బిక్కవోలు
వికీపీడియా నుండి
?బిక్కవోలు మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | బిక్కవోలు |
జిల్లా(లు) | తూర్పు గోదావరి |
గ్రామాలు | 14 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
67,717 (2001) • 33642 • 34075 • 63.15 • 68.66 • 57.73 |
అక్షాంశరేఖాంశాలు:
బిక్కవోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఈ గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. క్రీ.శ.849 - 892 మాద్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ వూరికి ఆ పేరు వచ్చింది. వారి కాలంలో కట్టబడిన అనేక ఆలయాలలో శ్రీరాజరాజేశ్వరి ఆలయం మరియు శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ముఖ్యమైనవి. ఇవి చక్కని శిల్పకళతో ఆలరారుతున్నవి.
విషయ సూచిక |
[మార్చు] జన విస్తరణ
2001 జనాభా లెక్కల ప్రకారం బిక్కవోలు జనాభా 19,405. ఇందులో మగవారు 49%, ఆడువారు 51%. సగటు అక్షరాస్యత 70%. ఇది దేశపు సగటు అక్షరాస్యత అయిన 59.5% కంటే మెరుగు. అక్షరాస్యత మగవారిలో 75%, మరియు ఆడువారిలో 66%.
[మార్చు] సంస్కృతి
పురాతనమైన, చారిత్రికమైన ఆలయాలకు, వాటిలోని శిల్పకళా సంపదకు బిక్కవోలును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును.
[మార్చు] శ్రీ గోవిందరాజస్వామి ఆలయం
గోలింగేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలో శిలలపై చెక్కబడిన రచనలు ముఖ్యమైనవి. గర్భగుడి ద్వారం jambs పైన 33 లైనుల శాసనం చెక్కబడి ఉంది. ముఖమంటపంలో తూర్పు చాళుక్యులనాటి రెండు చక్కని శిల్పాలు భద్రపరచబడి ఉన్నాయి. వీటిలో ఒకటి "ఆలింగన చంద్రశేఖర మూర్తి"గా శివపార్వతుల శిల్పం. మరొకటి కూర్చొని ఉన్న గణేశ ప్రతిమ. ఇవి రెండూ శిల్పకళానైపుణ్యానికి ప్రతీకలు.(PI.XX and XXI). ఆలయం పైని విమానం ఒరిస్సా, ఖజురాహోల శైలిని గుర్తు తెస్తుంది.
[మార్చు] శ్రీ రాజరాజ ఆలయం
మూడు ప్రక్కలా ఉన్న గూడు (విగ్రహ మందిరం)లలో ఒక చోట నినాయకుడు, మరొకదాన్లో నెమలిపై ఆసీనుడైన కార్తికేయుడు, మరొక చోట మహిషాసుర మర్దినిగా అమ్మవారు మరియు శ్రీరాజరాజేశ్వరీ సమేతులైన శివలింగాకృతి ఉన్నాయి.
[మార్చు] శ్రీ చంద్రశేఖర స్వామి
శివలింగానికి నాలుగు ప్రక్కలా అందమైన చంద్రశేఖరస్వామి, బాల త్రిపురసుందరి శిల్పాలున్నాయి. The kudu is characterized by a great profusion of the makara element introduced on it than in similar ones either from the Canarese or Tamil Districts.
[మార్చు] ఏక శిలా గణేశుడు
11 అడుగుల గణేశ విగ్రహం తూర్పు చాళుక్యులనాటి విగ్రహాలన్నింటికంటే పెద్దది. కొంతకాలం రెండు చేతులతో ఉన్న ఈ విగ్రహానికి గుణగవిజయాదిత్యుని కాలంలో మరో రెండు చేతులు చెక్కబడినాయి సాతలూరులో లభించిన గుణగ విజయాదిత్యుని ముద్రికపై ఈ విధమైన గణేశమూర్తి, మరోవైపు లక్ష్మీదేని మూర్తి ఉన్నాయి. ఈ ముద్రిక ఇప్పుడుచెన్నైలోని ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.
[మార్చు] 1వ శివాలయం
గ్రామం శివారులలో ఉన్న శివాలయం మిగిలిన శివాలయాలలాగానే మూడు ప్రక్కల గూడులతో, మకర తోరణాలంకరణతో ఉంది. ఈ శిల్పాలలో ఒక నటరాజమూర్తి చతురభంగిమలో ఉన్నాడు. ఇక్కడ కనిపించే మరొక విశేషం - శివుడు లకులీశునిగా చూపబడడం (లకులీశ, లేదా నకులీశ̲ అనేది పాసుపతత శైవాన్ని బోధించిన గురువు. శివుని ప్రతిరూపంగా వారిచే ఆరాధింపబడ్డాడు. [1] తూర్పు గాంగగుల నాటిదైన ముఖలింగంలో కూడా దక్షిణామూర్తి లకులీశునిగా చూపబడ్డాడు.
