గోదావరి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. |
గోదావరి నది | |
---|---|
|
|
జన్మస్థానము | త్రయంబకేశ్వర్,మహారాష్ట్ర |
సంగమ స్థానం | బంగాళాఖాతము |
పరివాహక ప్రాంతాలు | భారతదేశము |
పొడవు | 1450 కి.మీ. |
జన్మస్థల ఎత్తు | మీ |
సగటు ప్రవాహము | m³/s |
బేసిన్ వైశాల్యం | 3,13,000 చ.కి.మీ. |
గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి దక్షిణ మధ్య భారత దేశము గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశిస్తుంది. తరువాత అదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు కలవు. భద్రాచలము, రాజమండ్రి వంటివి మచ్చుకు కొన్ని. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి(గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినిలు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.
విషయ సూచిక |
[మార్చు] గోదావరి నది ఇతిహాసం
పూర్వము బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడగుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడం తో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.
[మార్చు] గౌతముడు- గోష్పాదక్షేత్రం
ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం.
[మార్చు] ఉప నదులు
గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతము 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో వ్యాపించి ఉన్నది. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు:
- వైన్‌గంగా
- పెన్ గంగ
- వార్ధా
- మంజీరా నది
- ఇంద్రావతి
- బిందుసార
- శబరి
- ప్రవర
- ఫూర్ణా
- ప్రాణహిత
- సీలేరు
- కిన్నెరసాని
- మానేరు
[మార్చు] గోదావరి డెల్టాలో చీలికలు
- వశిష్ట గోదావరి
- తుల్యభాగ
[మార్చు] గోదావరి ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు
- త్రయంబకేశ్వర్,
- నాసిక్,
- కోపర్గావ్,
- పైఠాన్
- నాందేడ్
ఆంధ్ర ప్రదేశ్‌లో:
[మార్చు] గోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రములు
- త్రయంబకేశ్వర్,
- నాసిక్,
- బాసర,
- కాళేశ్వరం,
- భద్రాచలం,
- కొవ్వూరు,
- రాజమండ్రి,
- మందపల్లి,
- కోటిపల్లి,
- ముక్తేశ్వరం,
- అంతర్వేది
|
---|
సింధు · బ్రహ్మపుత్ర · గంగ · యమున · సరస్వతి · నర్మద · తపతి · మహానది · వంశధార · గోదావరి · కృష్ణ · తుంగభద్ర · కావేరి · పెన్న (పినాకిని) |
|
|
---|---|
నదులు | గోదావరి · కావేరి · కృష్ణ · మహానది · పలర్ · పొన్నయ్యర్ · శ్వేత నది · వశిష్ఠ నది · వెల్లర్ |
పీఠభూములు | దక్కను పీఠభూమి · కోలార్ పీఠభూమి |
కొండలు | బిలిగిరి కొండలు · చిట్టిరి కొండలు · కల్రాయణ్ కొండలు · కరాంతమలై · కొల్లి కొండలు · లంకమల్ల · మెట్టూరు కొండలు · నల్లమల్ల · పచ్చైమలై · పాలమలై · పాలికొండ · షెరవొయ్ · సిరుమలై · వడ చెన్నిమలై · వెలిగొండ శ్రేణి |
జలపాతాలు | కిలియూర్ జలపాతం · పెరియార్ జలపాతం · పుదూరు మేఘన్ జలపాతం · మయిల్ ఉత్తు జలపాతం · మంగళం జలపాతం |
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ · ఒరిస్సా · తమిళనాడు · పశ్చిమ బెంగాల్ |