See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
బళ్ళారి రాఘవ - వికీపీడియా

బళ్ళారి రాఘవ

వికీపీడియా నుండి

తెలుగు నాటకరంగం అందించిన అతిగొప్ప నటులలో బళ్ళారి రాఘవ (Ballari Raghava) (1880-1946) ఒక్కరు.

బళ్ళారి రాఘవ

టాంక్‌బండ్‌పై బళ్లారి రాఘవ విగ్రహం
జన్మ నామం తాడిపత్రి రాఘవాచార్లు
జననం 2 ఆగస్టు, 1880
తాడిపత్రి
స్వస్థలం తాడిపత్రి, బళ్ళారి, మద్రాసు
మరణం 16 ఏప్రిల్, 1946
వృత్తి న్యాయవాది, రంగస్థల నటుడు
పదవి రావు బహుద్దూర్
భార్య/భర్త కృష్ణమ్మ
తండ్రి నరసింహాచారి
తల్లి శేషమ్మ

విషయ సూచిక

[మార్చు] జీవిత విశేషాలు

రాఘవాచార్లు ఆగష్టు 2, 1880 లో తాడిపత్రి గ్రామము, అనంతపురం లో జన్మించాడు. ఆతని తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ. వారి కుటుంబానిది శ్రీవైష్ణవ శాఖ. కర్నూలుకు చెందిన లక్షమణాచారి గారి కూతురు కృష్ణమ్మ తో వివాహము జరిగింది. బళ్ళారి హైస్కూల్ చేరి మెట్రక్ పూర్తి చేసి, మద్రాసు లొని క్రిష్టియన్ కాలేజీలో న్యాయశాస్త్రం చదవడానికి చేరాడు. న్యాయశాస్త్రం లొ 1905 లొ ఉత్తీర్ణత పొందాక, మద్రాసులొ న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు.

కొద్దికాలంలోనే రాఘవ న్యాయవాదిగా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో, ప్రసిద్ధి చెందాడు. ధనికుడయ్యాడు. ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. "రావు బహద్దూర్" అన్న బిరుదు కూడా ఇచ్చింది.

కానీ ఆయనకు నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభ ఉన్నాయి. బళ్ళారి రాఘవ నాటక ప్రదర్శనను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి అని అప్పట్లో కళాప్రియులు చెప్పుకొనేవారు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం ధారాళంగా వెచ్చించాడు. 1946, ఏప్రిల్ 16 న రాఘవ మరణించాడు.

[మార్చు] నాటక రంగం

బళ్ళారి రాఘవ

చిన్నతనంనుండి రాఘవకు నాటకరంగంపై ఆసక్తి ఉండేది. ఆయన మేనమామ ధర్మవరపు కృష్ణమాచారి రాఘవను ప్రోత్సహించాడు. 12వ యేట మొదటిసారి రంగస్థలంపై నటించాడు. బళ్ళారిలో షేక్స్‌పియర్ క్లబ్ స్థాపించి, తద్వారా షేక్స్‌పియర్ నాటకాలు ప్రదర్శించేవాడు. బెంగళూరులో కోలాచలం శ్రీనివాసరావు నడిపే 'సుమనోహర' అనే సంఘం ప్రదర్శించే నాటకాలలో ప్రధాన పాత్రలను ఎక్కువగా బళ్ళారి రాఘవ పోషించేవాడు.

హావభావ ప్రకటనలోను, డైలాగులు చెప్పడంలోను రాఘవ అసమానుడనిపించుకొన్నాడు. విదూషక పాత్ర అయినా, మహారాజు పాత్రయినా రాఘవ అవలీలగా పోషించేవాడు. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషలన్నింటిలోనూ రాఘవ ప్రదర్శనలిచ్చాడు.

హరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, బృహన్నల, రామరాజు చరిత్ర, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు - ఇవి ఆయనకు బాగా పేరు తెచ్చిన నాటకాలు. బళ్ళారి రాఘవ శ్రీలంక, ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు పర్యటించి భారతీయ నాటకాలు, కళలగురించి ఉపన్యాసాలు, సెమినార్లు ఇచ్చాడు. 1927లో ఇంగ్లాండులో లారెన్స్ ఆలివర్, ఛార్లెస్ లాటన్ ‌ప్రభృతులతో కలిసి ప్రదర్శనలిచ్చాడు. అమెరికా, రష్యా వంటి దేశాలనుండి కూడా ఆహ్వానాలు అందినాయి గాని ఆయన వెళ్ళలేకపోయాడు.

సామాన్య ప్రేక్షకులు, కళాప్రియులు, ప్రముఖులు కూడా బళ్ళారి రాఘవ నాటకాలను బహువిధాలుగా ఆదరించారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాధ టాగూరు, జార్జి బెర్నార్డ్ షా వంటివారు రాఘవ నాటకాలను ప్రశంసించారు. 1930లో మద్రాసులో రాజమన్నారు రచించిన "తప్పెవరిది?" నాటక ప్రదర్శనం తెలుగు నాటకరంగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెబుతారు.

స్త్రీలను నాటకాలలో పాల్గొనడానికి రాఘవ ప్రోత్సహించాడు. (ఈ విషయమై అప్పుడు వివిధ వేదికలలోనూ, పత్రికలలోనూ చాలా చర్చ జరిగింది). కొప్పరపు సరోజిని, కొమ్మూరి పద్మావతి, కాకినాడ అన్నపూర్ణ వంటి స్త్రీలు ఆయన నాటకాలలో నటనను ప్రారంభించి తరువాత ప్రసిద్ధ రంగస్థలనటీమణులయ్యారు. కె.ఎస్.వాసుదేవరావు, బసవరాజు అప్పారావు, బందా కనకలింగేశ్వరరావు వంటి వారు కూడా బళ్ళారి రాఘవ శిష్యులే.

పౌరాణిక నాటకాలలో తారస్థాయిని చేరుకొన్న పద్యాల వినియోగం తెలుగు నాటకాల్లో కాస్త తగ్గించాలనీ, సహజ నటనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనీ రాఘవ వాదించేవాడు. ఇంకా సాంఘిక ప్రయోజనాలకు కూడా నాటకాలలో మరింత ప్రోత్సాహం ఇవ్వాలనేవాడు.

ఆయన స్మృత్యర్ధం 'బళ్ళారి రాఘవ పురస్కారం' స్థాపించబడింది.

[మార్చు] అభినయించిన తెలుగు నాటకాలు

నాటకము రచయిత పాత్ర
సునందిని కోలాచలం శ్రీనివాసరావు దుష్టబుద్ధి
చాంద్ బీబీ కోలాచలం శ్రీనివాసరావు ఉస్మాన్ ఖాన్
విజయనగర పతనము కోలాచలం శ్రీనివాసరావు పఠాన్ రుస్తుం
భారత యుద్ధము కోలాచలం శ్రీనివాసరావు దుర్యోధన
హరిశ్చంద్ర కోలాచలం శ్రీనివాసరావు హరిశ్చంద్ర
రామదాసు ధర్మవరం గోపాలాచార్యులు రామదాసు
సుభద్ర ధర్మవరం గోపాలాచార్యులు అర్జున
సారంగధర ధర్మవరం రామకృష్ణమాచార్యులు సారంగధర
పాదుకాపట్టాభిషేకము ధర్మవరం రామకృష్ణమాచార్యులు దశరథ
ప్రమీళార్జునీయం ధర్మవరం రామకృష్ణమాచార్యులు అర్జున
సావిత్రి ధర్మవరం రామకృష్ణమాచార్యులు యముడు
ప్రహ్లాద ధర్మవరం రామకృష్ణమాచార్యులు హిరణ్యకశిపుడు
విరాటపర్వము ధర్మవరం రామకృష్ణమాచార్యులు కీచకుడు
చిత్రనళీయము ధర్మవరం రామకృష్ణమాచార్యులు నలుడు
పాంచాలీ స్వయంవరము ధర్మవరం రామకృష్ణమాచార్యులు అర్జున
ప్రతాపరుద్రీయము ధర్మవరం రామకృష్ణమాచార్యులు ప్రతాపరుద్రుడు
తప్పెవరిది? పి.వి.రాజమన్నార్ భీమసేనరావు
సరిపడని సంగతులు బళ్ళారి రాఘవ శ్రీధరుడు
రాణా ప్రతాపసింహ ధ్విజేంద్రలాల్ రాయ్ రక్తసింహుడు
దుర్గాదాసు ధ్విజేంద్రలాల్ రాయ్ దుర్గాదాసు

[మార్చు] సినిమారంగం

కొద్ది సినిమాలలో బళ్ళారి రాఘవ నటించాడు. ద్రౌపదీ మానసంరక్షణం, రైతుబిడ్డ, చండిక, కన్యాశుల్కం వంటివి ఆయన నటించిన కొద్ది సినిమాలు. ద్రౌపదీ మాసంరక్షణంలో ఆయన దుర్యోధన పాత్రను ఎందరో ప్రశంసించారు గాని ఆ సినిమా విజయవంతం కాలేదు.

[మార్చు] ఇతర విశేషాలు

ఆధ్యాత్మిక గురువు పండిట్ తారానాధ్ ఉపదేశాల ప్రభావం రాఘవపై బాగా ఉంది. తుంగభద్రా నది ఒడ్డున ఉన్న ఆశ్రమానికి రాఘవ దండిగా విరాళాలిచ్చేవాడు. కష్టాలలో ఉండి సహాయం కోరినవారికి కూడా రాఘవ విరివిగా సహాయం చేశేవాడు. కాని ఆడంబరాలకోసం అతిగా ఖర్చు చేయుడానికి ఆయన వ్యతిరేకి. సంపన్నుడై ఉండి కూడా చాలా సాదాసీదా జీవనం గడిపేవాడు.

[మార్చు] వనరులు, బయటి లింకులు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -