సభ్యులపై చర్చ:వైజాసత్య
వికీపీడియా నుండి
|
[మార్చు] మొలకల గురంచి
ధన్యవాదాలు సత్యగారు. విషయం అర్థమయింది. మొలకల విషయంలో నా ఉద్దేశ్యం::
- మొలకలను 1 నుండి 250, 250 నుండి 500 ఇలా ఉత్సుకత చూపిన సభ్యులకు పంపిణీ చేసి, ఆ సభ్యులను ఆ మొలకల విషయంలో ఒక నిర్దిష్ట భవిస్య కార్యక్రమాన్ని ప్రదిపాదించవలసినదిగా కోరాలి
- ఈ ప్రతిపాదనలను ఒక ప్రత్యేక పుట ను తయారు చేసి (మొలకల వర్గీకరణ వంటి పేరుతో)అందులో పొందుపరచాలి, మొలకలను తొలగించటం, ఆ విషయం మీద ఇప్పటీకే ఉన్న వ్యాసంతో విలీనం చెయ్యటం వంటి ప్రదిపాదనలను చెయ్యచ్చు.అలా ప్రతిపాదించేటప్పుడు, ఈ పనికి ప్రత్యేకించబడిన సభ్యులు, ఆ మొలక లింక్ ఆ పుటలో తప్పనిసరిగా ఇవ్వాలి.
- ఇలా చెయ్యబడ్డ ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్య తీసుకోవటానికి ఇద్దరు ముగ్గురు సీనియర్ వికీ సభ్యులు కలసి వారానికి ఒకసారి నిర్ణయం ప్రకటీంచాలి.
- అటువంటి నిర్ణయం, మొలకలను ఏర్పరిచిన సభ్యునికి తెలియచెయ్యాలి, ఒక మూడు రోజుల వ్యవధి తరువాత, సీనియర్ల కమెటీ చేసిన ప్రకటన ప్రకారం మొదట, ఆ మొలకల మీద బవిష్య కార్యక్రమం ప్రతిపాదించిన సభ్యుడు చర్య తీసుకోవాలి.
- మొలకల పరిశీలన, సభ్యులకు పంపిణీ చేశేటప్పుడె ఏంత సమయంలో ఆ పని చెయ్యాలి (15-20 రోజులు)తెలియచెయ్యాలి. ఆ సమయంలో ఆ పని జరగక పోతే మరొక 7 రోజుల వ్యవది ఇవ్వాలి. ఆప్పటికి, ఆ పని జరగకపొతే, మరొక సభ్యునికి పంపిణీ చెయ్యాలి
- దీనికి సాఫ్ట్వేర్ లొ ఈక్రింది అవకాశాలు ఉంటే అంతయినా ఉపకరిస్తుంది:
-
- మొలక ఏర్పరిచిన సభ్యునికి, అతను లాగ్ ఇన్ అయిన ప్రతిసారి, అతను ఏర్పరిచిన మొలకలగురించి ఒక రెమైడరు అటోమాటిక్ గా రావడం
-
- భవిష్య కార్యక్రమం ప్రత్యేక పుటలో వ్రాయగానే, ఆ మొలక ఏర్పరిచిన సభ్యునికి, ఆ ప్రతిపాదన అతను లాగ్ ఇన్ అయిన వెంటనే అటోమాటిక్ గా సందేశం వెళ్ళటం
- మొలకలగురించి బాధ్యత అప్పగించబడిన సభ్యునికి, అతను ఇంకా భవిష్య కార్యక్రమం చెయ్యని మొలకల సంఖ్య, తదుపరి చర్య తీసుకొని మొలకల సంఖ్య సందేశంగా అతను లాగ్ ఇన్ అయిన వెంటనే రావటం.
