గొల్లప్రోలు
వికీపీడియా నుండి
?గొల్లప్రోలు మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | గొల్లప్రోలు |
జిల్లా(లు) | తూర్పు గోదావరి |
గ్రామాలు | 10 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
76,352 (2001) • 38623 • 37729 • 54.34 • 59.21 • 49.32 |
అక్షాంశరేఖాంశాలు:
గొల్లప్రోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదేపేరు గల మండలమునకు కేంద్రము. గొల్లప్రోలు మిరపకాయలకి ప్రసిద్ధి. ఇది పిఠాపురానికి ఈశాన్య దిశలో ఉంది. విశాఖపట్నానికి 130 కి.మీ. దూరంలో, మద్రాసు - కొలకత్తా రైలు మార్గంలో ఉంది. 25 కి.మీ. దూరంలో ఉన్న కాకినాడ ఈ గ్రామానికి దగ్గరి పట్టణం. [1]
విషయ సూచిక |
[మార్చు] మండలం గురించి
1987లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మండల వ్యవస్థను ఏర్పరచినపుడు గొల్లప్రోలు మండలంగా ఏర్పరచబడింది. డా.కొప్పుల హేమనాధరావు మొదటి మండల ప్రెసిడెంట్ 1987 - 1992 కాలంలో పదవిలో ఉన్నాడు. 2005 వరకు ఇక్కడ మండలం కేంద్ర కార్యాలయం నిర్మించబడలేదు. మొగలి సుబ్రహ్మణ్యం (చిట్టిబాబు) ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు మండల కార్యాలయం ప్రారంభమైంది.
2005లో మొత్తం మండల జనాభా 81,752 [2] మరియు 2007లో 102,170 in 2007. గొల్లప్రోలు గ్రామంలో షుమారు 31,000 వోటర్లున్నారు.
ఈ ప్రాంతం తుఫాను తాకిళ్ళకు తరచు గురవుతుంటుంది. ఎక్కువ మంది జనాభా వ్యవసాయ కార్మికులు.[3] ఈ గ్రామప్రాంతంలో పండే మిరపకాయలకు మంచి గిరాకీ ఉంది.[1]. ఇంకా ఉల్లి, వేరుశనగ, ప్రత్తి, వరి పంటలు కూడా ఇక్కడ బాగా పండిస్తారు.
[మార్చు] విద్యా సౌకర్యాలు
గ్రామం పాఠశాల 1954లో మొదలయ్యింది. శ్రీమతి గవరసాన సుభద్ర (డా. గవరసాన సత్యనారాయణ భార్య) ఇందుకు భూమి విరాళంగా ఇచ్చింది. ఆమె తండ్రి జ్ఞాపకంగా ఈ పాఠశాలకు "డా.మలిరెడ్డి వెంకటరాజు మెమోరియల్ ప్రాధమిక పాఠశాల" అని పేరు పెట్టారు. [1] ఇందులో షుమారు 400 మంది విద్యార్ధులు తెలుగు మీడియంలో చదువుకొంటున్నారు. [3]. శ్రీమతి మలిరెడ్డి ఉమాంబ ప్రాధమిక పాఠశాల అనేది 2007 లో మొదలు పెట్టేరు. ఇది కూడ గవరసాన దంపతుల పూనికతో జరిగినదే. ఇటీవల కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లీషు మీడియంలో విద్యాసదుపాయం కలిగించారు.
గొల్లప్రోలులో రెండు హైస్కూళ్ళు ఉన్నాయి: Z.P.B.హైస్కూలు 1950 దశకంలో సేఠ్ పెరాజీ లుంబాజీచే నిర్మించబడింది. మరొకటి బాలికల హైస్కూలు. ఇంకా మాధురి విద్యాలయం అనే ప్రైవేటు స్కూలు ఇంగ్లీషు మీడియం చదువును అందిస్తుంది. ఇది సమీప గ్రామాలలో మంచి పేరు కలిగి ఉంది.
[మార్చు] వ్యవసాయం, పంటలు, నీటి వనరులు
ముఖ్యమైన పంటలు: మిర్చి, ప్రత్తి, వరి,ఉల్లి
[మార్చు] పరిశ్రమలు
ధాన్యం మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, వేరుశనగ నూనె మిల్లులు ఉన్నాయి.
[మార్చు] దేవాలయాలు, మసీదులు, చర్చిలు
శివాలయం, విష్ణ్వాలయం, సాయిబాబా గుడి ఉన్నాయి.
[మార్చు] వీధులు
- పెద్ద వీధిలో అధికంగా సంపన్నుల ఇళ్ళున్నాయి.
- కరణంగారి తోటలో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ఉంది. ఈ వీధి అన్నింటికంటే పెద్దది.[4]
- పల్లపు వీధి
- కొత్తపేట వీధి
- నందిరాయి వీధి
- మంత్రాలవారి వీధి
- గుడివీధి
- పర్లా వారి వీధి.
[మార్చు] వైద్య శాలలు
- భాస్కరరావు హాస్పిటల్ చుట్టుప్రక్కల బాగా పేరు కలిగింది.
