Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
భద్రాచలం - వికీపీడియా

భద్రాచలం

వికీపీడియా నుండి

  ?భద్రాచలం మండలం
ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్
ఖమ్మం జిల్లా పటములో భద్రాచలం మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో భద్రాచలం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°40′N 80°53′E / 17.67, 80.88
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము భద్రాచలం
జిల్లా(లు) ఖమ్మం
గ్రామాలు 62
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
77,960 (2001)
• 39330
• 38630
• 57.7
• 63.48
• 51.81

అక్షాంశరేఖాంశాలు: 17°40′N 80°53′E / 17.67, 80.88

ఆంధ్ర ప్రదేశ్, ఖమ్మం జిల్లా లో, గోదావరి నది దక్షిణ తీరమున భద్రాచలం (Bhadrachalam) పట్టణం ఉంది. భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము. జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., కొత్తగూడెం 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి.

విషయ సూచిక

[మార్చు] రామాలయ ప్రశస్తి

భద్రాచల రామాలయ దృశ్యము
భద్రాచల రామాలయ దృశ్యము

గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహసీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.

ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలు గా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనేపేరు వచ్చింది.


భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు
భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు
భద్రాచల దేవస్థానము వద్ద రామదాసు విగ్రహం
భద్రాచల దేవస్థానము వద్ద రామదాసు విగ్రహం
గోదావరిలో పడవల రాకపోకలు
గోదావరిలో పడవల రాకపోకలు

దేవాలయం భద్రగిరి అనే గుట్టపై ఉంటుంది. సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్ట్రప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.


భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినాడు.

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • భద్రాచలం

[మార్చు] మండలంలోని గ్రామాలు

కన్నాయిగూడెం, తాళ్ళగూడెం, గొట్టుగూడెం, ఫెర్గుసన్ పేట, తునికిచెరువు, లింగాలపల్లె, రామగోపాలపురం, పట్టుచీర, బూరుగువాయి, లక్ష్మీపురం, మాధవరావుపేట, గొల్లగుప్ప, బండిరేవు, రంగాపురం, కన్నాపురం, విశ్వాపురం, యెర్రబోరు, కన్నాపురం(1), నరసింగపేట, పిచ్చికలపేట, సీతంపేట, చింతలగూడెం, చంద్రంపాలెం, ఏటపాక, లక్ష్మీదేవిపేట, పురుషోత్తపట్నం, సీతాపురం, గుండాల (భద్రా), కె.నారాయణపురం, పినపల్లె, రాయనపేట, పెనుబల్లి (భద్రా), పాండురంగాపురం, ఎర్రగుంట (భద్రాచలం), చోడవరం (భద్రాచలం మండలం), చిన్న నల్లకుంట, నెల్లిపాక, బుట్టాయిగూడెం, దేవరాపల్లి, గోగుపాక, గొమ్ము కోయగూడెం, కాపవరం, కొత్తగూడెం (భద్రా), బొడ్డుగూడెం, అయ్యవారిపేట, త్రిపుర పెంటవీడు, గొల్లగూడెం, తోటపల్లి, కాపుగంపల్లి, రాచగంపల్లి, గన్నవరం (భద్రా), రాజుపేట, కిష్టారం, కుసుమానపల్లి, అచ్యుతాపురం, రాఘవపురం, చెలెంపాలెం, నల్లకుంట, ముమ్మడివరు, గౌరిదేవిపేట, నందిగామ (భద్రా), మురుమూరు

[మార్చు] రవాణా సౌకర్యాలు

మండలకేంద్రమైన భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

భద్రాచలానికి రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెం లో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతిదగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి ఒకటి, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.

గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.

[మార్చు] కొన్ని వివరాలు

భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం 2002 లో శ్రీరామ దివ్యక్షేత్రం' పట్టణం గా మార్చింది. భద్రాచలం రెవిన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు గిరిజనులు. వ్యవసాయాధారిత ఆర్ధికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్ధిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గొదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా, నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది.

  • లోక్‌సభ నియోజకవర్గం: భద్రాచలం
  • శాసనసభ నియోజకవర్గం: భద్రాచలం
  • రెవిన్యూ డివిజను: భద్రాచలం
  • చూడదగ్గ ప్రదేశాలు
    • భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం

[మార్చు] దగ్గరలో ఉన్న పర్యాటక స్థలాలు

  • కిన్నెరసాని: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, అద్దాల మందిరము, జింకల పార్కు ఉన్నవి
  • పర్ణశాల: వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడినుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.
  • పాపి కొండలు:సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము


[మార్చు] బయటి లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com