ఈ విధమయిన కార్యాచరణ మనం ఆచరించగలిగితే, మొలకల సంఖ్య గణనీయంగా తగ్గించి, వ్యాసాల సంఖ్యను పెంచవచ్చును. ఈ విషయం దేవా గారికి కూడా తెలియచేసాను. పరిశీలించి తెలియచెయ్యగలరు.--SIVA 04:01, 18 ఏప్రిల్ 2008 (UTC)
-
-
- మొలకల జాబితా దిశగా, నేనొక చిన్న ప్రయత్నం ఇక్కడ ప్రారంభించాను వికీపీడియా:మొలకల జాబితా, ఆటోమేటిగ్గా గుర్తుచేయటం ఎంతవరకు సాధ్యమౌతుందో పరిశీలించాలి. మీ సూచనలు బాగున్నాయి --వైజాసత్య 04:53, 25 ఏప్రిల్ 2008 (UTC)
-
[మార్చు] రంగారావుగారి వ్యాఖ్య
ధన్యవాదములు సత్యా గారూ. నా ఉద్దేశ్యం, ఎవరూ కూడాావతలి వారిని బాధ పెట్టే వ్యాఖ్యలు చెయ్యకూడదని. నలుగురూ కూడి చెయ్యవలసిన పని ఇది. చివరకు అందరికి అమోదయోగ్యమయినది నిలుస్తుంది. మార్పు చేసినవాళ్ళమీద దురుసుగా వ్యాఖ్యలు చెయ్యటం తగదు అన్న విషయం సభ్యుడి/ల కు తెలియాలి. నేనుకూడా అంత కటువుగా జవాబు వ్రాస్తే బాగుండదుకదా! అందుకనే నేను ఈ విషయం ఇతర సభ్యులకు తెలియచేసినది. కాసు బాబు గారు మధ్యవర్తిత్వం నాకు సమ్మతమే. ఈ సంఘటన పర్యవసానం మాత్రం, ఎవరిని కించపరచకుండా ఉండాలి.రచనలు చేసే సభ్యులు, ఇతర సభ్యులు చేసే మార్పులను గౌరవించగలగాలి, అవసరమయితే చర్చ చెయ్యాలి, వ్యాఖ్యలకు చోటు ఉండకూడదు అని నా అభిప్రాయమం --SIVA 19:41, 17 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] "వికీపీడియా:పుస్తకాల వ్యాసాల జాబితా" నేమ్ స్పేసు
వైజా సత్యా! పుస్తకాల వ్యాసాల జాబితా ను వికీపీడియా:పుస్తకాల వ్యాసాల జాబితా నేమ్ స్పేసుకు తరలించావు. కాని జాబితాలు "వికీపీడియా:" నేమ్ స్పేసులో ఉండవలసిన అవుసరం లేదనుకొంటాను. దేశాల జాబితాల జాబితాలో ఎన్నో జాబితాలు వ్యాసాలుగానే ఉన్నాయి గదా! ఆంగ్ల వికీలో కూడా ఈ పద్ధతే వాడారనుకొంటాను. --కాసుబాబు 08:27, 3 మార్చి 2008 (UTC)
[మార్చు] Bot status for Purbo T
Hi వైజాసత్య దిద్దుబాటు, I am sorry, I cannot write తెలుగు. Hopefully, you can read English. Have a look at వికీపీడియా:Bot/Requests_for_approvals#Purbo_T, please, and possibly grant a bot flag for Purbo T. There are no objections. Thank you. -- Purodha Blissenbach 22:57, 7 మార్చి 2008 (UTC)
[మార్చు] తెలుగు పై వ్యాసములు
వైజాసత్య గారు,
దినేశ్ కన్నంబాడి అను కన్నడిగుడు తెలుగు భాష పై నేను వ్రాసిన వాక్యములు, చేసిన దిద్దుబాటులను మార్చుచున్డెను. Please see: en:Telugu language, en:Telugu script, en:Bhattiprolu. ఆతని మొండి వాదనలు, ఆతనికి తోడ్పాటుగా మరి ముగ్గురు కన్నడిగులు తెలుగు వ్యాసములలో నన్ను ఒక సంవత్సరముగా మిగుల విసిగించుచుండిరి. వికి లో గల సౌలభ్యములతో నన్ను బహుళ చికాకుపరచి నేను చేసిన అన్ని మార్పులను తొలగంచుచున్నారు. ఈ విషయమున నేను మీ అందరి సహాయము కోరుతున్నాను.Kumarrao 06:13, 11 మార్చి 2008 (UTC)
