ణ
వికీపీడియా నుండి
|
అనునాసికాలలో మూర్ధన్య నాద అల్పప్రాణ (retroflex nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɳ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ṇ].
[మార్చు] ఉచ్చారణా లక్షణాలు
స్థానం: మూర్ధం (hard palate)
కరణం: మడత వేసిన నాలిక కొన (tip of the tongue curled up)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: నాసికావివరం (nasal cavity)