క్ష
వికీపీడియా నుండి
|
ఈ వర్ణాన్ని తెలుగు, సంస్కృతాలలో ఇప్పుడు ప్రత్యేక ధ్వనిగా కాక క, ష ధ్వనుల సంయుక్తాక్షరంగా పలుకుతారు. పూర్వ ఇండో-ఆర్య భాషలో ఈ వర్ణం కంఠ్య శ్వాస ఊష్మ (Voiceless velar fricative) గా పలికే వారని భాషావేత్తల అభిప్రాయం. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [x].
[మార్చు] ఉచ్చారణా లక్షణాలు
స్థానం: మృదు తాలువు (soft palate)
కరణం: జిహ్వమూలము (tongue root)
సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), శ్వాసం (voiceless)
విశేష ప్రయత్నం: ఊష్మం (fricative)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
[మార్చు] చరిత్ర
ఈ వర్ణాన్ని తెలుగు, సంస్కృతాలలో ఇప్పుడు ప్రత్యేక ధ్వనిగా కాక క, ష ధ్వనుల సంయుక్తాక్షరంగా పలుకుతారు. నన్నయ్య ఈ అక్షరానికి క, గ అక్షరాలతో యతి పాటించగా, తిక్కన ష అక్షరంతో యతిమైత్రి కుదర్చడం ఆసక్తిదాయకమైన అంశం.