- నాకు దినేశ్ కన్నంబాడి పరిచయమే..ప్రస్తుతం కాస్త బిజీగా ఉన్నాను..వీలు చిక్కగానే చూస్తాను --వైజాసత్య 01:24, 13 మార్చి 2008 (UTC)
[మార్చు] అధికారి బాధ్యతల గురించి
వైజా సత్యా! వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తిలో నువ్వు మొదలుపెట్టిన ఎర్రలింకుల ఆధారంగా నన్నూ, ప్రదీప్‌నూ అధికారి బాధ్యతలకు ప్రతిపాదించే అభిప్రాయం నీకున్నదనిపించింది (ఇది నిజం కాకపోవచ్చును!). అధికారి బాధ్యతలకు నేను సుముఖంగా లేను. (1) ఇప్పటికే చేయవలసిన పనులు చాంతాడంత ఉన్నాయి. అదనపు బాధ్యతలు తగవు (2) ప్రోగ్రామింగ్, మీడియా వికీ, బాట్ల విషయంలో నాకు అస్సలు అవగాహన లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయమనుకొంటాను. కనుక మన్నించి ఆ ప్రతిపాదన విరమించుకోగలవా? ఇక పోతే ప్రదీప్‌ను అధికారిగా ప్రతిపాదించాలని నేను కొద్ది రోజులుగా అనుకొంటున్నాను. అతని అనుమతి తీసుకొని ప్రతిపాదిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:00, 12 మార్చి 2008 (UTC)
- అవును, నేను మిమ్మల్ని, ప్రదీపును అధికారిగా ప్రతిపాదించాలని అనుకున్నాను. చంద్రకాంతరావు నిర్వాహక ఓటింగు గడువు ముగిసిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని రోజులు హోదా ఇవ్వటానికి ఆలస్యం అయ్యింది..ఇంకా బాట్లకు అనుమతులు కూడా పేరుకు పోయాయి. అధికారిగా పెద్దగా అదనపు బాధ్యతలేమీ ఉండవు..నిర్వాహక హోదాలు, బాటు హోదాలు కల్పించడము, సభ్యనామాల్ని మార్చటం తప్ప. అయినా మీరు వద్దనుకుంటే మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. ప్రదీపును ప్రదిపాదించగలరా..నాకీ మధ్య కొత్త ఉద్యోగం వళ్ళ వీలు చిక్కట్లేదు. నెనర్లు --వైజాసత్య 01:21, 13 మార్చి 2008 (UTC)
[మార్చు] నిర్వాహకుల వివరాలు
వైజా సత్యా! వికీపీడియా చర్చ:నిర్వాహకుల జాబితాలో చిన్న సమాచారం అడిగాను. నీలు దొరికినపుడు చూడ గలవు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:57, 14 మార్చి 2008 (UTC)
[మార్చు] ధన్యవాదాలు
అధికారి హోదాకై నేను చేసిన విజ్ఞప్తికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:24, 20 మార్చి 2008 (UTC)
[మార్చు] మతం
వైజాసత్య గారు,
మతంఅనే పదాన్ని ఎవరో దుర్వినియొగ పరుస్తూ వ్రాసిన వ్యాసాన్ని లోగడ మీరు తొలగించినట్లు చరిత్ర సూచించుచున్నది. నేను మరలా వ్యాసాన్ని ప్రారంబించి నాను సరిచూడగలరు.
తిరుమల శ్రీనివాస్ 09:33, 24 మార్చి 2008 (UTC)
[మార్చు] సమాచారపెట్టె సహాయం
వైజా సత్యా!
సభ్యులపై చర్చ:Madhusurapaneni లో ఆయన అడిగిన సహాయం (please tell me how to create an infobox. I am making one for actors! u can mail me at smadpr@gmail.com) మరియు ఆయన చేస్తున్న మూస మూస:సమాచారపట్టిక నటుడు ఒకమారు చూడ గలవు. అతను అడిగిన విషయం నాకు ఏమీ తెలియదు.
అలాగే సభ్యులపై చర్చ:Bojja లో అడిగిన సహాయం కూడా పరిశీలించగలవు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:58, 24 మార్చి 2008 (UTC)
[మార్చు] క్రొత్త దళాల ప్రతిపాదన
వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) లో క్రొత్త దళాల ఏర్పాటు ప్రతిపాదించాను. ఒకసారి చూడండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:56, 2 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] ఈ వారం సమైక్య కృషి
వైజాసత్య గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] కల్లూరి చంద్రమౌళి
వైజాసత్య గారు, వ్యాసాన్ని విస్తరించాను. చూడగలరు.Kumarrao 15:58, 20 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] ధన్యవాదాలు
వైజాసత్య గారు , సినిమా వ్యాసాలలోనా ప్రయత్నాన్ని గమనించినందుకు ధన్యవాదాలు.Deepasikha 05:03, 21 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] Meta CheckUser
నాకు Gopikrishna123 (చర్చ • దిద్దుబాట్లు) మరియు మౌర్యుడు (చర్చ • దిద్దుబాట్లు) sockpuppets అని అనుమానం వచ్చి, మెటాలో CheckUser విజ్ఞప్తి చేసాను. ఒక సారి చూడండి. చర్చసాయీరచనలు 12:01, 28 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] తెవికీ పాలసీలపై ఒక చర్చ
వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 07:32, 29 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] విన్నపం
నాకు ఇష్టమయితే నా నిర్వాహక హోదాను ఉపసంహరిచమని నన్ను మిమ్మల్ని అడగమని కాసుబాబుగారు చెప్పారు. నాకయితే నిర్వాహక హోదా కోల్పోవాలని లేదు. కానీ ఒకవేళ మీరందరు కలిసి నిర్ణయం తీసుకుంటే దానికి బద్దుడను.నా అంగీకారాన్ని ఇక్కడే తెలియ జేస్తున్నానునా హోదాను వెనక్కు తీసుకున్నా సాధారణ సభ్యునిగా దిద్దుబాట్లు కొనసాగిస్తాను. రవిచంద్ర(చర్చ) 09:43, 29 ఏప్రిల్ 2008 (UTC)
- నిర్వహకహోదా తొలగించే హక్కులు తెవికీ అధికారులకు కూడా లేవు. నిర్వాహకహోదా తొలగించాలంటే సముదాయం చర్చ, ఓటింగు జరగాలి. ఆ చర్చ మరియు ఓటింగు ఫలితాన్ని మెటాలోని ఒక స్టీవార్డుకు విన్నవించి నిర్వాహకహక్కులు తొలగించమని నివేదించుకోవాలి. కానీ, మీకు నిర్వాహకహోదా కోల్పోవాలని లేనప్పుడు అలాంటి చర్చను మీరు ప్రారంభించకండి. ఇతర సభ్యులెవరైనా తొలగింపు చర్చను ప్రారంభిస్తే అప్పుడు దానిపై చర్చించవచ్చు. --వైజాసత్య 03:27, 30 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] తెలుగు వికీపీడియా ట్రాఫిక్
ఈ విషయం మీకు తెలిసే ఉండొచ్చు. నేనెప్పటినుంచో తెలుసుకోవాలనుకుంటున్న తెలుగు వికీపీడియా ట్రాఫిక్ en:User:Henric నడుపుతున్న బీటా వెర్షన్‌లో ఉన్నది. ఇది మీకు మరియు ఇతర నిర్వాహకులకు ఉపయోగపడవచ్చు. అందులో రికార్డయిన దాని ప్రకారం మొదటిపేజీకి అత్యధికంగా 3 ఫిబ్రవరి 2008న 7,700 హిట్స్ వచ్చాయి. Hopefully this should be my last edit on telugu wikipedia. δευ దేవా 16:09, 1 మే 2008 (UTC)
- నాకు తెలియదు, ఈ విషయం తెలియజేసినందుకు కృతజ్ఞతలు. తెలుగు వికీపీడీయా నుండి నిష్క్రమించాలనుకోవటం మీ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని గౌరవిస్తాను కానీ నిష్క్రమణ కేవలం తెలుగు వికీ నుండేనా లేక మొత్తం వికీపీడియా నుండో తెలియజేస్తే సంతోషిస్తాను --వైజాసత్య 01:45, 2 మే 2008 (UTC)
[మార్చు] క్రొత్త సినిమాలకు పేజీలు
వైజా సత్యా!