[మార్చు] 2వ శివాలయం
పంట పొలాలలలో ఉన్న పెద్ద ఆలయం. ద్వారానికిరువైపులా ద్వారపాలకులు, గుమ్మంపైన లక్ష్మీదేవి విగ్రహాలు తప్ప ఈ ఆలయంలో శిల్పాలు లేకుండా సాదాగా ఉంటుంది.ఆలయం విమానం పల్లవుల కాలపు నిర్మాణశైలిని పోలిఉంటుంది.
[మార్చు] 3వ శివాలయం
ఈ ఆలయం ద్వారానికిరువైపులా గంగ, యమున నదీదేవతల విగ్రహాలున్నాయి. మందిరం పై భాగంలో మైదునం వంటి పలు భంగిమలు చెక్కబడి ఉన్నాయి. సూర్య, విష్ణు విగ్రహాలు గోలింగేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాలను పోలి ఉన్నాయి.
[మార్చు] ఉత్సవాలు
- మార్గశిర శుద్ధ షష్టి - సుబ్రహ్మణ్య షష్ఠి
- బాద్రపద శుద్ధ చతుర్ధి - వినాయక చవితి
[మార్చు] ప్రయాణ, ఇతర వసతులు
బిక్కవోలులో రైల్వే స్టేషను, బస్సు స్టేషను, పోస్టాఫీసు, తి.తి.దే.వారి కళ్యాణ మంటపం, ప్రభుత్వ ఆసుపత్రి, మండల ఆఫీసు, అగ్నిమాపక కార్యాలయం, టెలిఫోను ఆఫీసు, సినిమా హాళ్ళు, బ్యాంకులు, ఆలయాలు, రైసు మిల్లులు, పాఠశాలలు, పెట్రోలు పంపులు వంటి పలు వసతులున్నాయి.
రాజమండ్రినుండి (39 కి.మీ.), కాకినాడ (31 కి.మీ.) నుండి తరచు బస్సు సౌకర్యం ఉంది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- రంగాపురం
- ఇళ్లపల్లి
- తుమ్మలపల్లి
- రాళ్లఖండ్రిక
- బిక్కవోలు
- బలభద్రాపురం
- కాపవరం
- కొమరిపాలెం
- తొస్సిపూడి
- పండలపక
- ఊలపల్లి
- కొంకుదురు
- అరికరేవుల
- మేళ్లూరు
- పందలపాక
|
|
---|---|
మారేడుమిల్లి • వై.రామవరం • అడ్డతీగల • రాజవొమ్మంగి • కోటనందూరు • తుని • తొండంగి • గొల్లప్రోలు • శంఖవరం • ప్రత్తిపాడు • ఏలేశ్వరం • గంగవరం • రంపచోడవరం • దేవీపట్నం • సీతానగరం • కోరుకొండ • గోకవరం • జగ్గంపేట • కిర్లంపూడి • పెద్దాపురం • పిఠాపురం • కొత్తపల్లె • కాకినాడ(గ్రామీణ) • కాకినాడ (పట్టణ) • సామర్లకోట • రంగంపేట • గండేపల్లి • రాజానగరం • రాజమండ్రి (గ్రామీణ) • రాజమండ్రి (పట్టణ) • కడియం • మండపేట • అనపర్తి • బిక్కవోలు • పెదపూడి • కరప • తాళ్ళరేవు • కాజులూరు • రామచంద్రాపురం • రాయవరం • కపిలేశ్వరపురం • ఆలమూరు • ఆత్రేయపురం • రావులపాలెం • పామర్రు • కొత్తపేట • పి.గన్నవరం • అంబాజీపేట • ఐనవిల్లి • ముమ్మిడివరం • ఐ.పోలవరం • కాట్రేనికోన • ఉప్పలగుప్తం • అమలాపురం • అల్లవరం • మామిడికుదురు • రాజోలు • మలికిపురం • సఖినేటిపల్లి |
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మూలాలు, వనరులు
- ↑ Keerimalai Nakulisa or Lakulisa was the first preceptor of the Pasupata school of Saivism, which was the earliest among the sects of Saivism. The word pasupata should be pronounced as paa'supatha. Originating from Gujarat, the sect spread across the sub-continent and even beyond in historical times. The sect doesn’t exist today. The priority given to Guru (preceptor and initiator) in the fundamentals of Saiva Siddhanta (Guru, Linga, Sangama) and the idea that a Guru is Siva himself originated from the Pasupata teachings. The iconographic representations of Lukulisa which was synthesized with Buddha in his teaching position in some parts of South Asia, was synthesized into Siva in the form of a teacher (Thadchanaamoorthi ) in South India. The names Nakulisa and Lakulisa have come from the words nakula or lakula, which stood for the staff (the long stick displayed as a symbol of asceticism) of the preceptor.