అబుల్ హసన్ కుతుబ్ షా
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
తానీషా (దయామయ పాలకుడు)గా ప్రసిద్ధి చెందిన అబుల్ హసన్ కుతుబ్ షా దక్షిణ భారతదేశములో గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ వంశానికి చెందిన ఏడవ మరియు చివరి చక్రవర్తి. ఈయన 1672 నుండి 1687 వరకు పాలించాడు.
[మార్చు] పరమత సహనం
ఇతర మతాలకు చెందిన ప్రజలను కూడా తారతమ్యాలు లేకుండా పరిపాలించిన ప్రభువుగా తానీషా చిరస్మరణీయుడు. ఈయన తన ఆస్థానములో మంత్రులు మరియు సేనానులుగా అనేకమంది బ్రాహ్మణులను నియమించుకున్నాడు. ఉదాహరణకు తానీషా హనుమకొండకు చెందిన మాదన్న అనే తెలుగు బ్రాహ్మణున్ని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. తెలుగు సాహిత్యములో తానీషా, మాదన్న మేనల్లుడు రామదాసు (కంచర్ల గోపన్న)ను కారాగారములో బంధించిన చక్రవర్తిగా ప్రసిద్ధి పొందాడు. పాల్వంచ తాలూకా నేలకొండపల్లి గ్రామ వాస్తవ్యుడైన కంచర్ల గోపన్నను తానీషా మాదన్న సిఫారుసుపై పాల్వంచ తాలూకాకు తాసీల్దారుగా నియమిస్తాడు. గోపన్న ప్రజాధనాన్ని ప్రభువుకు ముట్టజెప్పకుండా భద్రాచలములో రామాలయము నిర్మించడానికి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించడానికి వినియోగిస్తాడు. ప్రజాధనాన్ని సొంతపనులకు ఉపయోగించుకున్నాడన్న అభియోగముపై గోపన్నను తానీషా గోల్కొండలోని కారాగారములో బంధిస్తాడు. కథనం ప్రకారం ఆ తరువాత రామలక్షణులు తానీషాకు కనిపించి స్వయంగా డబ్బుతిరిగి ఇవ్వగా గోపన్నను విడుదల చేస్తాడు. రామదాసుకు తానీషా చూపిన సహృదయతకు గాను తెలుగు ప్రజలు తానీషాను నేటికీ కొనయాడుతారు.
[మార్చు] గోల్కొండ పతనం
తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ, అబ్దుల్లా కుతుబ్ షాను దక్కన్లో మొఘల్ సేనానిగా ఉన్న ఔరంగజేబు ఓడించి మొఘల్ చక్రవర్తి షాజహాను యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. 1683 ప్రాంతంలో అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తులకు కట్టవలసిన పన్నులను సకాలములో చెల్లించలేదు. దీని పర్యయవసానంగా గోల్కొండపై మొఘలుల ఆధిపత్యాన్ని పటిష్టపరచేందుకు ఔరంగజేబు దండయాత్ర చేశాడు. తానీషా గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడిని ఎనిమిది నెలలపాటు నిలువరించాడు. కానీ 1687 అక్టోబర్ చివర్లో ఔరంగజేబు లంచం ఇచ్చి కోటలు తలుపులు తెరిపించి, గోల్కొండ కోటను వశపరచుకున్నాడు. తానీషాను బందీగా తీసుకొని వెళ్ళి దౌలతాబాదు కోటలో మరణించేవరకు బంధించి ఉంచారు.
తానీషా ఓటమితో గోల్కొండ కుతుబ్ షాహీ వంశము అంతమొంది దక్కన్లో మొఘలుల ఆధ్వర్యములో నిజాం పాలన ప్రారంభమయ్యింది.
|
|
---|---|
సికింద్రాబాదు నుండి వరసగా సమర్పణ ఫలకం • రుద్రమదేవి • మహబూబ్ ఆలీఖాన్ • సర్వేపల్లి రాధాకృష్ణన్ • సి.ఆర్.రెడ్డి • గురజాడ అప్పారావు • బళ్ళారి రాఘవ • అల్లూరి సీతారామరాజు • ఆర్థర్ కాటన్ • త్రిపురనేని రామస్వామిచౌదరి • పింగళి వెంకయ్య • మగ్దూం మొహియుద్దీన్ • సురవరం ప్రతాపరెడ్డి • జాషువ • ముట్నూరి కృష్ణారావు • శ్రీశ్రీ • రఘుపతి వెంకటరత్నం నాయుడు •త్యాగయ్య • రామదాసు • శ్రీకృష్ణదేవరాయలు • క్షేత్రయ్య • పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి • బ్రహ్మనాయుడు • మొల్ల • తానీషా • సిద్ధేంద్ర యోగి • వేమన • పోతనామాత్యుడు • అన్నమాచార్య • ఎర్రాప్రగడ • తిక్కన సోమయాజి • నన్నయభట్టు • శాలివాహనుడు |