మనం ఇంతకు ముందు 2000 సంవత్సరం వరకు సినిమా పేజీలు సృష్టించామనుకొంటాను. తరువాతి సినిమాలకు కూడా పేజీలు సృష్టిస్తే కనీసం సమాచారం సమగ్రంగా ఉంటుంది కదా? అవుసరమైతే నేను అనువదిస్తాను. ఈ మధ్య వచ్చిన సినిమాల గురించి మరిచిపోక మునుపే వాటి గురించి వ్యాసాలు వ్రాసే అవకాశం ఉంటుంది. వీటి గురించి ఇప్పుడు నెట్లో కూడా సమాచారం లభించే అవకాశం ఉంది. తరువాత అది కష్టం కావచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:50, 4 మే 2008 (UTC)
- అవును, బాగా గుర్తుచేశారు. నేను జాబితాలు సంపాదించి ఆ పని మీద ఉంటా --వైజాసత్య 05:59, 4 మే 2008 (UTC)
[మార్చు] రచ్చ బండ
మొదటి పేజీలో రచ్చబండ కనిపించడం లేదు. ఇదివరకు ఒకసారి ఈ సమస్య తలెత్తితే కాష్ రిఫ్రెష్ చేసుకోమన్నారు. కానీ ఇప్పుడు అలా చేసినా కనిపించడం లేదు. నేను కూడా మొదటి పేజీ సోర్సును పరిశీలించాను. అంతు చిక్కడం లేదు. ఇది ఏమైనా బ్రౌజర్ కు సంబంధించిన సమస్యా? తెలియ జేయగలరు. రవిచంద్ర(చర్చ) 09:16, 6 మే 2008 (UTC)
- ఎడమవేపు మార్గదర్శకము నుంచి పైకి మార్చారా? నేను సరిగా చూడలేదు. అక్కడే ఉంది లెండి. రవిచంద్ర(చర్చ) 09:44, 6 మే 2008 (UTC)
[మార్చు] ధన్యవాదాలు
పైజాసత్య గారూ, నమస్కారం, మీప్రోత్సాహానికి మన॰పూర్వక ధన్యవాదాలు. తెవికీ 40,000 వ్యాసాల మైలురాయికి చేరుకోవడం హర్షణీయం, ఆ మైలురాయి దగ్గర నేను వ్రాసిన వ్యాసం వుండడం నా అదృష్టం. తెవికీ విజ్ఞానదాయకంగా రూపొందించడంలో మీ పాత్ర 'తలమానికం', మీ సూచనలకు ఎల్లప్పుడూ స్వాగతం. మిత్రుడు నిసార్ అహ్మద్ 11:49, 9 మే 2008 (UTC)
[మార్చు] లైసెన్సు వివరాలు
బొమ్మ:Nizamabad.jpg లో నేను పెట్టిన FAIR USE RATIONALE చూడండి. ఇది ఓకేనా! అలాగయితే మిగిలిన మండలాల బొమ్మలకు కూడా ఈ నోటీసు పెడదాము. (ఒక మూస ఉంటే మరీ మంచిది) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:41, 14 మే 2008 (UTC)
- మండలాల బొమ్మలు సొంతగా తయారుచేసినవి కాబట్టి వాటికి ఫెయిర్ యూజ్ అవసరం లేదనుకుంటా..కానీ ఈ జిల్లా పటాలు ఏమి చెయ్యాలో తెలియట్లేదు. ప్రస్తుతానికి మీరు వ్రాసింది బాగానే ఉంది. --వైజాసత్య 05:02, 16 మే 2008 (UTC)
-
- ప్రస్తుతానికి నేను వ్రాసింది వాడుదాము. నేను వ్రాసిన విషయం ఆధారంగా {{Fair use admin division outline}} అనే మూసను తయారు చేయగలరా? వర్గం:కాపీహక్కులు సందిగ్ధంలో ఉన్న బొమ్మలు లిస్టును కుదించడానికి ప్రయత్నిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:27, 16 మే 2008 (UTC)
-
-
