంస్థలకు అధిపతులుగా వేళ్ళేవారు. శ్రీశైల పీఠానికి అధ్యాపకులు నిడదవోలు నుండి తరలివెళ్ళారని చరిత్ర చెపుతోంది. గోపరాజు వెంకటానందం ఎంతో పరిశోధించి నిడదవోలు చరిత్రను రచించాడు.

త్రవ్వకాలలో లభించిన అనేక విగ్రహాలు, శిల్పకళాఖండాలు, శాసనాలు, నిడదవోలు ప్రాచీనతను చాటుతున్నాయి. 9-2-1959న స్కూలు భవనం నిమిత్తం త్రవ్వుతుండగా జూనియర్ కళాశాల-హైస్కూలు ఆవరణ పడమట వైపు దిరికిన "నందీశ్వరుని"విగ్రహం అపురూప సుందర అద్భుత కాకతీయ శిల్పకళాఖండం. ఈవిగ్రహాన్ని శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించారు.

ఇంకా ప్రాచీన చాళుక్య శిల్పం గల మరో పెద్ద నంది విగ్రహం గొల్లవీధిలో త్రవ్వకాలలో లభించింది. సోమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠింపబడింది. నిడదవోలు చారిత్రక ఘనతను చాటడానికి ఈ విగ్రహాలు ఒక్కటే చాలు. కుల, మత రహితంగా ప్రజలు ఎదురు నిల్చి నందీశ్వరుని విగ్రహన్ని మ్యూజియంకు తరలించకుండా ఆలయంలో ప్రతిష్ఠించారు.

చిన్నకాశి రేవు
చిన్నకాశి రేవు
గోలింగేశ్వరస్వామి ఆలయంలొ ఉన్నమృత్యుంజయుడి విగ్రహం
గోలింగేశ్వరస్వామి ఆలయంలొ ఉన్నమృత్యుంజయుడి విగ్రహం
నిడదవోలు రైలు స్టేషన్
నిడదవోలు రైలు స్టేషన్
నిడదవోలు వారఫ్
నిడదవోలు వారఫ్
దాసాంజనేయ స్వామి దేవాలయం
దాసాంజనేయ స్వామి దేవాలయం
వేణు గోపాలస్వామి దేవస్థానం
వేణు గోపాలస్వామి దేవస్థానం
చిన కాశి రేవు మీద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం
చిన కాశి రేవు మీద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం

ఈ నిరవద్యపురంలో మహాదేవేశ్వరాలయం ఉండేదని అనేక శాసనాల వలన తెలుస్తోంది. ఈఆలయానికి సంబంధించిన వివరాలు పాలకొల్లు, పెనుగొండ ఆలయాలలో ఉన్నాయి. బహూశా ఆ మహేదేవేశ్వర ఆలయ ప్రాంగణమే జూనియర్ కళాశాల ఆవరణ కావచ్చునేమో. ఆస్వామివారి లింగమే 200 సం క్రితం గోవు కారణంగా బయటపడిన శ్రీ గోలింగేశ్వర స్వామి కావచ్చునని ఆ స్వామిని 7 తరాలుగా సేవిస్తున్న అర్చిక స్వాములైన శ్రీ కాకుళపు వారి కుటుంబాల విశ్వాసం. అందుకే ఆ మహాదేవేశ్వరుని నందీశ్వర విగ్రహం ఇక్కడకు చేరిందని నమ్మకం.

నిరవద్యపుర జలదుర్గం చుట్టూ ఎర్రకాలువ, భీమదొర కాలువ,రాళ్ళమడుగు, తాడిమళ్ళ ఆవ, ఉత్తరంగా గోదావరి మధ్యన ఇది నిర్మించబడింది. నీటిలో అతి బలమైనది మొసలి.తాము జల దుర్గ రక్షణలో నున్న మొసలి వంటి బలవంతులమని చాటడానికేమె తూర్పు చాళుక్యురాజులు "మకరధ్వజులు"గా తమ జండాపై మొసలి గుర్తును కల్గియున్నారు. కనుక వీరికి ఆది నిరవద్యపురమేనని తోస్తోంది.

నగరం చుట్టూ దండ నాయకుల పేర్లతో గ్రామాలు కనిపిస్తాయి. ఉదా:ద్రోణంరాజుముప్పవరుడు, సింగవరుడు,గోపవరుడు, తిమ్మరాజు, సమిశ్రుడు. చావుకొలనే"చాగల్లు" శిక్షలు విధించు స్థలము. పూర్వపు విజయనగరము వలె, వీధుల విభజన,వివిధ వర్ణముల వారు నివసించే వరుసలు, ఈ జలదుర్గమునకు ద్వారమే దారవరం అక్కడ"రాళ్ళమడుగు" దాటితే ఓడపల్లె వాడపల్లె అక్కడ గోదావరి దాటిన రాజమండ్రి, ఇదీ పూర్వపు నిరవద్యపుర ప్రాంతం అయి ఉండవచ్చునని తెలుస్తోంది.

