See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
గణపవరం(ప.గో) - వికీపీడియా

గణపవరం(ప.గో)

వికీపీడియా నుండి

  ?గణపవరం(ప.గో) మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా పటములో గణపవరం(ప.గో) మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో గణపవరం(ప.గో) మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 99.95 కి.మీ² (39 sq mi)
ముఖ్య పట్టణము గణపవరం(ప.గో)
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 25
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
66,656 (2001)
• 247.104/కి.మీ² (640/చ.మై)
• 33478
• 33178
• 78.18
• 82.49
• 73.83

రైసుమిల్లుల మండలం

గణపవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల ఊరు. ఈ మండలం భీమవరం నుండి పదిహేను కిలోమీటర్లు మరియు తాడేపల్లి గూడెం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కలదు. భారతావనికి ఆంధ్రరాష్ట్రం ధాన్యాగారం అయితే ఈ ప్రాంతం ఆంధ్రరాష్ట్రానికి ధాన్యాగారం అనేవారు. ఒకప్పటి రైసు మిల్లుల పట్టణం ఇప్పుడు మంచినీటి చేపల రొయ్యల పెంపకానికి కేంద్రంగా మారిపోయింది.

విషయ సూచిక

[మార్చు] దేవాలయాలు

గ్రామ దేవత మారెమ్మ దేవాలయం. సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవాలయము. పెద్ద వీదిలో ఆంజనేయస్వామివారి దేవాలయములు కలవు. గ్రామదేవత మారెమ్మ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద వీదిలో కల ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల స్వామివారి విగ్రహం అతి భారీ ఎత్తులో పెద్దగా ఉంటుంది.

[మార్చు] పట్టణ జనాభా

  1. కుటుంబాలు: 3,098
  2. మొత్తం జనాభా : 12,384
    1. పురుషులు: 6,099
    2. స్రీలు: 6,285
  3. పిల్లలు: 1,417(మొత్తం 6 సo. లోపు)
    1. బాలురు: 688
    2. బాలికలు: 729

[మార్చు] కళాశాలలు

  • S.Ch.V.P.M.R. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్థాపితం 1972)
  • S.C.B.R. ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపితం 1969)

[మార్చు] విశేషాలు

  • పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్ట మొదటి ఐ మాక్స్ సినిమా సముదాయం గణపవరంలోనే నిర్మించబడినది.
  • ఆంద్రప్రదేశ్లో అత్యధికంగా రైసుమిల్లులు కలిగిన మండలంగా పేరెన్నిక గలిగి ఉందేది.
  • 874లో కట్టిన పశ్చిమడెల్టా నీటిపారుదల వ్యవస్థలో ప్రాముఖ్యంగల చిలకంపాడు లాకులు కలవు. గత 130 సంవత్సరాలుగా ఈ లాకులు రైతులకు సేవలందిస్తున్నాయి. 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. గణపవరం, పెంటపాడు, నిడమర్రు, ఉండి, ఆకివీడు, కాళ్ళ మండలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఈ లాకుల ద్వారానే అందుతుంది. ప్రస్తుతం ఈ లాకులు కొన్ని చోట్ల శిధిలావస్థకు చేరుకొన్నాయి.

[మార్చు] గణపవరంలో రైసు మిల్లుల స్థితి గతులు

గణపవరంలో దాదాపు 40 ట్రేడింగ్, నాన్ ట్రేడింగ్ రైస్‌మిల్లులుఉండేవి. జిల్లాలోనే రైస్‌మిల్లింగ్ పరిశ్రమకు ఇది ప్రముఖ కేంద్రంగా వెలిగింది. 2000 నాటికే మొత్తం మిల్లులన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం ఒకే ఒక ట్రేడింగ్ రైస్‌మిల్లు, రెండో మూడో నాన్‌ట్రేడింగ్ ఉండటం గమనార్హం. మిల్లు గోదాములకు అద్దెలకు ఇవ్వగా కొన్ని మిల్లులు విద్యా సంస్థలుగానూ, మరికొన్ని ఐస్ ఫ్యాక్టరీలుగానూ మారాయి. కొన్ని మిల్లులను తొలగించి ఇళ్ల స్థలాలుగా అమ్మివేసారు. క్షణం తీరిక లేకుండా ఉండే రైస్ మిల్లింగ్ పరిశ్రమ దాదాపు కనుమరుగయిపోయింది.

గణపవరానికే పేరు తెచ్చిన రైసు మిల్లుల మూతకు కారణాలు

రైస్ మిల్లులకు లక్ష్యాలు విధించి ముక్కుపిండి లెవీ వసూలు చేయడం తప్ప వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వల్ప వడ్డీపై రుణాలు, ఇతర ప్రోత్సాహకాలు, పన్నుల రాయితీ వంటి సహకారం కోసం ఎదురుచూసినా మిల్లర్లకుఫలితం కనిపించలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కొత్త మిల్లులతో ఇవి పోటీపడలేకపోవడం మరొక కారణమయినది.కొత్త మిషనరీ ఏర్పాటుకు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడి అవసరం కావడం. పాత మిషనరీతో మిల్లింగ్ చేసిన బియ్యానికి విదేశీ మార్కెట్లో డిమాండు లేకపోవడం.కొత్త మిషనరీ ఏర్పాటుకు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడి అవసరం కావడం. పాత మిషనరీతో మిల్లింగ్ చేసిన బియ్యానికి విదేశీ మార్కెట్లో డిమాండు లేకపోవడం. జిల్లాలో ఇతర ప్రాంతాలు, పొరుగునున్న తూర్పుగోదావరి జిల్లాతో పోలిస్తే గణపవరంలో మిల్లింగ్ ఖర్చులు ఎక్కువ కావడం. తాడేపల్లిగూడెంలో బస్తా మిల్లింగ్‌కు 6 రూపాయలు ఖర్చు అవుతుండగా గణపవరంలో 11 రూపాయలు ఖర్చు అవడం. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో ధాన్యం ఉత్పత్తి పెరిగి ఇక్కడి నుండి బియ్యం ఎగుమతి మందగించడం. కుండీలలో నానబెట్టిన బాయిల్డ్ రైస్‌లో క్వాలిటీ లేకపోవడం. మిల్లు తిరిగినా... తిరగకపోయినా మినిమమ్ ఛార్జీ కింద నెలకు 50 వేల రూపాయలు బిల్లు విద్యుత్‌శాఖ వసూలు చేయడం.ఇత్యాది కారణాలతో గణప వరంలో మిల్లుల పరిశ్రమ నాశనమయినది.

[మార్చు] మండలంలో సమస్యలు

శిధిలమవుతున్న లాకులను పునరుద్దరించడం. మిల్లుల మూతతో వలసలు పోతున్న కార్మికులకు జీవనాధారం చూపడం. ఎప్పుడూ గోతులతో ఉండే రహదారులను పటిష్టంగా మార్చడం.

[మార్చు] గ్రామాలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -