హ
వికీపీడియా నుండి
|
హల్లులలో కంఠమూలీయ శ్వాస ఊష్మ (voiceless glottal fricative) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [h]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [h].
[మార్చు] ఉచ్చారణా లక్షణాలు
స్థానం: కంఠమూలీయ (glottal)
కరణం: నాద తంత్రులు (vocal cords)
సామాన్య ప్రయత్నం: శ్వాసం (voiceless)
విశేష ప్రయత్నం: ఊష్మ (fricative)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
[మార్చు] చరిత్ర
హకారము ప్రాచీన ద్రవిడ బాషలో లేని అక్షరమని సామాన్య అభిప్రాయము. కానీ భద్రిరాజు కృష్ణమూర్తి గారు మూల ద్రావిడ భాషలో కంఠమూలీయ ధ్వని ఉండేదని, నేటికీ తమిళములో కనిపించే ఆయిదం అక్షరం దీనికి సాక్షమని అభిప్రాయపడ్డారు[1]. ప్రస్తుతం తమిళములో క, గ, హ ధ్వనులను ఒకటే అక్షరముతో రాస్తారు. తెలుగు మొదలైన ఇతర ద్రావిడ భాషల మాత్రం సంస్కృతం నుండి దీన్ని అక్షరంగా స్వీకరించినవి.[2]
ఏ అక్షరమునైనా పలికేటప్పుడు నాలిక ఆడించే బదులు ఊపిరి గొంతులోనుండి విడిస్తే హకారము పలుకుతుంది. పెసరపప్పును పెహరపప్పు అని అనటము మనము అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. కన్నడములో పకారాది శబ్దములన్నీ చాలావరకు హకారాలు కావడము గమనించదగ్గ విషయము (పాలు = హాలు, పావు = హావు, పులి = హులి).[2]
[మార్చు] మూలాలు
- ↑ "Evidence for Laryngeal *h in proto-Dravidian" Comparative Dravidian Linguistics: Current Perspectives By Bhadriraju Krishnamurti pp. 323-345 ISBN 0198241224
- ↑ 2.0 2.1 ఆంధ్ర భాషా వికాసము - గంటి జోగి సోమయాజి
- Dravidian Languages - Bhadriraju Krishnamurti pp. 154-157 ISBN 0521771110