కోరుకొండ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
?కోరుకొండ మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | కోరుకొండ |
జిల్లా(లు) | తూర్పు గోదావరి |
గ్రామాలు | 18 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
76,645 (2001) • 38593 • 38052 • 57.61 • 60.34 • 54.86 |
కోరుకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. కోరుకొండ జిల్లా రాజధాని ఐన కాకినాడ కు 60కి.మి. , రాజమండ్రి కి 20 కి.మి., అమలాపురానికి 110 కి.మి దూరం లో ఉంది. ఇక్కడ ప్రసిద్ధ మైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కలదు.
విషయ సూచిక |
[మార్చు] శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విశేషాలు
120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకొవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు చేర్చడంవల్ల ఈ గ్రామానికి కోరుకొండ అని పేరు వచ్చింది అంటారు. మరొక కధనం కొండపై కోరుకొన్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం యొక్క శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధానదైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒక గుడిలో దైవాన్ని స్వయంభువు గా చెబుతారు. ఇంకో గుడిలో దైవాన్ని ప్రతిష్ఠ మూర్తిగా చెబుతారు. స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం తొమ్మిది అంగుళాలు ఎత్తు లో ఉంటుంది. ఈ ఆలయం లో పూజలు వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఇక్కడ దశావతారాల అందమైన శిల్పాలతో పాటు శ్రీరామక్రతు స్తంభము కలదు. ఈ దేవాలయాన్ని వైష్ఠవ దివ్య క్షేత్రాలలో ఒకటి గా చెబుతారు.
[మార్చు] పురాతన మరియు చారిత్రక ఆలయ విశేషాలు
ఈ గుడి మరియు కొండ మీద చాలా శిలాశాసనాలు ఈ ఆలయాన్ని గురించి చెబుతున్నాయి. ఆ శాసనాల ప్రకారం 700-800 క్రీ.శ. లో ప్రసార భట్టారక వంశానికి చెందిన సభ్యులు ఆలయాన్ని నిర్మించారని, ఆలయనిర్వహణబాధ్యతలు తీసుకొన్నారని చెబుతారు. ఇప్పటికి కూడా ఆ వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. శ్రీనాథ కవిసార్వభౌముడు తన కవితాసంపుటంలో కోరుకొండ ను వేదాద్రి గా వర్ణించాడు. దీనికి సంబందించిన క్రీ.శ. 1443 చెందిన శిలాశాసనాలు నరసాపురం తాలుకా లక్ష్మణేశ్వరం గ్రామంలో ఉన్నాయి.
[మార్చు] పండుగలు
- ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశి - స్వామి కళ్యాణం
- ఉగాది
- వైష్ఠవ కృష్ణాష్టమి
- ముక్కోటి ఏకాదశి
- ధనుర్మాసం
- గోదావరి పుష్కరాలు
- శ్రీ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం పండుగ
[మార్చు] మండలంలోని గ్రామాలు
- కోటి
- బోడలెద్దుపాలెం
- కోటికేశవరం
- రాఘవపురం
- శ్రీరంగపట్నం
- కోరుకొండ
- జంబూపట్నం
- నరసాపురం
- కనుపూరు
- గదరాడ
- దోసకాయలపల్లి
- బూరుగుపూడి
- కాపవరం
- మునగాల
- బుచ్చెంపేట
- మధురపూడి
- గదల
- నిడిగట్ల
[మార్చు] బయటి లింకులు
- తూర్పు గోదావరి జిల్లా వెబ్ సైటు లో కోరుకొండ గురించి [1]
|
|
---|---|
మారేడుమిల్లి • వై.రామవరం • అడ్డతీగల • రాజవొమ్మంగి • కోటనందూరు • తుని • తొండంగి • గొల్లప్రోలు • శంఖవరం • ప్రత్తిపాడు • ఏలేశ్వరం • గంగవరం • రంపచోడవరం • దేవీపట్నం • సీతానగరం • కోరుకొండ • గోకవరం • జగ్గంపేట • కిర్లంపూడి • పెద్దాపురం • పిఠాపురం • కొత్తపల్లె • కాకినాడ(గ్రామీణ) • కాకినాడ (పట్టణ) • సామర్లకోట • రంగంపేట • గండేపల్లి • రాజానగరం • రాజమండ్రి (గ్రామీణ) • రాజమండ్రి (పట్టణ) • కడియం • మండపేట • అనపర్తి • బిక్కవోలు • పెదపూడి • కరప • తాళ్ళరేవు • కాజులూరు • రామచంద్రాపురం • రాయవరం • కపిలేశ్వరపురం • ఆలమూరు • ఆత్రేయపురం • రావులపాలెం • పామర్రు • కొత్తపేట • పి.గన్నవరం • అంబాజీపేట • ఐనవిల్లి • ముమ్మిడివరం • ఐ.పోలవరం • కాట్రేనికోన • ఉప్పలగుప్తం • అమలాపురం • అల్లవరం • మామిడికుదురు • రాజోలు • మలికిపురం • సఖినేటిపల్లి |
|
|
---|---|
కోటి · బోడలెద్దుపాలెం · కోటికేశవరం · రాఘవపురం · శ్రీరంగపట్నం · కోరుకొండ · జంబూపట్నం · నరసాపురం · కనుపూరు · గదరాడ · దోసకాయలపల్లి · బూరుగుపూడి · కాపవరం · మునగాల · బుచ్చెంపేట · మధురపూడి · గదల · నిడిగట్ల |
|
|
---|---|
గుంకలాం · ద్వారపూడి · కొండకరకం · వేణుగోపాలపురం · కుకలమెట్ట లక్ష్మీపురం (గ్రామీణ) · సిరియాలపేట · రాకోడు · పినవెమలి · కోరుకొండ · సరిక · జగన్నాధపురం @ జొన్నవలస · దుప్పాడ · హాజీసాహెబ్ పేట · చెలువూరు · మలిచెర్ల · ధర్మపురి · జమ్ము నారాయణపురం (గ్రామీణ) |
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు గొనగూదెమ్ ]