- కోకిలవాణి హాస్పిటల్
- ఉమాదేవి హాస్పిటల్
- ప్రభుత్వ హాస్పిటల్
- రెడ్ల పద్మరాజు హాస్పిటల్
- మోహనరావు హాస్పిటల్
[మార్చు] రవాణా
గొల్లప్రోలు రైల్వేస్టేషన్ (స్టేషన్ కోడ్ GLP) చెన్నై - హౌరా రైలు మార్గంలో, సామర్లకోట, తుని స్టేషన్ల మధ్య ఉంది. [5] ఇక్కడ సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-రాజమండ్రి పాసెంజర్, విజయవాడ-విశాఖపట్నం పాసెంజర్, రాయగడ పాసెంజర్, తిరుమల ఎక్స్‌ప్గరెస్, బొకారో-అలెప్పీ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-వైజాగ్ పాసెంజర్, మచిలీపట్నం-వైజాగ్ పాసెంజర్, గోదాఞరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆగుతాయి. ఈ స్టేషన్ నుండి పిఠాపురం స్టేషనుకు 4 కి.మీ., అన్నవరం స్టేషనుకు 19 కి.మీ. దూరం. గొల్లప్రోలు రైల్వేస్టేషన్ చుట్టుప్రక్కల 27 గ్రామాలలో షుమారు 1,50,000 జనాభాకు ప్రయాణ వసతి కలిపిస్తుంది.[6]
[మార్చు] మండలంలోని గ్రామాలు
- కొదవలి
- చెందుర్తి
- దుర్గాడ
- విజయనగరం (గొల్లప్రోలు మండలం)
- చేబ్రోలు (గొల్లప్రోలు)
- వన్నెపూడి
- చిన జగ్గంపేట
- తాటిపర్తి
- గొల్లప్రోలు
- ఆలవెల్లి కొత్త మల్లవరం (గొల్లప్రోలు మండలం)
- ఆలవెల్లి పాత మల్లవరం (గొల్లప్రోలు మండలం)
- ఆలవెల్లి వెంకట నగరం
[మార్చు] వార్తల్లో
2007 జనవరి 10 - కూలీకి వెళుతున్నవారు రైలు పట్టాలు దాటుతుండగా రైలు వచ్చినందువల్ల నలుగురు స్త్రీలు మరణించారు.
[మార్చు] మూలాలు, వనరులు
- ↑ 1.0 1.1 1.2 Radhika Malpani. School In Gollaprolu. ILP Projects. తీసుకొన్న తేదీ: 2007-01-24.
- ↑ National Informatics Centre (2005). Item NO. XI. Sampoorna Grameena Rozgar Yojana. East Godavari District. తీసుకొన్న తేదీ: 2007-01-26.
- ↑ 3.0 3.1 Dr. MVR Prathamika Patasala, Gollaprolu. Asha for Education (2004). తీసుకొన్న తేదీ: 2007-01-24.
- ↑ MPPS - KARANAM GARI THOTA - GOLLAPROLU M. Sarva Shiksha Abhiyan (2004-2005). తీసుకొన్న తేదీ: 2007-06-21.
- ↑ Online Highways LLC (2004). Gollaprolu Railway Station. www.india9.com. తీసుకొన్న తేదీ: 2007-02-06.
- ↑ G. Satyanarayana (2004). Andhra Pradesh - Readers' Mail - Train halt. The Hindu. తీసుకొన్న తేదీ: 2007-02-05.
[మార్చు] బయటి లింకులు
- map of East Godavari showing Gollaprolu
- Dr. Satyanarayana Gavarasana (2000). A report on Dr. M. V. R. Memorial MPP Elementary School Day Function held on February 5, 2000. ECO Foundation. తీసుకొన్న తేదీ: 2007-01-27.
|
|
---|---|
మారేడుమిల్లి • వై.రామవరం • అడ్డతీగల • రాజవొమ్మంగి • కోటనందూరు • తుని • తొండంగి • గొల్లప్రోలు • శంఖవరం • ప్రత్తిపాడు • ఏలేశ్వరం • గంగవరం • రంపచోడవరం • దేవీపట్నం • సీతానగరం • కోరుకొండ • గోకవరం • జగ్గంపేట • కిర్లంపూడి • పెద్దాపురం • పిఠాపురం • కొత్తపల్లె • కాకినాడ(గ్రామీణ) • కాకినాడ (పట్టణ) • సామర్లకోట • రంగంపేట • గండేపల్లి • రాజానగరం • రాజమండ్రి (గ్రామీణ) • రాజమండ్రి (పట్టణ) • కడియం • మండపేట • అనపర్తి • బిక్కవోలు • పెదపూడి • కరప • తాళ్ళరేవు • కాజులూరు • రామచంద్రాపురం • రాయవరం • కపిలేశ్వరపురం • ఆలమూరు • ఆత్రేయపురం • రావులపాలెం • పామర్రు • కొత్తపేట • పి.గన్నవరం • అంబాజీపేట • ఐనవిల్లి • ముమ్మిడివరం • ఐ.పోలవరం • కాట్రేనికోన • ఉప్పలగుప్తం • అమలాపురం • అల్లవరం • మామిడికుదురు • రాజోలు • మలికిపురం • సఖినేటిపల్లి |
|
|
---|---|
కొదవలి · చెందుర్తి · దుర్గాడ · విజయనగరం · చేబ్రోలు · వన్నెపూడి · చిన జగ్గంపేట · తాటిపర్తి · గొల్లప్రోలు · ఆలవెల్లి కొత్తమల్లవరం · ఆలవెల్లి పాత మల్లవరం · ఆలవెల్లి వెంకట నగరం |