- ఇంకొక సంగతి - బొమ్మ:1Mukhadwaram.jpgలో నేను {{GFDL assumed}} అనే మూసను పెట్టాను. ఒకమారు చూసి మీ అభిప్రాయం చెప్పండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:44, 16 మే 2008 (UTC)
- Fair use admin division outline తయారు చేస్తాను. ఈ జీఎఫ్డీఎల్ అజ్యూమ్డ్ తాత్కాళికంగా ఫర్వాలేదు కానీ. వీలైనంతవరకు అలాంటి జాబితా పెరగకుండా చూసుకోవాలి. సమస్యల్లా ఎక్కడ వస్తుందంటే వికీపీడియాలో ఉన్నవన్నీ ఉచితం అని జనాలు అనుకుంటారు. అలా వికీపీడియాలో ఉన్న బొమ్మని వందలాది ఇతర సైట్లు ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత దాని కాపీహక్కులు ఉన్నాయని తొలగించేసినా, అనేక ఇతర సైట్లలో ఆపాటికే చేరటం వల్ల హక్కుదారుని హక్కులకు భంగంకలుగుతుంది. కందర్ప గారు నాకు తెలుసు. ఆయన తరఫున నేను కొన్ని బొమల్ని అప్లోడు కూడా చేశాను. ఆయన అనుమతి తీసుకొని ఈ బొమ్మ లైసెన్సు మార్చేస్తా. --వైజాసత్య 05:54, 16 మే 2008 (UTC)
- అవును. అసలు GFDL assumed అనే concept కూడా సమంజసం కాదనిపిస్తుంది. దాని బదులు Fair Use Assumed అని వ్రాస్తే మధ్యస్తంగా ఉంటుందనుకొంటున్నాను. కందర్ప గారు మాత్రమే కాదు. ఇంకా చాలా బొమ్మలు అలా ఉన్నాయి. అప్పట్లో కాపీ హక్కులు గురించి దృఢమైన సూచనలు ఇవ్వనందువలన వాళ్ళు కాపీ హక్కుల ట్యాగ్‌లు పెట్టలేదు. కనుక ఆ బొమ్మలు తొలగిస్తే కూడా వారి అభీష్టానికి విరుద్ధంగా నడచుకొన్నట్లవుతుంది అనుకొంటున్నాను. ఇక పోతే పాలిసీల మూసలు ఇదివరకు ఉన్నవి నేను గమనించలేదు. నకళ్ళను తొలగిస్తాను లేదా దారి మారుస్తాను. పాలిసీల పేజీలు వ్యవస్థీకరించడానికి కొంత సమయం పడుతుంది కాని అవసరమనిపిస్తుంది. ఒక దశకు వచ్చినాక చర్చకు ప్రతిపాదిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:39, 20 మే 2008 (UTC)
- ఇంకొక సంగతి - బొమ్మ:1Mukhadwaram.jpgలో నేను {{GFDL assumed}} అనే మూసను పెట్టాను. ఒకమారు చూసి మీ అభిప్రాయం చెప్పండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:44, 16 మే 2008 (UTC)
- బొమ్మ:Telugulipi evolution.jpg కాపీ హక్కుల గురించి ఏమయినా ట్యాగ్ పెట్టగలవా? ఎందుకంటే అది ఇంగ్లీషు వికీపీడియాలో పెట్టాలనుకొన్నాను. కుమారరావు గారి కోరిక మేరకు. అలాగే సమయం దొరికితే en:Talk:Telugu script కూడా చూడగలవు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:39, 20 మే 2008 (UTC)
-
- సభ్యులపై చర్చ:Vu3ktb లో మీ వ్యాఖ్యపై నా అభిప్రాయం --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:16, 22 మే 2008 (UTC)