విధ్వంసమునకు గురి కాబడిన చాళ్యుక్య పుణ్యక్షేత్రమైన ఈ నగరంలో తలలు తెగిన నంది విగ్రహాలు, లింగాలు,మహిషాసుర మర్ధని విగ్రహాలు మరెన్నో దొరుకుతూనే ఉన్నాయి. ఇవన్నీ నిడదవోలు ప్రాచీనతకు చిహ్నాలు.1953 లో అవతార్ మెహెర్ బాబా వారి పాద స్పర్శచే ఈ గడ్డ మరలా పునీతం కాబడి అన్ని మతముల వారికి నిలయం అయింది.

నిరవద్యపురమునకు నిరవద్యప్రోలు- నిడుదవోలు- నిడదవోలు రూపాంతరం మాత్రమే. అయితే ప్రాచీన పూర్వ చరిత్ర యిచ్చే ఘనకీర్తి భావితారలకు సంస్కృతి సాంప్రదాయాలను, సాంఘిక- ఆర్ధిక పరిస్థితులను, ప్రజల జీవన విధానములను తెలియజేస్తుంది. దేశంలోని మహానగరాలే తమ అసలు పేర్లను ఏర్పరచుకొని మార్పు తెచ్చుకుంటుంటే ఈ ప్రాచీన చారిత్రక ప్రసిద్ధిగల భారతీయనగరం ఇంకా సజీవంగా జీవిస్తూ ఉందని తన ఉనికిని లోకానికి చాటడానికైనా తన అసలు పేరును పొందవలసిన ఆవశ్యకత ఉంది.స్కాందపురాణం "నిరవిద్యపురంబున మహాదేవేశ్వరుడు" అని చెపుతోంది. దీనిని బట్టి కూడా మనం నిరవిద్యపురం ప్రాచీనతను అంచనా వేయవచ్చు.

[మార్చు] పట్టణ స్వరూపం

నిడదవోలును వ్యవసాయపరంగా ఆదుకొనేది విజ్జేశ్వరం గుండాగోదావరి నది నుంచి వచ్చే ముఖ్యకాలువ. ఇది నిడదవోలు గుండా ప్రవహిస్తూ వరిచేలకు నీరు అందిస్తోంది. నిడదవోలులొ ఈ కాలువ ఒడ్డున కల ప్రాంతాన్ని చినకాశిరేవు అని పిలుస్తారు. చినకాశిరేవులో ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. గ్రామదేవత అయిన నంగాలమ్మ గుడికుడా చినకాశిరేవులో ఉంది.


1970 కు ముందు నిడదవోలుకు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖపాత్రండేది. గోదావరి పై రైలురోడ్డు వంతెన (కొవ్వూరు కి రాజమండ్రి) , సిద్దాంతంవంతెన (రావులపాలెం దగ్గర నిర్మించబడ్డాక పట్టణ అభివృద్ది కుంటు పడింది. తణుకు, తాడేపల్లిగూడెం బాగా అభివృద్ది చెంది పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాముఖ్యకత సంపాదించుకంటున్నాయి. ఒకప్పుడు ప్రముఖ వాణిజ్యాపట్టణంగా వెలసినా, ఈ మధ్య రాజమండ్రి, తణుకు, మరియు తాడేపల్లిగుడెంలు అభివృద్ది చెందినట్లుగా నిడదవోలు అభివృద్ది చెందక కొద్దిగా వెనకబడింది. నగర అభివృద్దికి రవాణాను ముఖ్య వీధికి రాకుండా చేసిన రైల్వే ఒవర్ బ్రిడ్జ్ హస్తం కూడా ఉంది.

[మార్చు] నిడదవోలు రైల్వే కూడలి

నిడదవోలు రైల్వే కూడలి అవ్వడం వలన చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇక్కడకు ఉత్తరాన విశాఖపట్నం నుండి రాజమండ్రి మీదగా వచ్చే లైను రెండుగా విడి పోయి మళ్ళీ విజయవాడలో కలుసుకుంటాయి. అందులో ఒకటి ఏలూరు మీదగా, రెండవది తణుకు భీమవరాల మీదగా వెళతాయి. ఇక్కడ కంప్యూటరీకృత టికెట్ బుకింగ్ కూడా కలదు. ప్రముఖ రైళ్ళు చాలా ఇక్కడ ఆగుతాయి.