[మార్చు] ఆటోమాటిక్ సభ్యులు
ఈ రెండుమూడు రోజుల్లోనూ చాలా మంది క్రొత్త సభ్యులు "Account created automatically" అన్న వ్యాఖ్యతో నమోదు అవుతున్నారు. దీని అర్ధం ఏమిటి? ఇదేమైనా స్పామ్ లాంటిదా? ఏమి చేయాలి? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:43, 27 మే 2008 (UTC)
- కాదు, వికీపీడియా ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల్లోని సభ్యుల అకౌంట్లను ఏకీకృతం చేస్తోంది. అంటే ఒకే సభ్యనామంతో ఏ వికీ ప్రాజెక్టులోనైనా లాగినయ్యే సౌకర్యం ఉంది. అభిరుచుల్లో గ్లోబల్ ఖాతాను నిర్వహించుకునే అవకాశం ఉంది. అలాగే ఇది చూడండి [1]. ఈ ఆటోమేటిక్ సభ్యులు వేరే ఏదైనా వికీలో సభ్యులై ఉండి, అన్నీ వికీల్లో సభ్యనామం సృష్టించమని ఎక్కడో నొక్కి ఉంటారు (నాకూ ఇది ఎలా చెయ్యాలో వివరాలు పూర్తిగా తెలియదు) --వైజాసత్య 23:01, 27 మే 2008 (UTC)
[మార్చు] వైజాసత్య గారికి కృతజ్ఞతలు,అభినందనలు :-)
నేను రఘు గారి ఫోటో(http://ilovehyderabad.com/interviews/interviews-i-write-with-the-light.html) నుండి సేకరించాను. మీరు తెలియపరచినట్టు నేను సోర్సు ఇవ్వటం మరచినట్టు ఉన్నాను.తెలియ పరచినందుకు కృతజ్ఞతలు. నాకు అర్థం కాని విషయం రఘు గారి వ్యక్తిగత విషయాలు (ఎవరి ద్వారా వి.ఎస్.ఆర్ స్వామి గారి దగ్గర చేరింది) ఎలా తెలుసుకున్నారు.తెవికి లో మీ కృషి చూస్తుంటే మీ కింత ఓపికా,శక్తి ఎలా వొచ్చాయో అని ఆచర్య మేస్తుంది.మీ కృషి కి అభినందనలు. నేను ఎం.వి.రఘు గారి దగ్గర పనిచేశాను.ఆయన అవార్డ్ ఫోటోలు,వర్కింగ్ స్టిల్ల్స్,కామేరామన్ గా చేసిన సినిమాల వివరాలు వ్యక్తీ గతంగా సేకరించి అప్లోడ్ చేస్తే సోర్సు ఎలా ఇవ్వాలో సందేహం.తీర్చగలరు. వ్యక్తిగతంగా సేకరించాను అని తెలిపితే వుంచుతారా?! లేక కాపీ హక్కుల గొడవ కారణముతో తీసేస్తార!? కొందరు ఘనులు వున్నారు తెసేసేదానికి.అందుకే సందేహం వాసు. bojja 13:42, 2 జూన్ 2008 (UTC)
- మీరు పైన ఇచ్చిన లింకులోని ఇంటర్యూలో రఘుగారు స్వయంగా చిత్రరంగములో ఎలా ప్రవేశించారో చెప్పారు. నేను అదే చేర్చాను తప్పు నాకు ప్రత్యేకంగా ఏమీ తెలీదు. మీరు రఘుగారు స్వయంగా తెలుసుకాబట్టి స్వయంగా సంపాదించిన ఫోటోలు పెడితే సదుపయోగం ద్వారా తెచ్చుకున్నవి తీసెయ్యవచ్చు. మూలాలని నమ్మశక్యం కానీ విషయాలకు, వివాదాస్పదమైన విషయాలకు మరీ గుచ్చి అడుగుతారు. కానీ మీరు రఘుగారి గురించి వ్రాసే మామూలు సమాచారానికి అంత ఖచ్చితంగా మూలాలు అక్కర్లేదు కానీ మీరు వ్రాసిన వాటికి వీలైతే వాటిని బలపరుస్తూ ఎక్కడైనా తర్వాత సమాచారం కనిపిస్తే దాన్నే మూలంగా ఉదహరించవచ్చు. ఫోటోలకు ఎలాగు వ్యక్తిగతంగా సేకరించినట్టు అప్లోడ్ చేస్తారు. సమాచారానికి అలా వ్రాయవలసిన అవసరం లేదు. సొంతగా సమాచారం సేకరించడానికి, ప్రాథమిక రచనకు ఒక సన్ననిగీత ఉంది. సొంతగా సమాచారం సేకరించాం అంటే క్షుణ్ణంగా పరిశీలించని వాళ్ళు అది ప్రాథమిక రచన అని పొరబడి తీసివేసే అవకాశం ఉంది. ఉదాహరణకి రఘు గారి పుట్టినరోజును ఆయన్ని అడిగి మీరే సొంతగా సేకరించారనుకోండి అది మూలాలు లేకపోయినా ప్రాథమిక రచన కాదు ఎందుకంటే మీరు ప్రపంచములో మొట్టమొదటిసారి రఘుగారి పుట్టినరోజు ఇది అని కనుక్కోవటం లేదుకదా. ఇంకో సంబంధిత ఉదాహరణలో పోతన పుట్టిన రోజును వివిధ చారిత్రక, శాసన, సాహితీ ఆధారాలతో ఫలానాతేదీ అని మీరు నిగ్గుతేల్చారనుకోండి అది మీరు వికీపీడియాలో చేర్చటానికి లేదు. వికీపీడియాలో ఆ విషయం చేర్చటానికి మీరుదాన్ని ఇంకెక్కడైనా ప్రాధమికంగా ప్రచురించి ఉండాలి. --వైజాసత్య 00:30, 3 జూన్ 2008 (UTC)
[మార్చు] 3 లక్షో దిద్దుబాటు
తెలుగు వికీపీడియా 3 లక్షల దిద్దుబాట్లను దాటేసిందని ఇవాళే గమనించాను. వికీపీడియా:వికీపీడియా మైలురాళ్ళు పేజీలో 3లక్షో దిద్దుబాటును ఎవరు చేసారనే దానిని మార్చాను. ఒకసారి గమనించి మీ సలహాలను కూడా ఇవ్వండి. --మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 11:24, 3 జూన్ 2008 (UTC)
[మార్చు] సినిమా మూస, వగైరా
- {{సినిమా}} మూసలో ఏదో పొరపాటున్నట్లుంది. "year" పరామితికి సంబంధించినది. చూడగలరా?
- ఫైర్‌ఫాక్స్-3 పెట్టుకొన్నాక ఎడిట్ పెట్టెపైన "తెలుగులో వ్రాయడానికి టిక్కు పెట్టండి" చెక్ బాక్సు రావడం లేదు. పైన ఉండాల్సిన బటన్స్‌లో కూడా కొన్ని కనిపించడంలేదు. దీన్ని గురించి ఏమయినా తెలుసా?
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:34, 19 జూన్ 2008 (UTC)
- సినిమా మూసను సరి చేస్తాను. ఫైరుఫాక్సు మూడుతో నాకు అదే సమస్య. యూజర్ స్క్రిప్టులేవి పనిచేస్తున్నట్టులేవు. ఒక వారం నుండి ఇండిక్ ఇన్పుట్ తో మార్పులు చేర్పులు చేస్తున్నా. ప్రదీపుని కనుక్కోవాలి --వైజాసత్య 00:30, 20 జూన్ 2008 (UTC)
- సినిమా మూసలో పైన సినిమా పేరు ప్రక్క ఆ సంవత్సరం సినిమాల జాబితా వ్యాసంకు లింకు బ్రాకెట్లలో వస్తున్నది. ఇది ఓకే. దీనికి అదనంగా "వర్గం:ఫలాని సంవత్సరం సినిమాలు" కూడా ఇదివరకు వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:44, 20 జూన్ 2008 (UTC)
[మార్చు] థాంక్స్
వైజాసత్యగారు! నా పునరాగమనాన్ని మళ్ళీ స్వాగతిస్తున్నందుకు థాంక్స్ δευ దేవా 08:22, 23 జూన్ 2008 (UTC)