[మార్చు] రైల్వే ఓవర్ బ్రిడ్జి

రైలు లైను, మరియు కాలువ ట్రాఫిక్ రాకపోకలకు అడ్డుపడుతున్నాయని, వాటిరెండిటి మీదగా 1992 లో వంతెన నిర్మించడం జరిగింది. దాని పిదప వాహన సంచారం గణేశ్ చౌక్ మరియి పాటి మీదగా మళ్ళించడం జరిగింది. దాని మూలంగా వ్యాపారాలన్నీ అటువైపు మారి, ఒకప్పటి ముఖ్యప్రాంతాలయిన బస్సు స్టాండు మరియు నెహ్రు బొమ్మ వెనకబడిపోయినవి.

[మార్చు] నిడదవోలు వార్ఫ్

రైలు మరియు రోడ్డు రవాణా వ్యవస్ధ రాకముందు, నిడదవోలు వారఫ్ నుండి పడవలపై ప్రయాణం చురుకుగా సాగేది. రైలు ప్రయాణం వచ్చిన తరువాత కూడా నిడదవోలు వరకూ పడవమీద వచ్చి అక్కడనుండి రైలు ఎక్కేవారు. రోడ్డు రవాణా వచ్చిన తరువాత, వారఫ్ వాడుక పూర్తిగా తగ్గిపోయింది. ఆ వారఫ్ నెహ్రూ బొమ్మకు ఎదురుగా ఉంది.

[మార్చు] నిడదవోలు సంత (మార్కెట్)

నిడదవోలులోని ముఖ్య వ్యాపార దుకాణాలన్నీ సంత మార్కెట్ దగ్గర ఉండేవి. సంత మునిసిపల్ కార్యాలయం దగ్గర ఉండేది. ఇప్పుడు దానిని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరున్న అంబేద్కర్ బొమ్మ ప్రాంతానికి తరలించారు.

[మార్చు] ముఖ్యమైన కూడళ్ళు

  1. గణపతి సెంటరు
  2. నెహ్రూ బొమ్మ ( లెవెల్ క్రాసింగు దగ్గర )
  3. పెద్ద గాంధీ బొమ్మ
  4. పొట్టి శ్రీరాములు బొమ్మ
  5. పాటిమీద ( గణేష్ ఛౌక్ ) సెంటరు
  6. వెంకటేశ్వర థియేటరు సెంటరు ( బస్టాపు సెంటరు )

[మార్చు] ముఖ్య కొట్లు

  1. రాధామాధవ్ బట్టల షోరూము (మెయిన్ రోడ్డు)
  2. నారాయణ ఎంపోరియం (రైల్వేస్టేషను దగ్గర)
  3. శ్రీ వెంకటేశ్వరా ఫ్యాన్సీ ఎంపోరియం (మెయిన్ రోడ్డు)
  4. శ్రీ విఘ్నేశ్వరా ఐసు పార్లరు (పాటి మీద)
  5. భాగ్యలక్ష్మీ సైకిలు స్టోర్సు (పోలీసు స్టేషను దగ్గర)

[మార్చు] విద్యాసంస్థలు

  1. ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు హైస్కూలు
  2. సెయింట్ ఆంబ్రోస్ హైస్కూలు
  3. డొక్కాసీతమ్మ హైస్కూలు
  4. జెడ్.పి.గర్ల్స్ హైస్కూలు
  5. లాలాలజిపతి రాయి హైస్కూలు
  6. ఎన్.టి.అర్.మున్సిపల్ హైస్కూలు
  7. సెయింట్ ఆన్నస్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం స్కూలు

[మార్చు] దేవాలయాలు

  1. గోలింగేశ్వర స్వామి ఆలయం
  2. సోమేశ్వర స్వామి ఆలయం
  3. ఆంజనేయ స్వామి దేవాలయం
  4. నంగలమ్మ గుడి
  5. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
  6. చిన్నకాశీ రేవు మీద ఉన్న గుళ్ళు
  7. కొట సత్తెమ్మ దేవాలయం

[మార్చు] సినిమా ధియేటర్లు

  1. రాధాకృష్ణ ( ఇంతకు మునుపు రామకృష్ణ అనే పేరుండేది )
  2. గణపతి
  3. శ్రీ వెంకటేశ్వర
  4. మల్లేశ్వరి
  5. వీరభద్ర

[మార్చు] ఆసుపత్రులు

  1. డాక్టరు అప్పారావు ఆసుపత్రి, రామకృష్ణా థియేటరు ఎదురుగా
  2. డాక్టరు ఎం.ఆర్.ఎన్.మూర్తి ఆసుపత్రి, కాలువగట్టు దగ్గర
  3. డాక్టరు జ్యోతి ఆసుపత్రి, కాలువగట్టు దగ్గర

[మార్చు] గ్రామాలు



Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com